రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీత దర్శకుడిగా కాకుండా ప్రధాన కథానాయకుడిగా (‘పర్షి’ పాత్రలో) పరిచయం అవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎల్లమ్మ’ (Yellamma). ‘బలగం’ వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తెరకెక్కిస్తున్న ఈ రెండవ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్డి అత్యంత నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ భారతదేశం నలుమూలల నుండి విభిన్న సంస్కృతులకు చెందిన ఏకంగా 100 మంది జానపద లయ కళాకారులతో (100 Folk Rhythm Artists) లైవ్‌లో ఈ పాటను రికార్డ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.
సాంప్రదాయ వాయిద్యాలు, జానపద డప్పులు, మరియు విభిన్న సంస్కృతుల లయల కలయికతో డీఎస్పీ స్వరపరిచిన ఈ టైటిల్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు మైమరిపించే అనుభూతిని అందించనుంది. ఈ మాసివ్ టైటిల్ సాంగ్‌కు సంబంధించిన మొదటి సింగిల్ ‘ఫస్ట్ సింగిల్ సూన్’ అంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో సినిమా ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో నటుడిగా పరిచయం అవుతూనే తానే స్వయంగా సంగీతాన్ని అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. వేణు యెల్దండి అందించిన ఎమోషనల్ అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథనానికి డీఎస్పీ అద్భుతమైన జానపద సంగీతాన్ని జోడిస్తున్నారు.
భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న (#YellammaFromMarch5th) తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, సంగీత దర్శకుడిగా ఒకేసారి ఊపేయబోతున్న ఈ జానపద సంగీత జాతర కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.










