బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం ఆట మరింత రసవత్తరంగా మారింది. సాధారణంగా మొదలైన తొలి వారాల్లో బిగ్ బాస్ హౌస్ కాస్త చల్లగానే ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో మాత్రం కంటెస్టెంట్ల మధ్య గొడవలు, డ్రామా పీక్స్‌కి చేరాయి. హౌస్‌లోని రెండు గ్రూపుల మధ్య వీధి పోరాటాన్ని తలపించేలా గొడవలు జరుగుతుండటంతో ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
తొలివారంలో ఆడియన్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా హౌస్‌మేట్స్ నిర్ణయంతో చరణ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రెండో వారంలో ఏకంగా 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండటంతో ఓటింగ్ హోరాహోరీగా సాగుతోంది.
నామినేషన్స్‌లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్:
1. ముకేష్ గౌడ
2. రోహిత్
3. రామ్ ప్రసాద్
4. త్రిగుణ్
5. కృష్ణుడు
6. వర్షిణి
7. షాలిని
8. సృష్టి
9. ఝాన్సీ
10. సుధీర్
11. దేబ్జానీ
రోహిత్ వర్సెస్ ముకేష్ గౌడ
అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టి నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న రోహిత్ నాయుడు ఓటింగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్ పోల్స్ ప్రకారం రోహిత్ దాదాపు 30% ఓటింగ్‌తో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు.
అయితే రోహిత్‌కి ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ ముకేష్ గౌడ గట్టి పోటీ ఇస్తున్నాడు. ముకేష్ 29% ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. హౌస్‌లో ముకేష్ పెద్దగా గొడవల్లో జోక్యం చేసుకోకుండా సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఆయనకున్న ఫ్యామిలీ ఆడియన్స్ మరియు సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు విపరీతంగా పడుతున్నాయి.
త్రిగుణ్‌కి షాక్.. రామ్ ప్రసాద్ సేఫ్ మోడ్
రామ్ ప్రసాద్: జబర్దస్త్ క్రేజ్‌తో అడుగుపెట్టిన రామ్ ప్రసాద్ 8% ఓటింగ్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.
త్రిగుణ్: హౌస్‌లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ వివాదాలు సృష్టిస్తున్న త్రిగుణ్‌కి ఆడియన్స్ ఊహించని షాక్ ఇచ్చారు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ ఫైట్ ఉంటుందనుకుంటే, త్రిగుణ్ కేవలం 7% ఓటింగ్‌తో 4వ స్థానానికే పరిమితమయ్యాడు.
డెంజర్ జోన్‌లో ఎవరున్నారు? ఎలిమినేషన్ ఎవరికి?
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కృష్ణుడు, సృష్టి, సుధీర్, ఝాన్సీ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ముఖ్యంగా నటుడు కృష్ణుడు లీస్ట్ ఓటింగ్‌తో తీవ్రమైన ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ లేకపోవడం, వీకెండ్ ఎపిసోడ్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో ఆడియన్స్ కూడా ఆయనకు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.











