Home » Food » Inguva in English (Perungayam, Hing), ఇంగువ ప్రయోజనాలు

Inguva in English (Perungayam, Hing), ఇంగువ ప్రయోజనాలు

మన తెలుగు రాష్ట్రాలలో ఇంగువ అంటే తెలియని వారు ఉండరు ఎందుకంటే ఇంగువను చాలా రకాల వంటలలో సుగంధ పదార్ధముగా ఉపయోగిస్తారు దీనిని వంటలలో వాడడం వలన మంచి సువాసనతో పాటు కమ్మటి రుచిని కూడా ఇస్తుంది. ఇంగువ అనేది స్పటికాల రూపంలోనూ మరియు పొడి రూపంలోనూ మార్కెట్లలో లభిస్తుంది. స్పటికం అన్నానని ఇది ఉప్పు లాగా నీటి నుంచో, జంతువుల నుంచో, లేదా భూమిలో నుంచో దొరుకుతుందని భ్రమపడేరు. ఇది ఒక స్వచ్ఛమైన మొక్కల నుంచి దొరికే శాఖాహార పదార్థం.

Inguva in English Language

దీనిని ఆంగ్లంలో ఆశపోయిటిడా (Asafoetida) అని పిలుస్తారు. దీనిని హిందీ భాషలో హింగ్ (Hing) అని.. తమిళ భాషలో పెరుంగాయం (Perungayam) అని పిలుస్తారు. ఇది ఆశపోయిటిడా అనే మొక్క వేర్ల నుంచి లభిస్తుంది.

Inguva english name
Inguva in English

Benefits of Inguva in English

  • Inguva helps digestion and alleviates the problems associated with the digestive system, such as gas, bloating, and indigestion.
  • It reduces muscle pain and relieves spasms of involuntary muscle.
  • Inguva is traditionally used in the preparation of Ayurveda medicine to treat respiratory problems, including asthma, bronchitis, and cough.
  • It has anti-inflammatory properties, so it can reduce inflammation in our body.
  • In recent studies, inguva is involved in the relief of chronic diseases like arthritis and inflammatory bowel disease.
  • As it has anti-microbial properties, it can cure infections caused by bacteria and fungi in our digestive and circulatory systems.
  • Inguva also has some essential elements and crucial nutrients that are needed for our body to function properly.
  • In Ayurveda, inguva has been used as a good medicine for relieving the pain that occurs during menstrual cycles.
  • Studies recently reported that inguva has hypotensive effects, which can reduce blood pressure in our body.
  • So far, there have been several studies related to the inguva beneficial effects; however, some scientists have suggested that further studies need to be performed to analyze inguva’s comprehensive beneficial properties in humans or animals.

Inguva benefits in Telugu

దీని ఆరోగ్య ప్రయోజనాల వలన మన భారతదేశంలో దీనిని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద మందుగా లేదా ఆహార పదార్ధంగా వినియోగిస్తున్నారు. దీనిని వంటలలో వినియోగించి తినడం వలన మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది అజీర్తితో బాధపడుతున్న వారు దీనిని ఆహార పదార్థంలో వేసుకుని తినడం వలన చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.

వయసు పైబడిన వారు ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. అలాంటివారు ఇంగువ వేసిన ఆహార పదార్థాలను కొన్ని రోజులపాటు తీసుకోవడం వలన గ్యాస్ ట్రబుల్ చాలావరకు తగ్గుతుంది.

ఇంగువలో అధికమవుతాదులు ఆంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి ఈ ఆంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో కణాలను మరియు కణజాలాలను ఎప్పటికప్పుడు విషపూరిత అణువుల లేదా పదార్థాలు నుంచి రక్షిస్తూనే ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ దీర్ఘకాలికంగా ఇన్ఫర్మేషన్ తో బాధపడే వారికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

ముఖ్యంగా ఇంగువలో ఎక్కువ మోతాదులో ఫినాలిక్ కాంపౌండ్స్ అంటే tanins మరియు flavonoids ఉన్నాయని పరిశోధనలలో తేలింది. ఈ పదార్థాల యొక్క ముఖ్యమైన స్వభావం యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడం. విషపూరిత పదార్థాల నుంచి మన కణాలను రక్షించుటలో ముఖ్యమైన పాత్ర వహించే యాంటీ ఆక్సిడెంట్లలో ఈ రెండు పదార్థాలు ముందంజలో ఉంటాయి.

