Home » Food » Dosakaya in English-ఆరోగ్య ప్రయోజనాలు (Benefits in Telugu)

Dosakaya in English-ఆరోగ్య ప్రయోజనాలు (Benefits in Telugu)

The cucumber is a very popular vegetable. It is familiar to us as a vegetable. But it is very important in Ayurveda medicine. This is because it contains valuable nutrients and medicinal properties. With this, in India, depending on the state and region, people are making many types of cuisine. It is mostly cultivated as a food crop in our Telugu states and sold in the markets as a commercial product. It has had a very special place among vegetables since ancient times. There are many varieties of cucumbers. Some are round, and others are elongated. Their colors also vary a lot, some are yellowish green, and others are orange.

Dosakaya in English

English name of Dosakaya
Dosakaya in English

There are several names for Dosakaya in English, Hindi, Kannada, Tamil, etc. Cucumber is a vegetable belonging to the Cucurbitaceae family. Watermelons, pumpkins, and bottle gourds also join this family. Its scientific name is Cucumis sativus L. It is popularly known as Cucumber in English.
దోసకాయను ఇంగ్లీషులో cucumber అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం Cucumis sativus L.

Dosakaya in Hindi – ‘Keera
Dosakaya in Kannada – ‘Southe kaayi
Dosakaya in Tamil – ‘Kakkarikkari
Dosakaya in Malayalam – ‘Kani Vellarikka
Dosakaya in Bengali – ‘Sosha
Dosakaya in Gujarati – ‘Kakdi
Dosakaya in Panjabi – ‘Tar
Dosakaya in Marati – ‘Kakadi

 Dosakaya Health Benefits

Health Benefits of Dosakaya in English

Cucumber is a plant belonging to the Cucurbitaceae family. Other plants such as watermelon, pumpkin, ridge gourd, bottle gourd, etc. are also included in this family.

  • It serves as a refrigerant substitute.
  • It has hemostatic properties as well.
  • Because some organic acids are present in its pulp, it has antioxidant qualities.
  • Its anti-inflammatory qualities are also present.
  • It can protect us from thermoplegia by acting as an anti-thermoplegia.
  • It has anti-proliferative activities.
  • Its pulp has cytotoxic and anti-tumor properties.
  • It also has antimicrobial activity.
  • It is considered an antidiabetic agent.
  • Dosakaya contains vitamins, proteins, amino acids, and essential minerals that are required for body development.

Health Benefits of Dosakaya in Telugu

దోసకాయకు దేహాన్ని శుద్ధి చేయగల సామర్థ్యం కలదు. అంటే దేహంలో ఏ రకమైన విషపదార్థాలు ఉన్న లేదా వాటి వల్ల కలిగిన రుగ్మతలు ఉంటే వాటిని శాశ్వతంగా నిర్మూలించగలదు.

ఈ కూరగాయలో అధిక మొత్తంలో నీరు మరియు తక్కువ మొత్తంలో శరీరానికి హాని కలిగించే క్యాలరీస్ ఉంటాయి. దోసకాయ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ని, యాంటీ ఆక్సిడెంట్ ఆక్టివిటీ ని, మరియు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని కలిగి ఉంటుంది.

మన శరీరంలో కొన్ని వ్యర్థ పదార్థాలు అంటే… జీర్ణం కానీ ఆహార పదార్థాలు, ఆహారం నుంచి శరీరంలోకి చొరబడిన విషపూరిత రసాయనాలు, మరియు వాటిజీవిత కాలంగడిచి నశించిన కణజాలాలు, మరియు కణాలు ఎప్పటికప్పుడు గుమిగుడుతుంటాయి. వీటిని అన్నింటిని తొలగించడానికి చాలా రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా కాయగూరలు మనకు చాలా సహాయపడుతూ ఉంటాయి. . వీటిలో దోసకాయ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దోసకాయను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఇటువంటి మలిన పదార్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి బహిష్కరించబడతాయి.

  • దోసకాయ ఒక రెఫ్రిజిరేంట్ గా పని చేస్తుంది. . అంటే ఇది శరీరంలోని ఉష్ణాన్ని గ్రహించి శరీరాన్ని చల్ల పరుస్తుంది అని అర్థం.
  • దోసకాయ ఒక హిమోస్ట్యాటిక్ గా కూడా పనిచేస్తుంది. దీని అర్థం దోసకాయ రక్తస్రావాన్ని ఆపగలిగే శక్తిని కలిగి ఉందని అర్థం.
  • ఇది యాంటీ థర్మోప్లాజియా లాగా కూడా పనిచేస్తుంది, అంటే ఇది వడదెబ్బ నుంచి మన శరీరాన్ని కాపాడడమే కాకుండా శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
  • ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడమే కాకుండా దీని యొక్క రసాన్ని మన శరీరంపై అప్లై చేసుకున్నప్పుడు చర్మపు సౌందర్యాన్ని పెంచడమే కాకుండా శరీరాన్ని విషపూరిత రసాయనాల నుంచి ఎల్లప్పుడూ చర్మాన్నిఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
  • దోసకాయ యాంటీ ఇన్ఫ్లమేషన్ గా కూడా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో అంతర్గతంగా ఏదైనా శరీర వాపు, అవయవాల వాపు, లేదా కణజాలాల వాపు జరిగినప్పుడు, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేషన్ అనే పదార్థాలు వాపుకు గురైన ప్రాంతంలో వాపుని తగ్గించడంతోపాటు దాని వల్ల కలిగిన నష్టాన్ని కూడా సవరిస్తాయి.

