టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

కేలరీలను బట్టి ఆకలి వేస్తుందా? సైన్స్ ఏమి చెప్తుంది.

---Advertisement---

మనకి ఆకలి వేయడానికి, మనం తినే ఆహారానికి మధ్య ఉన్న సంబంధం గురించి శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని చెప్పారు. మనం నిన్న ఏమి తిన్నాము అనేదానిపై నేటి ఆకలి ఆధారపడి ఉండదని ఈ పరిశోధన చెబుతోంది.

సాధారణంగా మనం నిన్న లేదా ఈ రోజు తిన్న కేలరీలను బట్టి ఆకలి వేస్తుందని అనుకుంటాము. కానీ ఆకలి అనేది కేవలం మనం తిన్న తిండిపై మాత్రమే ఆధారపడదు. మన పొట్టలో ‘గ్రెలిన్’ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన మెదడుకు సంకేతాలు పంపి ఆకలి వేసేలా చేస్తుంది.

ఈ హార్మోన్ స్థాయిలు మనం రోజూ తినే ఆహారాన్ని బట్టి కాకుండా, మన శరీరంలో ఉండే కొవ్వు నిల్వలు మరియు జీవక్రియలపై ఆధారపడి ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల్లో నడుము, తొడల చుట్టూ ఉండే కొవ్వు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆకలి హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది.

అందుకే కొందరు తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా ఉందంటే, మరికొందరు చాలా సేపటి వరకు ఏమీ తినకుండా ఉండగలరు. ఆకలి అనేది కేవలం మనం తిన్న కేలరీల లెక్క కాదు, అది మన శరీరంలో ఉండే హార్మోన్లు, కొవ్వు నిల్వలు మరియు జీవక్రియలతో ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రక్రియ.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now