మనకు ఇంగువలో మన ఆరోగ్యానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు పుష్కలంగానే లభిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, మన శరీరానికి కావలసిన మంచి కొవ్వు పదార్థాలు, పీచు పదార్థం, పిండి పదార్థాలు, మరియు అమినోయాసిడ్స్ బాగా లభిస్తాయి.

Nutritional value of asafoetida per 100g powder

వీటితో పాటుగా మన శరీరానికి కావలసిన రసాయనిక లవణాలు ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, నియాసిన్, సోడియం, మెగ్నీషియం, కాపర్, మేంగనీస్, మరియు జింక్ అధికమోతాధిలో లభిస్తాయి.

ఇంగువ యొక్క స్వచ్ఛత మరియు అవి పండించే ప్రాంతాలను బట్టి పైన చెప్పిన పోషకాహార పదార్థాల మరియు లవణాల యొక్క విలువలు అటు ఇటుగా ఉండవచ్చు. ఇంగువను ఆహార పదార్థాలలో చాలా స్వల్పంగా వినియోగించడం వల్ల మనం పైన చెప్పిన లవణాలు లేదా పోషక పదార్థాలు ఇంగువ మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మన శరీరానికి కావలసిన మోతాదులో దొరకకపోవచ్చు. కానీ మనము చేసే వంటలలో ఇతర పదార్థాలు ఉండుటవలన ఇవి కొన్ని రకాల ముఖ్యమైన లవణాలను చేకూర్చుతాయి.

vitamins and minerals in inguva powder

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలలో ఇంగువ అనేది ఆరోగ్యానికి ఔషధం లాంటిది అని చాలామంది శాస్త్రవేత్తలు ప్రచురించారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఇంగువలోని ప్రయోజనాలను మరియు వాటి యొక్క ప్రతికూల చర్యలను వెలికితీయడానికి అనేక రకాల ఆధునిక ప్రయోగాలను ఉపయోగిస్తున్నారు. మరి కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికే ఇంగువను మరియు దీని నుంచి వచ్చిన రసాయన సమ్మేళనాలను వారి యొక్క ప్రయోగాలలో కొన్ని రకాల జంతువులపై పరీక్షించి ఇప్పటికే వాటి యొక్క ఔషధ గుణాలను వెలికి తీయడం జరిగింది.

దీనిలో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ…చాలా మంది శాస్త్రవేత్తలు వీటిని ఔషధంగా భావించడానికి నిరాకరిస్తున్నారు. దీనికి కారణం ఔషధం అంటే చాలా తక్కువ మోతాదులోనూ తన ఔషధ గుణాన్ని శరీరంపై చూపించడమే. కానీ… ఇంగువ విషయంలో, ఎక్కువ మోతాదులో ఇంగువను తన ఔషధ గుణాల కోసం ఉపయోగించాల్సి వస్తుంది. ఆయుర్వేద ప్రయోగాలలో ఇంగువ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని పురాతన కాలం నుంచి వినిపిస్తున్న విషయం. ఇప్పటికీ కూడా ఆయుర్వేద మందుల తయారీలో ఇంగువను ఉపయోగిస్తూనే ఉన్నారు. దీని కారణంగా ఇంగువ సాగు కూడా మన భారత దేశంలో చాలావరకు పెరిగింది.

ఇటీవల జరిగిన ప్రయోగాలలో శాస్త్రవేత్తలు ఇంగువను ఉపయోగించి 30 రోజులపాటు కొంతమంది ప్రజలకు ఆహారంలో చేర్చి దాని యొక్క ప్రభావాన్ని చివరగా గారు గణించారు. వారు చివరగా తెలుసుకున్న విషయం ఏమిటంటే…

ఇంగువ అనేది……..

  • దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారిలో కొంతవరకు ఉపశమనం కలిగించింది.
  • విరోచనాలను కూడా చాలావరకు నిర్మూలిస్తుందని.
  • గ్యాస్ ట్రబుల్ తో బాధపడే వారి కడుపులో గ్యాస్ ఫామ్ అవకుండా చేస్తుందని.
  • కడుపు నొప్పితో బాధపడే వారికి తక్షణమే ఉపశమనం కలిగిస్తుందని.
  • అజీర్తితో ఎల్లప్పుడూ తెలుపుతూ ఉన్న వారిలో జీర్ణక్రియను మెరుగుపరిచి తేపులు రాకుండా చూడడమే కాకుండా నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుందని.
  • మలబద్ధకంతో బాధపడే వారిలో చాలామంది సమస్యను పూర్తిగా పోగొట్టుకున్నారని.
  • అధిక రక్తపోటుతో బాధపడే వారిలో ఇది రక్త కణజాలాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తపోటుని కూడా గణనీయంగా తగ్గించిందని.
  • ఇది ఆహారంగా తీసుకున్న చాలా మందిలో మెదడు యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచిందని.
  • ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధంగా కూడా పని చేసిందని
  • బ్యాక్టీరియా మరియు ఫంగై ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారిలో చాలావరకు వ్యాధి నిరోధక శక్తిని పెంచింది అని.
  • కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం ఇప్పటికి జరిగిన ప్రయోగాలు చాలా స్వల్పంగా ఉన్నాయని. దీనికన్నా ఆధునిక ప్రయోగాలను ఉపయోగించిన తర్వాతనే వీటి యొక్క పూర్తి ఔషధ గుణాలను ఇతర జంతువులపై అదేవిధంగా మనుషులపై చేసి తుది నిర్ణయం ఇవ్వడం చాలా అవసరమని తెలియజేశారు.

Inguva Water Benefits in Telugu

మనము ఇప్పటివరకు ఇంగువ యొక్క పౌడర్ గురించి దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. కానీ.. ఇంగువ నుంచి ఇంగువ నీరు కూడా తయారుచేస్తారు. దీనిని హింగ్ వాటర్ (Hing water) అని కూడా పిలుస్తారు. ఈ ఇంగువ ద్రవము మనకు అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లేదా ఆన్లైన్లో హింగు వాటర్ అనే పేరుతో లభిస్తుంది. ఇంగువ పొడికి ఉన్న ఔషధ గుణాలన్నీ ఇంగువతో తయారు చేయబడిన ద్రావణంలో కూడా లభిస్తాయి. ఈ ద్రావణాన్ని తయారు చేయడానికి స్వచ్ఛమైన ఇంగువను నీటిలో ఉడికించి, వడకట్టి, శుభ్రపరిచి సీసాలలో పోసి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా భద్రపరుస్తారు. ఇంగువ పొడి లాగానే, ఈ ద్రావణాన్ని కూడా ఆయుర్వేద మందుల తయారీలో మరియు వంటకు ఉపయోగించే సుగంధ ద్రవ్యంగా కూడా వినియోగిస్తారు.

asafoetida water uses and benefits for good health

Inguva Farming and Availability

ఇంగువ యొక్క శాస్త్రీయ నామం ఫెరుల ఆశ పోయిటిడా (Ferula assa-foetida). ఇది ఎక్కువ కాలం జీవించగలిగే మొక్క. ఇది ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారతదేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్, మరియు చైనా ప్రాంతాలలో లభిస్తుంది.

దీనికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడం వలన దీనిని సాగు చేయుటకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇంగువ మార్కెట్లో ఒక కేజీ 2000 రూపాయల నుంచి స్వచ్ఛతను బట్టి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

ఇంగువను చెట్టు వేర్లు నుంచి తీస్తారు కనుక దీని యొక్క సేకరణ కొంచెం కష్టంగా ఉండడం వలన మార్కెట్లో స్వచ్ఛమైన ఇంగువ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. దీనిని ఆయుర్వేద మందుల తయారీలతో పోలిస్తే వంటలలో ఎక్కువ గా సువాసనకు మంచి రుచి కోసము వినియోగిస్తారు.

దీని యొక్క సాగు వీటి యొక్క గింజలం నుంచి మొదలవుతుంది. ఇంగువ గింజలు చూడటానికి చాలా చిన్నవిగా ఉండి త్వరగా మొలకెత్తగలిగే శక్తిని కలిగి ఉంటాయి. ఇంగువ సాగుకు వాతావరణం లో తక్కువ శాతం వేడి మరియు భూమిలో ఎక్కువ శాతం తేమ అవసరం.

దీని సాగులో తరచూ కలుపు మొక్కలను తొలగించడం చాలా అవసరం లేదంటే ఇంగువ మొక్కలకు కావలసిన పోషకాహార పదార్థాల దొరకక పోషకాహార లోపం ఏర్పడుతుంది. వీటికి బ్యాక్టీరియా మరియు ఫంగస్ల ద్వారా వ్యాధులు సోకడం చాలా విరివిగా ఉంటుంది.

inguva farming areas or fields in india

ఇంగువను మనం చాలా ఇష్టపడే ఊరగాయలు, పచ్చళ్ళు అంటే ఎక్కువగా గోంగూర పచ్చడి, మినుములతో చేసే పచ్చడి, దోసకాయ పచ్చడి, టమోటో పచ్చడి, అదేవిధంగా కమ్మటి రసం తయారీకి, సాంబార్, ఆకుకూరలు, పప్పు, మరియు అనేక వంటకాల తయారీలో అదిపనిగా రుచి కోసము మరియు సువాసన కోసము దీనిని ఉపయోగిస్తారు.

