Home » Food » Bocha Fish in English | బొచ్చ ఆరోగ్య ప్రయోజనాలు

Bocha Fish in English | బొచ్చ ఆరోగ్య ప్రయోజనాలు

బొచ్చ మనకు బాగా తెలిసిన చేప. మనము చేపల మార్కెట్ కు గనుక వెళితే తప్పకుండా ఈ చేపను అక్కడ చూడవచ్చు. మనకు మార్కెట్లో దొరికే చేపలలో అధిక మోతాదులో ఈ చేపలే రవాణా చేయబడతాయి. ఈ చేప వల్ల చాలా ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడం వలన ఈ చేపను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ చేపను ఎక్కువగా దక్షిణ ఏషియా కి చెందిన చేపగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ చేప దక్షిణ ఏషియా ఖండంలో బాగా లభిస్తుంది.

Bocha Fish English Name

Bocha Fish in English

Bocha fish English name: ఇతర దేశాలలో దీనిని English లో కట్ల (Catla or Katla) లేదా సౌత్ ఏషియన్ కార్ప్ (South Asian Carp) అని పిలుస్తారు. ఇది మన భారతదేశంలో ఆర్థికంగా ముఖ్యమైన మంచినీటి చేప గా పరిగణిస్తారు.

Buy Wow Omega 3 Fish Oil

Shape and Size:

ఇది ఒక మంచినీటి చేప. ఈ చేప ఆకారంలో చాలా పెద్దగా ఉంటుంది. చూడటానికి వెడల్పుగా అనిపిస్తుంది. ఇది ఒక కేజీ నుంచి అధికంగా 40 కేజీల వరకు పెరగగలదు. దీని తల చాలా పెద్దదిగా తన శరీరంలో 25% ఆకారంలో కలిగి ఉంటుంది. దీని కింద దవడ చాలావరకు సాగుదలను కలిగి ఉంటుంది కనుక ఇది ఒక్కసారిగా ఎక్కువ ఆహారాన్ని తినగలదు. దీని శరీరం పెద్ద పాటి పోలుసులతో చిక్కగా కప్పబడి ఉంటుంది.

ఇవి చిన్నగా ఉన్నప్పుడు చిన్నపాటి మొక్కలను వాటి భాగాలను తింటూ పెరుగుతాయి. ఒక్కసారి 500 గ్రాములు పైన పెరిగినప్పుడు.. ఇవి చిన్న పాటి చేపలను మొక్కలను ఇతర కళేబరాలను కూడా ఆహారంగా తీసుకుని అధిక బరువు కి తక్కువ సమయంలో చేరుకుంటాయి. ఈ చేప రెండు సంవత్సరాలకే రెండు కేజీల పైగా బరువుని పొందుతుంది

Bocha Fish Farming

దీని మాంసం ఆహారానికి చాలా అనుకూలంగా ఉండడం వలన ఈ చేపకు అన్ని దేశాలలోనూ చాలా డిమాండ్ ఉంది. ఈ చేపలో పోషక పదార్థాలు అధికమవుతాదులో లభిస్తాయి. దీనిని వ్యవసాయ రంగంలో ఒక విలువైన పంటగా పరిగణించి అధిక మొత్తంలో రైతులు ఈ చేపలను సాగు చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ చేప మంచినీటిలో పెరగడం వలన దీనికోసం రైతులు చిన్నపాటి గుంటలను తయారు చేసి వాటిలో ఈ చేపను సాగు చేస్తారు. ఈ చేప ఎప్పుడైతే ఒక కేజీకి నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుందో అప్పుడే దీని మాంసానికి చాలా డిమాండ్ ఉంది కనుక రైతులు రెండు కేజీల వరకు పెంచి… ఈ చేపను ఐస్ బాక్సులలో పెట్టి ఇతర ప్రాంతాలకు అంటే ఇతర దేశాలకు కూడా రవాణా చేస్తారు. దీని సాగు రెండు సంవత్సరాల లో పూర్తవడం వలన రైతులు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.

Bocha fish agriculture farming

దీని బరువు ఎప్పుడైతే ఒక కేజీకి చేరుకుంటుందో అప్పుడు ఇది గుడ్లను విడుదల చేయడానికి తయారవుతుంది. ఒక్క సీజన్లోనే ఇది కొన్ని లక్షల వరకు గుడ్లను విడుదల చేయగలదు.

ఇది మొక్కలను ఆహారంగా తీసుకోవడం వల్ల, ఇతర చేపలతో కలిసి జీవించగల సామర్థ్యం కలిగి ఉండడం వల్ల, మరియు తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడం వల్ల, దీని మాంసం అధిక రుచి కలిగి ఉండడం వల్ల, ఈ చేప మాంసంలో ఎటువంటి హానికర పదార్థాలు లేకపోవడం వల్ల, ఈ చేప ఖరీదు… సాధారణ స్థాయిలో ఉండటం వల్ల, ఈ చేపను అందరూ తింటారు. కనుక ఈ చేపకు ఇతర చేపలతో పోలిస్తే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.

ఈ చేప మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడడమే కాకుండా. నిరుద్యోగ విద్యార్థులకు మంచి ఆర్థిక వనరుగా మారింది. ఈ చేప చిన్నపాటి కుంటలలో ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల.. దీనిని వ్యవసాయ భూములలోను చిన్నపాటి పొలాలలోనూ పెంచి అధిక మోతాదులో రాబడిని రైతులు పొందుతున్నారు.

Health Benefits of Catla (బొచ్చ ఆరోగ్య ప్రయోజనాలు)

కట్ల చేప అధిక పోషకాలు కలిగిన జీవి ఇది ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ ని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ని అన్ని రకాల విటమిన్స్ను మరియు అవసరమైన లవణాలను తన మాంసంలో పొందిపరిచి ఉంటుంది. దీని యొక్క మాంసంలో మన జీవన రసాయనక చర్యలకు కావలసిన అన్ని రకాల ముఖ్యమైన అమినోయాసిడ్స్ అధికంగా లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఊహించలేని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారము దీని యొక్క మాంసంలో ఉన్న పోషకాలు గుండెకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. అదేవిధంగా ఈ చేప లో ఉన్న లవణాలు మరియు పోషకాలు మన ఎముకుల బలాన్ని పెంచడమే కాకుండా వాటి వల్ల కలిగే రుగ్మతల నుంచి కూడా మనల్ని కాపాడుతాయి. ఇది కంటిచూపుని కూడా చాలావరకు మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలో పొందుపరిచారు. దీని మాంసంలో మనకు అత్యధికంగా ఎక్కువగా అవసరమయ్యే లవణాలు క్యాల్షియం, సెలీనియం మరియు నియాసిన్ లు అధికంగా ఉంటాయి.

దీని మాంసంలో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలో విడుదలయ్యే విషపూరిత రసాయనలను నిర్మూలిస్తాయి….అంటే ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి.ఇందులో లభించే నియాసిన్ ఔషధము గుండె సమస్యల ద్వారా బాధపడి వారిలో వారి యొక్క శారీరిక బలాన్ని పెంచి ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులో లభించే విటమిన్ బి12 మన నాడీ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా మనలో కలిగే అలసటను తగ్గించి మనకు ఉత్సాహాన్నిచ్చే హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్రక్రియలు దోహదపడి మనకు కావలసిన శక్తిని మరియు ఉత్సాహాన్ని అందిస్తుంది. విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. దీనితోపాటు మన రక్తంలో మనకు కావాల్సిన కణాలు మరియు వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.

విటమిన్ C లోపంతోనూ లేదా ప్రోటీన్ల లోటుతోను బాధపడేవారు ఈ చేప యొక్క మాంసాన్ని వారానికి ఒకసారి వారి వారి ముఖ్యమైన ఆహార వంటకంగా చేర్చుకోవచ్చు.

వీటిలో మనకు కనపడని ఆహార పోషక పదార్థాలు అధికంగా ఉండడం వలన ఇతర హార్మోన్ల సమస్యతో లేదా పోషకాహార కొరతతో బాధపడేవారు… ఈ చేప తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం వల్ల …..ఈ చేపను వారి యొక్క ముఖ్యమైన మాంసాహార ఆహార పదార్థంగా భావించవచ్చు.

Catla Fish Nutrition Value

Nutritional value of Katla fish for good health

Information about Bocha Fish in English

  1. It is a good source of fish meat and it can replace the meat from poultry.
  2. It can be eaten by all categories of people as it has essential compounds and minerals that are crucial for human metabolism.
  3. It is a freshwater fish, It does not accumulate poisonous chemicals as the sea or saltwater fish do.
  4. It has been widely cultivated in India for commercial purposes.
  5. Its meat contains amino acids, omega-3 fatty acids, proteins, minerals, vitamins, etc.
  6. It is considered the best food for people who are suffering from cardiovascular disease as it contains a good amount of omega-3 fatty acids.
  7. It is morphologically different from the fish rohu and others.
  8. It has a wide body and a big head that helps eat more amounts of food and grow faster.
  9. It can grow up to 40 kg within 10 years, but growers will not allow its growth beyond 2kg as it loses its taste as it grows.
  10. It produces 5 to 10 lakhs of eggs in each season depending on the environment it grows.

Health Benefits of Catla Fish

Katla fish health related uses and katla fish benefits
  1. Catla fish meat contains a good amount of Iodine, zinc, potassium, and selenium, the essential elements crucial for hormonal balance.
  2. Consuming catla fish frequently reduces the adverse effects that occur by colitis and Crohn’s disease, inflammatory bowel disorders (BD).
  3. In younger individuals, it enhances brain function, leading to enhanced concentration and reading skills, and reduced attention deficiency.
  4. Catla fish has been found to alleviate the severity of arthritis and help strengthen the joint bones.
  5. It is rich in retinol, a type of vitamin A, which is crucial for several biochemical mechanisms in our body, one of which includes improving vision.
  6. Omega-3 fatty acids, found in fish meat, are essential fats for protecting our skin cells from versatile skin conditions such as eczema, psoriasis, and others.

Key Takeaways

  • బొచ్చ అనేది ఒక మంచి నీటి చేప. దీనిని ఆంగ్లంలో కట్ల ఫిష్ అని పిలుస్తారు.
  • ఇది ఒక కేజీ నుంచి 40 కేజీల వరకు పెరగగలదు.
  • దీనిని ఎక్కువగా నేపాల్ మరియు భారతదేశ ప్రాంతాలలో ఎక్కువగా తినడం వల్ల దీనికి డిమాండ్ ఉండడంతో చిన్నపాటి రైతులకు కూడా అధికమవుతాదులో సాగు చేస్తారు.
  • ఈ చేప కొన్నిసార్లు గండి లేదా గడ్డిచేపతో పోల్చబడుతుంది కానీ ఇది పూర్తిగా వాటికి భిన్నంగా ఉంటుంది.
  • ఈ చేప మాంసంలో కొవ్వు పదార్థాలు, ఒమేగా -3 ఫ్యాటీ అసిడ్స్, అమినో ఆసిడ్స్, ముఖ్యమైన విటమిన్లు మరియు మనకు కావలసిన లవణాలు అధికంగా లభిస్తాయి.
  • ఈ చేపకు అన్ని ప్రాంతాలలో అధిక డిమాండ్ ఉండటం వల్ల ఇది ఒక మంచి వ్యాపార వనరుగా కూడా మన భారతదేశంలో పరిగణిస్తున్నారు.
  • ఈ చేపను అన్ని రకాల వయసులో కలవారు మంచి ఆహార పదార్థంగా భుజించవచ్చు.
  • ఈ చేపను ఐస్ బాక్సుల్లో భద్రపరిచి ఇతర దేశాలకు కూడా రవాణా చేసి మన భారతదేశం ఆర్థికంగా ఫలితాన్ని పొందుతుంది.
  • ఈ చేప మాంసంలో మన రక్తప్రసరణకు మరియు వ్యాధి నిరోధక శక్తికి కావలసిన పోషక పదార్థాలు మరియు పోషక విలువలు అధికమవుతాదులో లభిస్తాయి.
  • ప్రాంతాన్ని బట్టి ఈ చేప మాంసాన్ని అనేక రకాలుగా వండుకుని తింటారు.

Similar posts that you may like reading.

Vanjaram Fish in EnglishRohu Fish in Telugu
Korameenu Fish in EnglishSalmon Fish in Telugu
Bangaru Teega Fish in EnglishBommidala Fish in English
Phalsa Fruit in TeluguAloo Bukhara in English
Roop chand Fish in TeluguTelugu Podupu Kathalu with Answers
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram