టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

Chilipi Prashnalu in Telugu with Answers (చిలిపి ప్రశ్నలు)

Chilipi Prashnalu in Telugu

chilipi prashnalu in telugu
Smiley: Chilipi prashnalu in Telugu with answers

 

1. మే నెలలో పుట్టిన నత్త ?

జవాబు: మేనత్త!

 

2. దుర్గకి పట్టిన గతి ?

జవాబు: దుర్గతి!

 

3. కోడి కాని కోడి ?

జవాబు: పకోడీ!

 

4. పండు కాని పండు ?

జవాబు: విభూది పండు!

 

5. కాయ గాని కాయ ?

జవాబు: తలకాయ్!

 

6. హారం గాని హారం?

జవాబు: ఫలహారం!

 

7. పురం గాని పురం?

జవాబు: కాపురం!

 

8. దానం గాని దానం?

జవాబు: మైదానం!

 

9. మామ గాని మామ?

జవాబు: చందమామ!

 

10. రసం గాని రసం?

జవాబు: నీరసం

 

11. రాజు గాని రాజు

జవాబు: తరాజు

 

12. కారం కాని కారం

జవాబు: ఉపకారం

 

13. రాగి కాని రాగి 

జవాబు: బైరాగి

 

14. కోడి కాని కోడి 

జవాబు: పకోడీ

 

15. తారు కాని తారు 

జవాబు: జలతారు

 

16. మామ కాని మామ 

జవాబు: చందమామ

 

17. తాళి కాని తాళి 

జవాబు: ఎగతాళి

 

18. దారా కాని దార

జవాబు: పంచదార

 

19. నత్త కాని నత్త 

జవాబు: మేనత్త

 

20. జనము కాని జనము 

జవాబు: భోజనము

 

21. రాయి కాని రాయి 

జవాబు: కిరాయి

 

22. నాడ కాని నాడ

జవాబు: కాకినాడ

 

23. టూరు గాని టూరు 

జవాబు: గుంటూరు

 

24. రెంటు గాని రెంటు 

జవాబు: కరెంటు.

 

25. మొగ్గ కాని మొగ్గ 

జవాబు: పిల్లి మొగ్గ

 

26. కాయ కాని కాయ 

జవాబు: తలకాయ

 

27. దేహం గాని దేహం 

జవాబు: సందేహం

 

28. హారం కాని హారం 

జవాబు: వ్యవహారం

 

29. శిక్ష గాని శిక్ష 

జవాబు: బాల శిక్ష

 

30. దేశం గాని దేశం 

జవాబు: సందేశం

 

31. తార కాని తార 

జవాబు: సితార

 

32. దారం గాని దారం 

జవాబు: మందారం

 

33. కీలు కాని కీలు 

జవాబు: వకీలు

 

34. సందు కాని సందు 

జవాబు: పసందు

 

35. పాలు కాని పాలు

జవాబు: కోపాలు

 

36. కారు గాని కారు 

జవాబు: షావుకారు

 

37. కులం కానీ కులం

జవాబు: గురుకులం

 

38. గోళం కాని గోళం 

జవాబు: గందరగోళం

 

39. పతి కాని పతి 

జవాబు: తిరుపతి

 

40. కట్టు గాని కట్టు 

జవాబు: తాకట్టు

 

41. దారి కాని దారి 

జవాబు: గోదారి

 

42. వెల కాని వెల 

జవాబు: కోవెల

 

43. దేశం కాని దేశం 

జవాబు: సందేశం

 

44. బడి కాని బడి 

జవాబు: రాబడి

 

45. మత్తు కాని మత్తు 

జవాబు: గమ్మత్తు

 

46. వరం కాని వరం 

జవాబు: కలవరం

 

47. తాళం కాని తాళం 

జవాబు: పాతాళం

 

48. మాట కాని మాట 

జవాబు: టమాట

 

49. రాణి కాని రాణి

జవాబు: పారాణి

 

50. గ్రహం కాని గ్రహం 

జవాబు: అనుగ్రహం

 

51. మందు కాని మందు 

జవాబు: కామందు

 

52. కాయ కాని కాయ 

జవాబు: మెడకాయ

 

53. గొడుగు కాని గొడుగు 

జవాబు: పుట్టగొడుగు

 

54. కాగితాలు చింపుతాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కాని బిచ్చగాడు కాదు.. ఎవరతను?

జవాబు: కండక్టర్

 

55. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్క లాడింది, ఏమిటది?

జవాబు: కవ్వం!