టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

తిరుమలలో అక్టోబరు 12 నుండి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: వాహన సేవల వివరాలు వెల్లడించిన టిటిడి!

---Advertisement---

కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా అధికమాసం వచ్చిన సందర్భాల్లో కన్యామాసంలో (భాద్రపదం) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం మరియు ధ్వజావరోహణ ఘట్టాలు ఉండవు.

ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పకవిమానం, అక్టోబరు 19న స్వర్ణరథం మరియు అక్టోబరు 20న చక్రస్నానం ప్రధాన ఘట్టాలుగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు కొలువుదీరనున్నాయి. అత్యంత విశిష్టమైన గరుడవాహనసేవ మాత్రం అక్టోబరు 16న రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు నిర్వహించబడుతుంది.

బ్రహ్మోత్సవాల వాహన సేవల సమగ్ర వివరాలు:

అక్టోబరు 11: అంకురార్పణం (రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు)

అక్టోబరు 12: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఉదయం 9.00 గంటలకు) | పెద్దశేష వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 13: చిన్నశేష వాహనం (ఉదయం 8.00 గంటలకు) | హంస వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 14: సింహ వాహనం (ఉదయం 8.00 గంటలకు) | ముత్యపుపందిరి వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 15: కల్పవృక్ష వాహనం (ఉదయం 8.00 గంటలకు) | సర్వభూపాల వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 16: మోహినీ అవతారం (ఉదయం 8.00 గంటలకు) | గరుడ వాహనం (సాయంత్రం 6.30 గంటలకు)

అక్టోబరు 17: హనుమంత వాహనం (ఉదయం 8.00 గంటలకు) | పుష్పక విమానం (సాయంత్రం 4.00 గంటలకు) | గజ వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 18: సూర్యప్రభ వాహనం (ఉదయం 8.00 గంటలకు) | చంద్రప్రభ వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 19: స్వర్ణరథం (ఉదయం 7.00 గంటలకు) | అశ్వ వాహనం (రాత్రి 7.00 గంటలకు)

అక్టోబరు 20: చక్రస్నానం (ఉదయం 6.00 గంటలకు)

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now