మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ముఠామేస్త్రి’ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. వింటేజ్ మెగాస్టార్ స్వాగ్, అదిరిపోయే డ్యాన్స్ బీట్స్ మరియు థియేటర్లను దద్దరిల్లేలా చేసే పవర్‌ఫుల్ డైలాగులతో కూడిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో 4K వెర్షన్‌లో రూపొందించారు.
ఈ నెల నవంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో ‘ముఠామేస్త్రి’ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి మాస్ మేనియాను, ఆ నాటి మధుర జ్ఞాపకాలను 4K విజువల్స్‌తో సరికొత్త అనుభూతిలో ఆస్వాదించేందుకు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు











