టాప్ 10 వార్తలు విద్యా-ఉద్యోగాలు రాజకీయం విజ్ఞానం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ స్థానికం దేశం అంతర్జాతీయం ఏఐ జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

మరమ్మతుల కోసం చెన్నై తీరానికి అమెరికా రక్షణ నౌక

---Advertisement---

భారత్, అమెరికా దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ సహకారానికి నిదర్శనంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా నౌకాదళానికి చెందిన సప్లై నౌక ‘యూఎస్‌ఎన్ఎస్ వాలీ షిర్రా’ (USNS Wally Schirra) ప్రయాణ సంబంధిత మరమ్మతుల నిమిత్తం శుక్రవారం చెన్నై సమీపంలోని లార్సెన్ అండ్ టూబ్రో (L&T) కట్టుపల్లి షిప్‌యార్డ్‌కు చేరుకుంది. భారత్-అమెరికా మధ్య కుదిరిన మాస్టర్ షిప్ రిపేర్ ఒప్పందం కింద ఈ నౌకానిర్మాణ కేంద్రాన్ని వినియోగించుకుంటున్న ఐదవ అమెరికా నౌక ఇదే కావడం విశేషం.

మరోవైపు, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అమెరికా విమాన వాహక నౌక ‘యూఎస్‌ఎస్ జార్జ్ వాషింగ్టన్’ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నౌకాదళ సిబ్బందితో ముచ్చటించడంతో పాటు క్యారియర్ ఎయిర్ వింగ్-5 నిర్వహించిన వైమానిక విన్యాసాలను వీక్షించారు. అనంతరం భారత నౌకాదళ అధికారి రియర్ అడ్మిరల్ శ్రీనివాస్ మద్దులను నౌకపైకి సాదరంగా ఆహ్వానించారు. మలబార్ వంటి సంయుక్త సైనిక విన్యాసాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య బంధం మరింత దృఢమవుతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now