టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

Bank Holidays and Nationwide Strike Notice: September 28 – September 30

Bank Holidays and Nationwide Strike Notice
---Advertisement---

బ్యాంక్ బంద్ ప్రకటన: ఆదివారం పని చేయనున్న SBI.

బ్యాంకింగ్ రంగంలో మళ్ళీ సమ్మె సైరన్ మోగింది. ఐదు రోజుల పని దినాలు (5-Day Banking Week) సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు (సోమవారం నుండి బుధవారం) మూడ్రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చింది.

ఈ సమ్మె వల్ల వరుసగా రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మెకు ముందే, అంటే సెప్టెంబర్ 27 (ఆదివారం) రోజున బ్యాంకులు పనిచేసేందుకు అనుమతి ఇచ్చాయి.

SBI నిర్ణయం & తాజా ప్రకటన

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం (సెప్టెంబర్ 27) అన్ని శాఖలు యథావిధిగా తెరిచి ఉంటాయని అధికారికంగా ప్రకటించింది.  ఆదివారం రోజున సాధారణ రోజులలో నిర్వహించే అన్ని రకాల నగదు లావాదేవీలు, డిపాజిట్లు మరియు సేవా అభ్యర్థనలను వినియోగదారులు పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. సమ్మె రోజుల్లో కూడా ఇబ్బంది లేకుండా YONO యాప్, నెట్ బ్యాంకింగ్, UPI మరియు ATM సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని SBI కోరింది.

RBI సూచనల మేరకు SBIతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) కూడా ఆదివారం సేవలందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ప్రైవేట్ బ్యాంకులు ఈ 3 రోజుల బ్యాంక్ సమ్మెలో పాల్గొనడం లేదు. కాబట్టి, ఆర్బీఐ ప్రత్యేకాదేశాలు ప్రైవేట్ బ్యాంకులకు నేరుగా వర్తించకపోవడంతో ఆదివారం ప్రైవేట్ బ్యాంక్ శాఖలు సాధారణ శెలవుదినంగానే మూసి ఉండే అవకాశాలు ఎక్కువ. అయితే, వారి డిజిటల్ సేవలు మరియు ATMలు యథావిధిగా పనిచేస్తాయి.

ఆర్బీఐ ఆదివారం పనిదినంగా ప్రకటించడాన్ని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) తీవ్రంగా ఖండించింది. చట్టబద్ధంగా లభించే ఆదివారం శెలవుదినాన విధులకు హాజరుకావద్దని తమ సభ్యులకు పిలుపునిచ్చింది. దీనివల్ల ఆదివారం కొన్ని శాఖల్లో సిబ్బంది హాజరు తక్కువగా ఉండే అవకాశం ఉందనే గందరగోళం నెలకొంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now