బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో 7,565 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.
గత అక్టోబర్ 4వ తేదీన జరిగిన ఈ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.ibps.in ద్వారా తమ అర్హత స్థితిని తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో భాగంగా ఈ నెల చివరిలో లేదా డిసెంబర్లో పర్సనాలిటీ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. స్కోర్ కార్డులు మరియు కటాఫ్ మార్కుల వివరాలను మరో వారం రోజుల్లో (నవంబర్ 27 నాటికి) వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఐబీపీఎస్ వెల్లడించింది.











