టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు: ప్రముఖ హోటళ్లకు నోటీసులు!

---Advertisement---

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ వింగ్ (TG SAFE) అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది. అక్టోబర్ 31, 2026న నిర్వహించిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భాగంగా గోల్కొండ మరియు చార్మినార్ జోన్లలోని 22 ప్రసిద్ధ ఆహార సంస్థలపై 22 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు దాడులు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వంటశాలల్లో మురికి పట్టిన ప్రదేశాలు, కాలం చెల్లిన (Expired) పదార్ధాలు, సరిగ్గా నిల్వ చేయని మాంసం, మరియు ఈగలు-కీటకాల సంచారాన్ని అధికారులు గుర్తించారు. నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 14 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులను తక్షణమే రద్దు/సస్పెండ్ (Licence Suspensions) చేయగా, ప్రముఖ స్టార్ హోటల్ ‘తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్’ సహా 8 సంస్థలకు షోకాజ్ నోటీసులు (Show-Cause Notices) జారీ చేశారు.

తనిఖీల సందర్భంగా అధికారులు 544 కిలోల నాణ్యత లేని/పాడైపోయిన ఆహారాన్ని మరియు 13 కిలోల మళ్లీ మళ్లీ వాడిన (Reused) వంట నూనెను స్వాధీనం చేసుకుని తక్షణమే పారబోసి ధ్వంసం చేశారు.

లైసెన్స్ సస్పెన్షన్లు ఎదుర్కొన్న మరియు నోటీసులు అందుకున్న ప్రధాన హోటళ్లు:

  • షా ఘౌస్ కేఫ్ (సయ్యద్ అలీ చబుత్రా)
  • హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడుపి వెజ్ (టోలిచౌకి & సంతోష్ నగర్ బ్రాంచ్‌లు)
  • పిస్టా హౌస్ రెస్టారెంట్ (షాహలీబండా)
  • లక్కీ రెస్టారెంట్ & స్వీకార్ హోటల్ (సంతోష్ నగర్)
  • మెహఫిల్ రెస్టారెంట్ (దిల్‌సుఖ్‌నగర్)
  • తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ (ఇంజన్ బౌలి)
  • అజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్ (రేతిబౌలి)
  • మండి అట్ 36 అరేబియన్ కిచెన్ (చార్మినార్)
  • సోహైల్ రెస్టారెంట్ & హోటల్ అక్షయ టిఫిన్స్ (మలక్‌పేట్)

నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ విస్తృత దాడులు చేపట్టినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద పేరొందిన రెస్టారెంట్ అయినా ఆహార భద్రత నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బయట తినేటప్పుడు నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now