టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

‘RC17’ రామ్ చరణ్ – సుకుమార్ చిత్రాన్ని తొలి క్లాప్‌తో ప్రారంభించిన మెగాస్టార్

---Advertisement---

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు సంచలన దర్శకుడు సుకుమార్ కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘RC17’ అధికారికంగా ప్రారంభమైంది. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ద్వితీయ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్‌లో నవంబర్ 1న నిర్వహించిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా పనులు లాంఛనంగా మొదలయ్యాయి.

ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి, తొలి సన్నివేశానికి ‘మెగా క్లాప్’ (Mega Clap) కొట్టి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. సుకుమార్ సతీమణి, రామ్ చరణ్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ సహా పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు (హరీష్ శంకర్, బుచ్చిబాబు సానా, మారుతి, నాగావంశీ) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (Ratnavelu) ఛాయాగ్రహణం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2018లో వచ్చిన గ్రామీణ పీరియాడిక్ డ్రామా ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఆల్-టైమ్ రికార్డుల తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వస్తున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది.

మిగిలిన నటీనటులు మరియు సంగీత దర్శకుడి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. మెగాస్టార్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now