Home » General Topics » Guruvinda Ginja in English, ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits)

Guruvinda Ginja in English, ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits)

Guruvinda seed is mostly found in forest areas. It is also known as Guriginjalu in Telugu. These Gurivinda seeds are available not only in our country but also in other countries, and they are considered seeds with medicinal properties in all regions. Some research shows that its leaves also contain chemical compounds that have various medicinal properties.

Guruvinda Ginja in English

It has several names in English and is also called by different local names in the southern states of India. Guriginja, or Guruvinda seed, is known as Abrus Precatorius seeds or Crab’s eye seeds in English. It is a plant belonging to the Fabaceae family. This tree is also called Gunja, or Jequirity, in English. It is a plant that can intertwine with other trees and thrive. గురివింద గింజలను ఇంగ్లీషులో Abrus Precatorius seeds లేదా Crab’s eye seeds అంటారు.

Guruvinda Ginja’s Information in Telugu

ఈ చెట్టు పది అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తు వరకు పెరగగలదు. ఈ గింజలు బాగా పండిన తర్వాత చాలా దృఢంగా తయారవుతాయి. వీటిలో అనేక రకాల జాతులు ఉన్నాయి. ఈ గింజల పైన ఉన్న కవచం వాటి జాతిని బట్టి అనేక రకాల రంగులను కలిగి ఉంటుంది. కొన్ని గింజలు పూర్తి నలుపు రంగులో ఉండి, మరికొన్ని గింజలు పూర్తి తెలుపులో ఉండి, మరో రకం గింజలు 80 శాతం గింజ వరకు ఎరుపు రంగును మిగతా 20 శాతం నలుపు రంగును కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఎక్కువ సాంద్రత ఉన్న నేలలలో ఇవి 20 అడుగుల వరకు కూడా పెరగగలవు.

ముఖ్య గమనిక: ఈ గింజలకు ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వీటిలో మనకు హాని కలిగించే చాలా రకాల విషపూరిత పదార్థాలు ఉన్నాయి కావున దీనిని ఎటువంటి నిపుణుల సలహా లేకుండా ఔషధంగా భావించడం చాలా ప్రమాదకరం. కావున దీనిని మీ స్వతహాగా ఆరోగ్యంపై ఎటువంటి ప్రయోగాల కొరకు వినియోగించకండి.

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలలో ఈ మొక్క యొక్క అన్ని భాగాలను ఔషధ గుణాల పరిశోధనలలో వాడటం జరిగింది. కొన్ని రకాల ప్రయోగాల ద్వారా కొంతమంది శాస్త్రవేత్తలు అనేక రకాల విషయాలను తెలియజేశారు. ఎక్కువమంది పరిశోధకులు ఈ మొక్క యొక్క అన్ని భాగాలలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగిన రసాయన సమ్మేళనాలు ఉన్నాయని వివరించారు.

Guruvinda Ginja Benefits

gurivinda seed benefits in telugu

ఈ మొక్క యొక్క అన్ని భాగాలకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మొక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉండడం వలన, ఈ మొక్క చాలా సంవత్సరాలుగా సిద్ధ మెడిసిన్ లో కూడా వినియోగించబడుతూ ఉంది.

కొన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ గింజలు అదేవిధంగా ఈ మొక్క యొక్క ఆకులు మరియు వేర్లు ప్రత్యేక గుణము కలిగిన యాబ్రిన్ అనే ముఖ్యమైన విష పూరిత పదార్థాన్ని కలిగి ఉంటాయి అని తెలియజేయబడింది. కట్లపాము విషానికి ఎంత విష గుణము ఉంటుందో అటువంటి విష గుణాన్ని ఈ పదార్థము కలిగి ఉంటుంది. దీని అన్ని భాగాలు అంటే ఆకులు, బెరడు, వేర్లు, మరియు గింజలు ఇటువంటి విష లక్షణాన్ని కలిగి ఉంటాయి.

ఈ మొక్క ఇంత విషపూరితమైనప్పటికీ దీనిని కొన్ని రకాల ఔషధాల తయారీలలో దాని విష గుణాన్ని తొలగించిన ఎడల మంచి ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. ఇది హిమాలయాలలోనే కాకుండా మన దక్షిణ భారతదేశంలో కూడా అధికంగా లభిస్తుంది. ఇతర దేశాలలో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లో ఈ మొక్క యొక్క పత్రాలను మరియు వేరులను ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, క్షయ వ్యాధి, మరియు జలుబు దగ్గు నివారణకు వినియోగించేవారు.

  1. కొండలలో నివసించేటటువంటి కొండ తెగలు కూడా ఈ మొక్కను చాలా రకాల వ్యాధులను నిర్మూలించడానికి వినియోగించేవారు.
  2. పచ్చకామెర్ల నివారణకు, క్యాన్సర్ చికిత్సకు, మలేరియా ప్రభావాన్ని తగ్గించడానికి, ఈ గింజలను ఉపయోగించవచ్చు అని చాలా ఆర్టికల్స్ లలో ప్రచురించబడి ఉంది.
  3. ప్రాచీన వైద్య రంగంలో ఈ మొక్కల యొక్క ఆకులను లేదా గింజలను నిమ్మరసంతో కలిపి… బాగా నూరి… వచ్చిన రసాన్ని ఎముకల నొప్పులకు, గాయాలకు, వాపు కు, చర్మపు మచ్చలకు, విరుగుడుగా వినియోగించేవారు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
  4. కొన్ని ప్రాంతాలలో మొటిమల నిర్మూలనకి కూడా గురిగింజల యొక్క పొడిని లేదా గుజ్జును ఇప్పటికీ చర్మము పై వ్రాసే ఔషధంగా వినియోగిస్తున్నారు.
  5. ఇదే ఔషధాన్ని మరికొన్ని ప్రాంతాలలో పులిపిర్ల నివారణకు కూడా విరివిగా వినియోగిస్తున్నారు.
  6. గురిగింజ విత్తనాలలో గ్లైసిరైజిన్ అని ఔషధ సమ్మేళనం కూడా ఉంటుంది.
  7. గ్లైసిరైజిన్ కూ మన శరీరంలో కలిగే చాలా రుగ్మతలను నివారించే శక్తి కూడా ఉందని పరిశోధనలలో తేలింది.
  8. ఇదే సమ్మేళనం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గించగలదు అని కొన్ని రకాల ప్రయోగాలలో నిరూపించబడింది. ఈ సమ్మేళనానికి వైరస్ ను మరియు వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ నివారించే సామర్థ్యం కూడా కలదు.
  9. ఈ గింజలను ఆయుర్వేదంలో అనేక రకాల ప్రక్రియల ద్వారా దాని యొక్క విష లక్షణాలను తొలగించి నోటి ద్వారా ఇచ్చే ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తున్నారని చాలా శాస్త్రీయ పరమైన పత్రికలలో ప్రచురించబడింది.
  10. జ్వరాన్ని తగ్గించే లక్షణం కూడా ఈ గింజలకు ఉందని నిపుణుల అభిప్రాయం. వీటి యొక్క ఆకులకు చర్మంపై వచ్చే అలర్జీలను కూడా నయం చేయగలదు అని పేర్కొనబడింది.
  11. దీనితోపాటుగా దీనికి పర్జేటివ్ శక్తి కూడా ఉందని కనుగొన్నారు. పర్జేటివ్ శక్తి అంటే మన కడుపులో ఉన్న మలినాలను శుభ్రం చేయగలిగే శక్తి కలిగి ఉండడం.
  12. వీటన్నిటి ఉపయోగాలు మనకు తెలిసినప్పటికీ, ఈ చెట్టు యొక్క ఏ భాగమైన మన ఆరోగ్య ప్రయోజనాలకు వినియోగించే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవడం లేదా వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Benefits of Guruvinda Ginja in English

Benefits of Guruvinda Ginja in English

  1. This seed has antipyretic properties, so it can reduce the body temperature during a fever. It can reduce the severity of asthma.
  2. There is some scientific evidence that the leaves of this plant can cure skin diseases or infections.
  3. In its seeds, it contains anti-coughing agents, so it has the ability to treat cough.
  4. As it contains poisonous compounds, it can be used as a pesticide for controlling pests in agriculture.
  5. Despite being a pesticide, it is dangerous to consider it a healthy and friendly pest control agent.
  6. In some areas, in Ayurveda, it has been used in preparing traditional medicine to treat skin infections.
  7. Our ancestors used to use these seeds to treat warts.
  8. Most importantly, there are some valuable suggestions from the scientific studies that it has very dangerous toxins and that avoiding using these seeds for any health-beneficial purpose is very important.
  9. It has a toxic compound called abrin that can kill cells by inhibiting protein synthesis.
  10. In addition to its seeds, its leaves are also useful to treat cold, cough, and fever.
  11. There are several reports that all parts of this plant have been used in folk medicine to treat different diseases.
  12. As it contains cytotoxic compounds, it can be used for treating life-threatening conditions like cancer, according to recent scientific studies.

Chemical composition of Guruvinda Ginja

Guruvinda ginja nutrients and poison chemicals value per 100 grams

Other Benefits of Guruvinda Ginja

Raw Abrus Precatorius seeds or Crab’s eye seeds
  1. కొన్ని రకాల ఆచార అలవాట్లలో ముఖ్యంగా పూజ కొరకు మరియు దైవ శక్తి తమ ఇండ్లలో నిండుగా… ఆర్థిక లాభాలు పొందుటకు దీనిని దైవ శక్తి ఉన్న గింజలుగా భావించి పరిశుద్ధ ప్రాంతాలలో పవిత్రముగా ఉంచుతారు.
  2. మరికొన్ని ఆచారాలలో ఈ గింజలతో చేసిన దండలను దైవమాలగా భావించి మెడలో ధరిస్తారు.
  3. ఇవి ఆకారంలో మెరుస్తూ ఉండడం వలన విలువైన అందమైన ఆభరణాల తయారీలోనూ ఎక్కువగా వాడటం జరుగుతోంది.
  4. మన పూర్వీకులు వీటి గింజలతో చేతి కడియాన్ని లేదా పిల్లలకు మొలతాడిని చేసి ఆరోగ్యాన్ని మరియు దుష్టశక్తులను తొలగించే దైవ ఆభరణంగా విక్రించేవారట.
  5. ఇప్పటికీ కొందరు సాధువులు లేదా మంత్రగత్తెలు వీటి గింజలను తాయత్తుల లోపల నింపే పొడిగా ఉపయోగిస్తున్నారు.
  6. ఈ గింజలు సాధారణ ఎరుపు రంగు పొడిని ఇవ్వడం వలన వీటిని వస్త్రాలకు రంగులు వేయుటకు వినియోగిస్తారు.

ఈ ఆర్టికల్ లోని ఇన్ఫర్మేషన్ కేవలం అవగాహన మరియు సమాచార సేకరణ కోసమే. మీకు నా వివరణ నచ్చినట్లైతే మరికొన్ని విషయాల కోసం మా యొక్క ఆర్టికల్స్ను ఫాలో అవుతూ అప్ టు డేట్ గా ఉండండి.

You may also like reading the posts given in the table

Tenali Ramakrishna StoriesBocha Fish in English
Good stories in TeluguStories for kids in Telugu
Nungu in English -Taati MunjaluFunny Stories in Telugu
Stories in Telugu with MoralInguva in English (Perungayam)
Anchovies in TeluguBommidala Fish in English

Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram