టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

శామ్‌సంగ్ ఎస్‌27 ఆల్ట్రా లీక్స్: 2ఎన్ఎమ్ ఎగ్జినోస్ 2700 చిప్‌సెట్, మారనున్న ధర అంచనాలు!

Samsung Galaxy S27 Ultra Price & Specs Leaked: Flagship to Feature 2nm Exynos 2700 Chipset
---Advertisement---

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌27 ఆల్ట్రా’ (Samsung Galaxy S27 Ultra) పై కీలక లీక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఆంటోనీ వెల్లడించిన కథనాల ప్రకారం, శామ్‌సంగ్ కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అయిన ‘ఎగ్జినోస్ 2700’ (Exynos 2700) చిప్‌సెట్‌తో గెలాక్సీ ఎస్‌27 ఆల్ట్రాను అంతర్గతంగా పరీక్షించడం ప్రారంభించింది. డిసెంబర్ 2026లో లాంచ్ కానున్న ఈ ఎగ్జినోస్ 2700 చిప్‌సెట్‌ను అత్యంత ఆధునిక 2 నానోమీటర్ (2nm) ప్రాసెస్‌ ఆధారంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

డిజైన్ మరియు డిస్‌‌ప్లే పరంగా కూడా గెలాక్సీ ఎస్‌27 సిరీస్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఫోన్‌లో శామ్‌సంగ్‌కు చెందిన నూతన ఎం16 ఓఎల్‌ఈడీ (M16 OLED) డిస్‌ప్లే మెటీరియల్‌ను ఉపయోగించనున్నారు. అలాగే వెనుక వైపు కెమెరా మాడ్యూల్‌ను సరికొత్త రెక్టాంగ్యులర్ ఫ్రేమ్‌లో పిల్-షేప్డ్ మరియు వర్టికల్ కెమెరా లేఅవుట్‌తో రీడిజైన్ చేస్తున్నట్లు లీకైన రెండర్లు సూచిస్తున్నాయి. శామ్‌సంగ్ ఎస్‌27 ఆల్ట్రా మోడల్ గ్లోబల్ మార్కెట్‌లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్‌కు గట్టి పోటీగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ధర విషయానికి వస్తే, గతంలో విడుదలైన గెలాక్సీ ఎస్‌26 ఆల్ట్రా ప్రారంభ ధర $1,299 కాగా, రాబోయే గెలాక్సీ ఎస్‌27 ఆల్ట్రా ధరలో $100 పెంపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా మార్కెట్‌లో దీని ప్రారంభ ధర $1,399 (భారత కరెన్సీలో దాదాపు ₹1,17,000)గా ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2027లో ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2nm ప్రాసెసర్ టెక్నాలజీతో వస్తున్నందున సిపియు, జిపియు మరియు ఐఐ (AI) పనితీరులో ఈ ఫోన్ సంచలనాలు సృష్టిస్తుందని టెక్ ప్రియులు ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now