టాప్ 10 వార్తలు విద్యా ఉద్యోగాలు విజ్ఞానశాస్త్రం ఆరోగ్యం క్రీడలు ఆటోమొబైల్ రాష్ట్రం దేశం అంతర్జాతీయ సాంకేతికత జీవనశైలి బిగ్ బాస్ టీటీడీ

భారీ డిమాండ్ కారణంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌లో పోటీ

Heavy demand drives competition for Rs. 300 Special Entry Darshan ticket bookings
---Advertisement---

తిరుమల, 2026 సెప్టెంబర్ 26: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది.

టీటీడీ ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలను అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వచ్చే డిమాండ్‌ను నిర్వహించేలా Google Cloud Platform (GCP), Load Balancing, Auto Scaling, Distributed Application Architecture, Horizontal Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అధిక డిమాండ్ సమయంలో వివిధ Application, API, Gateway తదితర సేవలను అనేక Replicas ద్వారా నిర్వహిస్తూ వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక Technical War-Room ఏర్పాటు చేసి, Application Performance, Infrastructure Health, Transactions, Security తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే విధంగా సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.

కోటాతో పోలిస్తే దాదాపు 9 రెట్లు అధిక డిమాండ్

అధిక డిమాండ్ ఉన్న బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండగా, ఒక్కో యూజర్ సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తే సుమారు 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. అయితే అందుబాటులో ఉన్న కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే.

అంటే అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా వేలాది మంది ఒకే సమయంలో ఒకే స్లాట్ కోసం ప్రయత్నించడంతో టికెట్లు అత్యంత తక్కువ సమయంలోనే పూర్తవుతాయని వివరించింది.

వర్చువల్ క్యూ సాంకేతిక ట్రాఫిక్ నియంత్రణ విధానం

ఒకేసారి భారీ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చినప్పుడు Backend Systemsపై అధిక భారం పడకుండా, మొత్తం వ్యవస్థ స్థిరత్వాన్ని కాపాడేందుకు Virtual Queue ఉపయోగిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. Virtual Queue భక్తులకు టికెట్లు నిరాకరించేందుకు ఉద్దేశించినది కాదని, అధిక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాంకేతిక విధానమని స్పష్టం చేసింది.

అలాగే ‘Slot Unavailable’ వంటి సందేశాలు అధిక డిమాండ్ కారణంగా అందుబాటులో ఉన్న టికెట్లు తక్కువ సమయంలో పూర్తవడం వల్ల కూడా రావచ్చని, దీనిని మాత్రమే ఆధారంగా చేసుకుని సాంకేతిక వైఫల్యంగా నిర్ధారించడం సరికాదని పేర్కొంది.

పేమెంట్ సమస్యలు వివిధ వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయి

ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ TTD అప్లికేషన్‌తో పాటు Payment Gateways, Banking Networks, UPI Networks వంటి బాహ్య వ్యవస్థలపై కూడా ఆధారపడి ఉంటుందని టీటీడీ తెలిపింది. అందువల్ల ఏదైనా Transaction విఫలమైనప్పుడు సమస్య ఏ దశలో ఏర్పడిందో పరిశీలించాల్సి ఉంటుందని వివరించింది.

టికెట్ లభించకపోవడాన్ని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడాన్ని ఒకటిగా పరిగణించరాదని టీటీడీ స్పష్టం చేసింది.

నిరంతరం సాంకేతిక అభివృద్ధి

భక్తుల Feedbackను పరిగణనలోకి తీసుకుని Online Booking, Application మరియు Database Performance, High-Load Handling, Security, Anti-Bot Mechanisms, Payment Processes తదితర అంశాల్లో నిరంతరం సాంకేతిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

గతంలో నమోదైన Traffic Patterns, రాబోయే బుకింగ్‌లలో ఉండే అంచనా డిమాండ్ ఆధారంగా Capacity Planning, Infrastructure Scalingను కూడా సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తదితర ఆలయాల దర్శన, సేవా కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానం ద్వారా విడుదల చేస్తున్నామని, అక్కడ భారీ స్థాయిలో ఒకేసారి ఏర్పడే డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపింది.

భారీ డిమాండ్ ఉన్న సమయంలో ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని, ఒక ప్రయత్నంలో టికెట్ లభించకపోవడాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం లేదా లోపం ఉందని భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది.

భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికంగా సమర్థవంతంగా అందించేందుకు టీటీడీ నిరంతరం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపింది. టీటీడీపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now