Frequently Asked Questions on Asafoetida

1. What part of the asafoetida plant is used as a spice?

ఇంగువను చెట్టు వేర్లు నుంచి అనేక రకాల చర్యల ద్వారా సేకరించి శుభ్రపరిచి పొడి లేదా స్పటికాల రూపంలో మార్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఆరబెడతారు.

2. Is inguva good for health?

ఇంగువలో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషక పదార్థాలు మరియు రసాయన సమ్మేళనాలు లభించుటవలన ఇంగువను తరచూ తినడంలో ఎటువంటి హాని లేదు.

3. How is asafoetida traditionally harvested?

ఇంగువ పంట ఒకసారి చివరి దశకి చేరగానే… దీనిని మనం వేరుశనగని ఎలా హార్వెస్ట్ చేస్తాము అలా… పూర్తి మొక్కను భూమి నుంచి వేర్లు కనపడేలా సేకరించాలి. ఇందులో చెట్టు వేర్లు ప్రధాన పంట కనుక వేర్లు అన్ని… భూమి నుంచి వెలుపలికి వచ్చేలా జాగ్రత్త పడాలి. హార్వెస్ట్ అవ్వగానే… రీజిన్ రూపంలో వేర్లు లో ఉన్న ఇంగువ పదార్థాన్ని కొన్ని రసాయన చర్యల ద్వారా సేకరించి… కొన్ని రోజులపాటు నీడ ప్రాంతంలో ఆరబెట్టి… పొడి రూపంలో లేదా స్పటికాల రూపంలో తయారుచేసి నిల్వ చేస్తారు.

4. Can you describe the appearance of raw asafoetida resin?

రేజిన్ అనేది ఇంగువ తయారవ్వడానికి సేకరించిన ద్రవము లేదా జిగురు అర్థం అని అనవచ్చు. ఈ జిగురు పదార్థం వేర్ల నుంచి తీసిన వెంటనే పారదర్శకంగా ఉండి పోను పోను గోధుమ రంగు నుంచి ముదురు గోధుమ వర్ణం లోకి మారుతుంది. రోజులు గడిచే కొద్దీ దీని యొక్క రంగు పూర్తిగా మనం రోజూ చూసే బెల్లం వర్ణంలోకి చేరుతుంది. వీటిని సాగు చేసే ప్రాంతాలను బట్టి మరియు కాలాన్ని బట్టి, హార్వెస్ట్ చేసిన చెట్టు వయసును బట్టి మనకు చివరగా లభించే ఇంగువ యొక్క రంగు వివిధ రకాలుగా ఉంటుంది.

5. How should asafoetida be stored to maintain its freshness?

ఇంగువ సేకరించడానికి ఎటువంటి చర్యలను తీసుకున్నాము అలానే ఇంగువను నిల్వ చేయడానికి మరియు రవాణా చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చివరగా తయారైన ఇంగువను గాలి చొరబడని సీసాలలోను డబ్బాలలోను నింపి ఎక్కువ తేమ లేని మరియు వేడిలేని ప్రాంతాలలో నిల్వ చేయాలి. నిల్వచేసిన డబ్బాలకు ఎండ మరియు ఎటువంటి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ తేమచేరిన లేదా చల్లటి గాలి డబ్బాలో చేరిన బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువ.

6. Which regions of the world are known for cultivating asafoetida?

ఇంగువ పంటను ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మరియు ఇతర ఆసియా ఖండానికి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. కొన్ని రకాల జాగ్రత్తలను వహించి ఈ పంటకు మన భారతదేశంలో చాలా డిమాండ్ ఉండడం కారణంగా అనేక ప్రాంతాలలో సాగు చేయడానికి రైతులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, రాజస్థాన్, మరియు పంజాబ్ లో ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు

Similar posts that you may like reading.

Anchovies in TeluguRohu Fish in Telugu
Pesara Pappu in EnglishSalmon Fish in Telugu
Korameenu Fish in EnglishBommidala Fish in English
Bocha Fish in EnglishSenagapappu in English
Horsegram in TeluguTelugu Podupu Kathalu with Answers
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram