Written below are some of the best conversations between family members and between two friends.
English to Telugu conversation stories on different topics
1. English to Telugu-Conversation on Morning Picnic
Ramesh: Dad, can we have a picnic tomorrow morning?
రమేష్: నాన్నగారు రేపు మనము పిక్నిక్ కి పోదామా?
Dad: Sure Ramesh, which place would you like to visit?
నాన్న: అలానే రమేష్, నువ్వు ఎక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతున్నావు?
Ramesh: How about the Zoological park.
రమేష్: జూలాజికల్ పార్క్ గురించి మీరేమంటారు
Dad: That is a good place to have a picnic.
నాన్న: సరే, అది చాలా మంచి ప్లేస్ పిక్నిక్ కి పోవడానికి.
Ramesh: How can we reach the zoo and at what time should we start?
రమేష్: మనం జూపార్క్ కి ఎలా పోవాలి మరియు ఎప్పుడు మనము బయలుదేరాలి.
Dad: We can reach there by cab and we will start at 10 AM.
నాన్న: మనం పార్క్ కి క్యాబ్ తీసుకుని వెళదాం, ఉదయం పది గంటలకి బయలుదేరుదాం.
Ramesh: How about lunch and what should we pack for that.
రమేష్: మరి మధ్యాహ్న భోజనం కోసం ఏం తీసుకెళ్దాం.
Dad: I will tell your mom to make gee roti and paneer butter masala.
నాన్న: నేను మీ అమ్మకు నెయ్యితో రోటీ అందులోకి పన్నీర్ బటర్ మసాలా చేయమని చెప్తాను.
Ramesh: Wow, I like gee roti and paneer butter masala combination.
రమేష్: వావ్, నాకు ఆ రెండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం.
Dad: Inform your brother about the picnic.
నాన్న: మనం పిక్నిక్ కి పోతున్నట్టు మీ బ్రదర్ కి కూడా తెలియజేయి.
Ramesh: Sure, I think it is better to carry our professional camera to take photos of animals.
రమేష్: అలాగే నాన్న గారు, నాకు తెలిసి మనం మన ప్రొఫెషనల్ కెమెరాని తీసుకెళ్లడం మంచిది అనుకుంటా ఫొటోలు తీసుకోవచ్చు.
Dad: Yes, we can capture a lot of photos in the zoo.
నాన్న: అవును మనం జూ లో చాలా ఫొటోలు తీసుకోవచ్చు.
Ramesh: Then I will tell Ramu to charge our professional camera tonight.
రమేష్: అయితే, నేను మన కెమెరా కి ఛార్జింగ్ పెట్టమని రాము తో చెప్తాను.
Dad: Okay, will anybody be joining us?
నాన్న: సరే, ఇంకెవరైనా మనతో రేపు వస్తున్నారా?
Ramesh: Hmm, I will ask my best friend Giri if he comes to the zoo.
రమేష్: హమ్.. నేను నా మిత్రుడ్ని అడుగుతాను మనతో జూ కి రాగలడు ఏమో.
Dad: Good, ask him to join us as early as possible.
నాన్న: మంచిది, అతనిని రేపు ఎంత వీలైతే అంత త్వరగా మనల్ని కలవమను.
Ramesh: Okay dad, i am getting sleep, good night.
రమేష్: సరే నాన్న గారు, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్.
Dad: Okay dear, go to sleep, good night.
నాన్న: సరే కన్నా.. వెళ్లి పడుకో, గుడ్ నైట్.
Buy Best Book for English Learning with Conversations, Online
2. English to Telugu-conversation Between two friends:
Megana: Hi Sneha, this is Megana, are you going to the office today?
మేఘన: హాయ్ స్నేహ ఈరోజు నువ్వు ఆఫీస్ కి వెళ్తున్నావా?
Sneha: No Megana, my daughter Sahi is not feeling well, she could not go to school.
స్నేహ: లేదు మేగాన, నా కుమార్తె సాహికి ఆరోగ్యం బాగాలేదు, ఆమె స్కూల్ కి వెళ్ళలేకుంది.
Megana: That is horrible, is it a fever or something else?
మేఘన: అది బాధాకరమే, ఇంతకీ ఇది జ్వరమా లేక మరేదైనా నా?
Sneha: She is suffering from fever and she has a cold and cough too.
స్నేహ: ఆమె జ్వరంతో బాధపడుతోంది, దానితో పాటు ఆమెకు జలుబు మరియు దగ్గు కూడా ఉన్నాయి.
Megana: There is a virus spreading around. We need to take precautions and stay healthy.
మేఘన: మన చుట్టూ వైరస్ వ్యాప్తి చెందుతోంది. మనం జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
Sneha: Yes, we should, we have been conscious about the effect of the virus and we are taking immunity-boosting food items.
స్నేహ: అవును, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము వైరస్ ప్రభావం గురించి తెలుసుకుని ఉన్నాము మరియు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకుంటున్నాము.
Megana: Good, I am feeding my daughter with non-veg items so that her immunity gets enhanced.
మేఘన: మంచిది, నేను నా కుమార్తెకు నాన్-వెజ్ ఐటమ్స్ తో ఆహారం ఇస్తున్నాను, తద్వారా ఆమె రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Sneha: Actually, I could bring her some energy items but I did not want to leave Sahi alone.
స్నేహ: అసలు, నేను నా కుమార్తెకు కొన్ని శక్తినిచ్చు ఆహరం తీసుకురావాలి, కానీ సాహిని ఒంటరిగా వదిలేయడానికి నేను ఇష్టపడలేదు.
Megana: I understand your situation, what do you need now?
మేఘన: నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను, మీకు ఇప్పుడు ఏమి కావాలి?
Sneha: Could you please bring me a loaf of bread and mutton? I want to make Sahi mutton soup.
స్నేహ: మీరు నాకు రొట్టె మరియు మటన్ తీసుకురాగలరా? నేను సాహి కోసం మటన్ సూప్ చేయాలనుకుంటున్నాను.
Megana: That is a good idea, I will bring them off while returning home.
మేఘన: అది మంచి ఆలోచన, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నేను వాటిని తెస్తాను.
Sneha: Thank you Megana! I will pay you back when you come to my home.
స్నేహ: ధన్యవాదాలు మేగాన! మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మీకు డబ్బు చెల్లిస్తాను.
Megana: That’s ok, I will reach the market after lunch and I will be at your home around 3 PM. Is it ok?
మేఘన: అది సరే, నేను భోజనం తర్వాత మార్కెట్కు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు మీ ఇంటి వద్ద ఉంటాను. అది ఓకే నా?
Sneha: Ok, See you then, take care of your daughter too.
స్నేహ: సరే, అప్పుడు కలుద్దాం, మీ కుమార్తెను కూడా జాగ్రతగా చూసుకోండి.
Megana: Ok, thank you dear. Bye.
మేఘన: సరే, ధన్యవాదాలు, ఉంటాను.
3. English to Telugu- Conversation between strangers, click here and read it
4. English to Telugu-Conversation
5. English to Telugu-Conversation
6. English to Telugu-Conversation