టాప్ 10 వార్తలు విద్యా-ఉద్యోగాలు రాజకీయం విజ్ఞానం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ స్థానికం దేశం అంతర్జాతీయం ఏఐ జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

అయ్యప్ప దీక్షాపరుడికి ఆఫీసులోకి నో ఎంట్రీ: ఆదిభట్ల టీసీఎస్ ఎదుట హిందూ సంఘాల భారీ ఆందోళన

---Advertisement---

హైదరాబాద్ శివారు ఆదిభట్లలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం ఎదుట గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప దీక్ష చేపట్టిన మనీష్ అనే ఉద్యోగిని డ్రెస్ కోడ్ సాకుతో కంపెనీ లోపలికి అనుమతించకపోవడంపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

గత రెండేళ్లుగా తాను టీసీఎస్‌లో పనిచేస్తున్నానని, రెండు నెలల క్రితమే అయ్యప్ప దీక్ష గురించి మేనేజ్‌మెంట్‌కు ముందస్తు సమాచారం ఇచ్చానని మనీష్ తెలిపారు. అయినప్పటికీ, డ్రెస్ కోడ్ నిబంధనల పేరుతో తనను కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే, డ్రెస్ కోడ్ పాటించని ఇతర ఉద్యోగులను మాత్రం ఎలాంటి అభ్యంతరం లేకుండా లోపలికి అనుమతిస్తున్నారని, ఇది వివక్షపూరిత చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు ఆదిభట్ల టీసీఎస్ క్యాంపస్ వద్దకు చేరుకుని కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అంతర్జాతీయ క్లయింట్ల సమావేశాల నేపథ్యంలో ఫార్మల్ దుస్తుల విషయంలో తలెత్తిన అపార్థం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చి ఆందోళనకారులు శాంతించారని తెలిపారు. ఈ ఘటన ఐటీ సంస్థలలో కార్పొరేట్ డ్రెస్ కోడ్ నిబంధనలు, మతపరమైన విశ్వాసాల మధ్య సమతుల్యతపై మరోసారి చర్చకు దారితీసింది

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now