ఆధునిక ప్రయోగాల ద్వారా చాలా రకాల ఉపయోగకరమైన రసాయన మూలకాలను దోసకాయ ఆకుల నుంచి, కాయ నుంచి మరియు విత్తనాల నుంచి కూడా సేకరించడం జరిగింది. శాస్త్రవేత్తల ప్రకారం దోసకాయలో చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన మూలకాలు అధికంగానే ఉన్నాయి అని నిరూపించబడింది. దోసకాయ కాకుండా దీని ఆకులు కూడా చాలా రకాల ఔషధాల తయారీలో ముఖ్యంగా ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు.

దోసకాయలు ఇతర కాయగూరల కంటే ఎక్కువగా కుకుర్ బిటేన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది దోసకాయకు యాంటీ ప్రొలిపిరేటివ్ లక్షణాన్ని ఇస్తుంది. ఈ రసాయన సమ్మేళనం కణాల అభివృద్ధిని మరియు పెరుగుదలను నిర్మూలించడంలో పాల్గొంటుంది. క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా వారి యొక్క క్యాన్సర్ కణాలు త్వర త్వరగా అభివృద్ధి చెంది పెద్ద ట్యూమర్ గా తయారు అవుతాయి. దోసకాయను ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ కణాలు మరియు వాటి పెరుగుదల చాలావరకు నిర్మూలించబడ్డాయి అని చాలా ప్రయోగాల ద్వారా నిరూపించబడింది.

దోసకాయకు సైటోటాక్సీక్ మరియు యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉండడమే కాకుండా హెపటో ప్రొటెక్టివ్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. హెపటో ప్రొటెక్టివ్ అంటే కాలేయాన్ని విషపూరిత పదార్థాల నుంచి కాపాడడం. అధికంగా ఆల్కహాల్ను స్వీకరించే వ్యక్తులలో కాలేయం దెబ్బతింటుందని వింటూనే ఉంటాం, అలాంటి వారిలో కాలేయ పునరుత్పత్తికి కావలసిన కొన్ని రకాల రసాయనాలను దోసకాయ అందించగలదు.

ఇందులో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు సూక్ష్మజీవులను నిర్మూలించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని…కనుక దీనికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ కూడా ఉందని ఆధునిక పరిశోధనలలో నిరూపించబడింది.

ఇది యాంటీహెల్మెంటిక్ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉందని…. అంటే ఇది శరీరంలోని ఇతర పరాన జీవులను మరియు వాటి వల్ల సంభవించే ప్రతికూల ప్రభావాలను కూడా నిర్మూలించగలదని ప్రయోగాలు చెబుతున్నాయి.

దీనికి రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించగలిగే సామర్థ్యం ఉండడం వలన చాలామంది శాస్త్రవేత్తలు దీనికి ఆంటీ డయాబెటిక్ యాక్టివిటీ కూడా ఉందని పేర్కొన్నారు.

Nutrients in Dosakaya in Telugu

Cucumber nutrient value
Nutrients in Dosakaya in Telugu

దోసకాయను 100 గ్రాములను తీసుకుంటే అందులో 96% నీరు, 0.4% ప్రోటీన్, 0.1% క్రొవ్వు పదార్థాలు, మరియు 2.8% పిండి పదార్థాలు, పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటుగా మన శరీర జీవక్రియకు తోడ్పడే కొన్ని రసాయన లవణాలు కూడా దోసకాయలు పుష్కలంగానే లభిస్తాయి అని కొంతమంది శాస్త్రవేత్తలు వారి ప్రయోగాల ద్వారా విశదీకరించారు. వాటిలో కొన్ని కింద ఇవ్వబడినవి. 1.5 mg/100 g ఐరన్, 0.3% మినరల్స్, 0.03% ఫాస్ఫరస్, 0.01% క్యాల్షియం, మరియు 30 IU/100 g vitamin B.

