టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

జమ్మూ కాశ్మీర్ వ్యాఖ్యలపై ఓఐసీకి భారత్ ఘాటు కౌంటర్: “మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు”

India's sharp retort to OIC over Jammu & Kashmir remarks
---Advertisement---

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ మహాసభ (UNGA) సమావేశాల సందర్భంగా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్’ (OIC) కాంటాక్ట్ గ్రూప్ జమ్మూ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, భారతదేశపు పూర్తిగా అంతర్గతమైన విషయాలపై మాట్లాడే అర్హత కానీ, చట్టబద్ధమైన హక్కు  కానీ ఓఐసీకి ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలేనని పునరుద్ఘాటించిన విదేశాంగ శాఖ, రాజకీయ ప్రేరేపిత ప్రచారాలను పదేపదే నెమరువేసినంత మాత్రాన ఈ నగ్న సత్యాన్ని ఎవరూ మార్చలేరని హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రయోగిస్తున్న తప్పుడు ప్రచారానికి వేదికగా మారడం ద్వారా ఓఐసీ అంతర్జాతీయంగా తన సొంత విశ్వసనీయతనే కోల్పోతోందని తీవ్ర స్థాయిలో మండిపడింది.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కే బుద్ధి చెప్పాలి: విదేశాంగ శాఖ

పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవడం మాని, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశానికే తగిన బుద్ధి చెప్పాలని విదేశాంగ శాఖ ఓఐసీకి హితవు పలికింది. “తమ సొంత భూభాగం నుండి ఉద్భవిస్తున్న ఉగ్రవాద ముప్పును అరికట్టేలా, ఉగ్రవాదానికి నిలయంగా మారిన పాకిస్థాన్ వైపు చూసి దానికి ఉపదేశం చేస్తే ఓఐసీకి శ్రేయస్కరం” అని విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో జరిగిన OIC కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో పాకిస్థాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ పాల్గొని కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో భారత్ ఈ స్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్థాన్ కుట్రలను ప్రపంచ వేదికలపై ఎప్పటికప్పుడు ఎండగడుతున్న భారత్, తన సార్వభౌమాధికారం మరియు అంతర్గత వ్యవహారాల విషయంలో ఎలాంటి విదేశీ సంస్థల జోక్యాన్ని సహించేది లేదని ఈ ఘాటైన ప్రకటన ద్వారా మరోసారి ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now