Nutrient value of Dosakaya in Telugu

దోసకాయ ద్వారా మనకు కొన్ని రకాల ఎంజైమ్స్ కూడా లభిస్తాయి. ఇవి మన శరీరంలో మన జీర్ణక్రియను మరియు ఇతర రసాయన ప్రక్రియలను సులభ పరచడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తిని మరియు కొన్ని రకాల జీవపదార్థాలను తయారు చేయడంలో దోహదపడతాయి. ఈ ఎంజైమ్స్ లో ముఖ్యంగా ఆస్కార్బిక్ ఆక్సిడేస్, సక్సినిక్ డిహైడ్రోజేనేస్, ఫ్రూటీ ఏజ్, మరియు మాలిక్ డిహైడ్రోజన్ లు అధికంగా ఉంటాయి.

దోసకాయకు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడానికి కారణం ఇందులో లాక్టిక్ యాసిడ్ మరియు ఆస్కార్పిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉండడమే.

పైన చెప్పిన వాటితో పాటుగా దోసకాయలో ఇతర రసాయన సమ్మేళనాలు ముఖ్యంగా శాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్, టానినిన్స్, గ్లైకోసైడ్స్, ఆల్కలాయిడ్స్, టెర్పీన్స్, మరియు ఫినాలిక్స్ కూడా ఉంటాయి.

Curries and foods with Dosakaya fruit

Cucumber is used in a wide variety of dishes and nutritious ingredients. Below are some of the most popular recipes.

దోసకాయ పచ్చడి (Dosakay Pachadi)
దోసకాయ పప్పు (Dosakay Pappu)
దోసకాయ పులుసు (Dosakay Pulusu)
దోసకాయ ఫ్రై (Dosakay Fry)
దోసకాయ గోంగూర చట్నీ (Dosakay Gongura Chatni)
దోసకాయ సాంబార్ (Dosakay Sambar)
దోసకాయ హల్వా (Dosakay Halwa)
దోసకాయ బజ్జి (Dosakay Bajji)
దోసకాయ రసం (Dosakay Rasam)
దోసకాయ రొయ్యల కూర (Dosakay Royyal Kura)
దోసకాయ రోటి కర్రీ (Dosakay Roti Curry)
దోసకాయ పాలక్ (Dosakay Palak)
దోసకాయ టమోటా పచ్చడి (Dosakay Tamoto Pachadi)
దోసకాయ సెనగపప్పు కూర (Dosakay Senagapappu Kura)
దోసకాయ దోస (Dosakay Dosa)
దోసకాయ జ్యూస్ (Dosakay Juice)
దోసకాయ చెక్కలు (Dosakay Chekkalu)
దోసకాయ వడలు (Dosakay Vadalu)
దోసకాయ నువ్వుల పచ్చడి (Dosakay Nuvvula Pachadi)
కాయ మటన్ కర్రీ (Dosakay Mutton Curry)

దోసకాయను ఎక్కువగా పల్లెలలో వేసవికాలంలో ఆహారంగా తీసుకుంటారు. చాలామంది దోసకాయ ముక్కలతో జ్యూస్ ను చేసి చక్కెరను కలుపుకొని చల్లటి ఆహార పానీయంగా తరచూ తీసుకుంటూ ఉంటారు.

Key Takeawys

దోసకాయ అనేక రకాల ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన ఆయుర్వేదంలోనూ మరియు ఇతర ప్రాంతీయ ఔషధ తయారీలో విరివిగా మన ప్రాచీన కాలం నుంచి వినియోగిస్తూనే ఉన్నారు. ఇది ఆకారంలో గుండ్రంగా ఉండి, 500 గ్రాముల నుంచి రెండు కేజీల వరకు మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటి విత్తనాలు కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉండడం వలన. దోసకాయల నుంచి విత్తనాలను సేకరించి, ఎండబెట్టి, ప్యాకెట్లలో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు రవాణా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. దోసకాయ గింజలలో మన శరీరానికి కావలసిన కొన్ని రకాల ప్రోటీన్లు మరియు ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండడం వలన వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. 100 గ్రాముల దోసకాయ గింజలు సుమారు 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు మార్కెట్లలో ధర పలుకుతున్నాయి.

వివిధ ప్రాంతాలలో అనేక రకాల ప్రయోగశాలలో, దోసకాయ ఆకుపై, గుచ్చుపై, మరియు వాటి విత్తనాలపై ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. . వీటి యొక్క ఆరోగ్య ప్రయోగాలను ఎప్పటికీ చాలా రకాల ఆర్టికల్స్ లలో ప్రచురించడం జరిగింది.

If you like my explanation, you can read the following posts to learn more

Sorakaya BenefitsBeerakaya Health Uses
Guruvinda GinjaNungu in English
Inguva BenefitsBommidala Fish
AnchoviesBocha Fish
Halwa Recipe in TeluguRava Kesari Recipe
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram