Home » General Topics » Telugu Podupu Kathalu with Answers | Telugu riddles with answers (పొడుపు కథలు)

Telugu Podupu Kathalu with Answers | Telugu riddles with answers (పొడుపు కథలు)

ఈ  Telugu Podupu Kathalu నేను మా అమ్మమ్మ, నాన్నమ్మ, అత్తమ్మల నుంచి సేకరించాను. వీటిలో సులభమైనవి మరియు క్లిష్టమైనవి రెండురకాలూ ఉన్నాయి. ఈ Telugu Podupu Kathalu మన పెద్దలు మెదడుకు పదును పెట్టే పరికరాలుగా భావిస్తారు.

ఒకప్పుడు మన పెద్దవారు ఈ Telugu Podupu Kathalu వారి రోజు వారీ కార్యకలాపాలలోను, విశ్రాంతి తీసుకునే సమయంలో, నిద్రించే ముందు, పొలం పనులప్పుడు ఈ పొడుపు కథలను (ప్రశ్నలు), ఒక సవాలుగా ఒకరి మీద మరొకరు విసిరేవారంట.

ఇప్పట్లో వీటి యొక్క వాడుక చాలా వరకు తగ్గిపోయింది. ఈ Telugu Podupu Kathalu పిల్లల చేత విప్పించే ప్రయత్నం చేయడం వల్ల వారిలో ఆలోచనా శక్తి, మానసిక వికాసం, సృజనాత్మకత మరియు ఆత్మ విశ్వాసం పెరుగుతాయని భావిస్తారు.

Riddles in Telugu with answers
Riddles in Telugu Language

Telugu Podupu Kathalu with Answers

కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్లీ తిరిగి రాలేదు? (katha pellikoduku battalanni vippesi bayaloki dhukadu malli bayataki raledhu)

జవాబు: అరటిపండు (banana)

దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది (dhasthe pidikili lo dhaguthundhi, theeste illantha pakuthundhi)

జవాబు: దీపం వెలుగు (dheepam velugu)

దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాను, నరవాహనము లేక నడిచిపోలేను. నాకు జీవం లేదు కానీ జీవుల్ని చంపుతాను (dheha mella kallu, dhevendhrudini kanu, naravahanam lenidhe nadavalenu, naku jeevam ledhu kani jeevulni champuthanu)

జవాబు:  వల (net)

పొట్టి వాడికి ఒళ్లంతా బట్టలే… ఎవరది? (pottivadiki vallantha battaley, evaradhi)
జవాబు: ఉల్లిపాయ

ఇల్లంతా తిరిగింది మూలన కూర్చుంది (illantha thirigindhi mula kurchundhi)
జవాబు: చీపురు. (cheepura)

తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది? (thokaleni pitta thombai amadalu poindhi)

జవాబు:  ఉత్తరం (post)

చక్కని రాజుకు ఒళ్లంతా బొచ్చు? (chakkani rajuku ollantha bochu)

జవాబు: పొలం గట్టు (polam gattu)

చక్కని రాజుకు ఒళ్లంతా ముత్యాలు? (chakkani rajuku vallantha muthyalu)

జవాబు: మొక్కజొన్న కంకి (mokka jonna kanki)

వేలెడంత పిల్లోడు చీరంతా తిరిగాడు? (veledantha pillodu cheeranthaa thirigadu)

జవాబు: సూది (soodhi)

ఒక సభ ఆ సభలో 32 మంది సభ్యులు అందులో ఒక నాట్యగత్తె నాట్యం వేస్తూ కనిపిస్తుంది ? (oka sabha aa sabhalo 32 people, andhulo oka natyagathe natyam vesthu kanipisthundhi)

జవాబు: నోరు, నోటిలో 32 పళ్ళు, నాలుక. (noru, notilo 32 pallu, and naluka)

అమ్మ అంటే అందుతాయి నాన్న అంటే అందవు? (amma ante andhuthai, nanna ante andhavu)

జవాబు: పెదవులు (pedhavulu)

గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నానికి మాయం అవును, ఏమిటది? (guthulu guthulu mamidi guthulu madhyhnaniki mayam avunu)

జవాబు: ఇంటి ముందు చల్లు కల్లాపు. (inti mundhu kallapu)

Telugu Podupu Kathalu with Answers

కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్లీ తిరిగి రాలేదు? (katha pellikoduku battalanni vippesi bayaloki dhukadu malli bayataki raledhu)

జవాబు: అరటిపండు.

ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ? (mugguru sipailaki okate topi)

జవాబు: తాటి కాయ (thati kaya)

గంపెడు చెట్లలో గుబెలు మన్నాయి? (gampedu chetlalo gabelu mannai)

జవాబు: ముంజు కాయలు (munju kayalu)

నల్ల బండ క్రింద నలుగురు దొంగలు? (nalla banda kindha naluguru dhongalu)

జవాబు: గేదె, గేదె పొదుగు (gedhe, gedhe podhugu)

నల్లని పొలం లో తెల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు?(nallani polam lo thellani vithanalu, chetho challutham notitho verutham)

జవాబు: పలక అందులోని అక్షరాలు (palaka, aksharalu)

ఓ.. రాజా నువ్వు లాగు నేను వస్తా? (o raja nuvvu laagu nenostha)

జవాబు: తలుపు (thalupu)

చెయ్యని కుండ పొయ్యని నీరు, పెట్టని సున్నం? (cheyyani kundalo poyyani neeru, pettani sunnam)

జవాబు: టెంకాయ (tenkaya)

కిట కిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు?(kita kita thalupulu, kitari thalupulu, eppudu theesina chappudu kaavu)

జవాబు: కళ్ళు (eyes)

గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ?(godameeda bomma golusula bomma vache poye vaariki vaddinchu bomma)

జవాబు: తేలు (thelu)

తనువంతా రంధ్రాలు కానీ తీయగా పాడుతాను? (thanuvantha randhralu kani thiyyaga paduthanu)

జవాబు: పిల్లనగ్రోవి (pillana grovi)

podupu kathalu in telugu with answers

Telugu Podupu Kathalu with Answers

చారెడు నీళ్ళల్లో చామంతి బిళ్ళ? (charedu neellalo chamanthi billa)

జవాబు: నూనె, నూనె లో వడ (nune, nunelo vada)

గంపెడు శనగల్లో ఒక గులకరాయి? (gampedu senagallo oka gulakarai)

జవాబు: చందమామ (chandha mama)

గిన్నె….. గిన్నె లో వెన్న….. వెన్న లో నల్లద్రాక్ష ? (ginne…ginnelo venna….vennalo nalla dhraksha)

జవాబు: కన్ను (eye)

మా ఇంటి వెనుక ఒక గూనొడు? (maa inti venuka oka gunodu)

జవాబు: నాగలి (naagali)

పాముని చంపుతాను కానీ, గ్రద్దను కాను, ఒళ్లంతా కళ్లు ఉంటాయి, కాని ఇంద్రుడుని కాను, నాట్యం చేస్తాను కానీ శివుడిని కాను, నేనెవర్ని?(paamuni champuthanu kani gradhanu kanu, ollantha kalluntai kani indhrudini kaanu, natyam chesthanu kani shivudini kaanu, nenevarini)

జవాబు: నెమలి (peacock)

ఒళ్లంతా ముళ్ల్లే కానీ రత్నలాంటి బిడ్డలు (ollantha mulle kaani rathnallanti biddalu)

జవాబు: పనస పండు (panasa pandu)

తోలు నలుపు, తింటే పులుపు అది ఏమిటో తెలుపు? (tholu nalupu thintey pulupu adhemito thelupu)

జవాబు: చింతపండు (chintha pandu)

అలాము కొండకు సలాము కొట్టు (alam kodaku salam kottu)

జవాబు: గొడ్డలి (goddali)

అయ్యంటే దూరంగా వెళ్లి అమ్మంటే దగ్గరకు వచ్చేవి ఏమిటి? (ayya ante dhuram ga velthai, amma antey dhaggaraku vasthai, emitavi?)

జవాబు: పెదవులు (pedhavulu)

అడవిలో అక్కమమ జుట్టు విరబోసుకును కూర్చుంది? (adavilo akkamama juttu virabosukyni kurchundhi)

జవాబు: ఈతచెట్టు (eetha chettu)

అరుగు గోడకు అరచేయి (arugu godaku aracheyi)

జవాబు: పిడక (pidaka)

కదలలేడు, కానీ కావలికి గట్టివాడు (kadhala ledu, kaani kavaliki gattivadu)

జవాబు:  తాళం (thalam)

ఎర్రవాడొస్తే, నల్లవాడు పారిపోతాడు (erravadu vasthe nallavadu pothadu)

జవాబు: సూర్యుడు, చీకటి (suryudu, cheekati)

బంగారు చెంబులో వెండి గచ్చకాయ (bangaru chembulo vendi gachakai)

జవాబు: పనసపండు గింజ (panasapandu ginja)

Podupukathalu in telugu and English

బండకు కొడితే వెండి ఊడుతుంది? (bandaku kodithe vendi uduthundhi)

జవాబు: కొబ్బరికాయ (kobbarikaya)

అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది? (adivilo puttindhi adivilo perigindhi, maa intiki vachindhi thaithakkaladindhi)

జవాబు: కవ్వం (kavvam)

నూరు పళ్లు, ఒకటే పెదవి (nooru pallu okate pedhavi)

జవాబు: దానిమ్మ పండు (dhanimma pandu)

పైడిపెట్టెలో ముత్యపు గింజ (pydipettelo muthyapu ginja)

జవాబు: వడ్లగింజ (vadla ginja)

పొట్టలో వేలు, నెత్తి మీద రాయి (pottalo velu nethimeedha rai)

జవాబు: ఉంగరం (ungaramu)

సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు (sannani sthambam, ekkaleru dhigaleru)

జవాబు: సూది (soodhi)

తనను తానే మింగి, మావమౌతుంది (thananu thaane mingi mayamauthundhi)

జవాబు: మైనపు వత్తి (mynapu vathi)

తొడిమ లేని పండు (thodima leni pandu)

జవాబు: విభూది పండు (vibudhi pandu)

ఆకులేని పంట (aaku leni panta)

జవాబు: ఉప్పు (uppu)

ఒక్కటే కడుపు కానీ రెండు గుడ్లు (okkate kadupu kaani rendu gudlu)

జవాబు: వేరుశనగ (verusenaga)

నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది? (nilabadithe nilusthundhi, kurchunte kulabaduthundhi)

జవాబు: నీడ (needa)

అడవిలో ఆంబోతు రంకే వేస్తుంది (adavilo aambothu rakesthundhi)

జవాబు: గొడ్డలి (goddali)

కాళ్ళు చేతులు లేని తెల్లదొరకు బోలెడు దుస్తులు (kaallu chethulu leni thella dhoraku boledu dhusthulu)

జవాబు: ఉల్లిపాయ (ullipaya)

కన్నులెర్రగా ఉండును రాకాసి కాదు, తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు, పాకిపోవుచుండు పాము కాదు, ఏమిటది? (kannulu erraga undunu rakasi kadhu, thala nundi poga vachunu bhutham kadhu, pakipovuchundunu pamu kadhu, emitadhi?)

జవాబు: రైలు (train)

ఇనుప ముద్దోడు కానీ ఇంటికి గట్టోడు (inupa mudhodu kani intiki gattodu)

జవాబు: తాళం బుర్ర (thalam burra)

ఆకు మరియు సున్నం లేకపోయిన నోరు ఎర్రంగా, వానా మరియు ఎండ లేకపోయిన పైరు పచ్చంగా (aaku and sunnam lekapoina noru erraga, vana and enda lekapoina pyru pachaga)

జవాబు: రామచిలుక (rama chiluka)

ఎండా లేదా వానొస్తే గాని బయట అడుగుపెట్టనిది (enda ledhaa vana vasthe gaani bayata adugupettanidhi)

జవాబు: గొడుగు (godugu)

అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా  ఇటుపక్క పడదు, అటు పక్క పడదు (adda goda meedha budda chembu, thosinaa itu pakka padadhu, atupakka padadhu)

జవాబు: ఎద్దు మూపురం (yeddu mopuram)

అమ్మతమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామను (amma thammudini kaadhu kaani nenu meeku mena mamanu)

జవాబు: చందమామ (chandha mama)

కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు? (kommuluntai kaani edhu kaadhu, ambhari untundhi kaani yenugu kaadhu)

జవాబు: నత్త (natha)

పైన చూస్తే పండు, పగులగొడితే బొచ్చు (pyna chusthe pandu, pagalagodithey bochu)

జవాబు: పత్తి కాయ (pathi kaya)

రెండు కాళ్ళు ఇరవైమెట్లు (rendu kaallu iruvy metlu)

జవాబు: నిచ్చెన (nichena)

దోసెడు ఇంట్లో, మూరెడు కర్ర? (dhosedu intlo muredu karra)

జవాబు: కుండలో గరిటె. (kundalo garita)

కాళ్లు లేవు కానీ నడుస్తుంది, కళ్లు లేవు కానీ ఏడుస్తుంది? (kaallu levukani nadusthundhi, kallu levukani edusthundhi)

జవాబు: మేఘం (megham, clouds)

చెట్టుకు కాయ‌ని కాయ కర‌క‌ర‌లాడే కాయ‌? (chettuku kayani kaya kara kara lade kaya)

జవాబు: కజ్జికాయ (kajjikaya)

మనతో ఏ మాత్రం పరిచయం లేకపోయినా, పైకి రావాలి” అంటూ ప్రోత్సహించేది (manatho etuvanti mathram lekapoina, pyki ravali antu prosthahinchedhi)

జవాబు: కండక్టర్ (bus conductor)

Podupu kathalu in Telugu and English

కళ్లున్నాయి కానీ చూపు లేదు, కొప్పుంది కాని జుట్టు లేదు? (kallunnai kaani chupu ledhu, koppu undhi kani juttu ledhu)

జవాబు: కొబ్బరి కాయ (coconut fruit)

ఆయుధం లేని పోరాటం (ayudham leni poratam)

జవాబు: మౌనపోరాటం (mouna poratam)

తెలిసేలా పూస్తుంది కానీ తెలియకుండా కాస్తుంది? (thelisela pusthundhi, kani theliyakunda kasthundhi)

జవాబు: వేరుశెనగ కాయ (verusenaga kaya)

ముళ్ల పొదలో మిఠాయి పొట్లం (mulla podhalo mitai potlam)

జవాబు: తేనె పట్టు (thene pattu)

 తెల్లటి మంచు గల శరీరంతో ఉండే ఎర్రముక్కు దొర (thellati manchugala sareeramtho unde erramukku dhora evaru)

జవాబు: కొవ్వొత్తి (candle)

ఎక్జామినర్ దిద్దని పేపర్ (examiner correction cheyani paper)

జవాబు: న్యూస్ పేపర్ (news paper)

నిమ్మ కానీ నిమ్మ (nimma kani nimma)

జవాబు: దానిమ్మ (dhanimma)

నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది? (neery thagilithe guppedavuthundhi, enda thagilithe gampedu avuthundhi)

జవాబు: దూది (cotton)

తోలు తీయనా, గుండు మింగనా? (tholu thiyyan, gundu mingana)

జవాబు: అరటి పండు (arati pandu)

అందర్నీ నవ్వండి, నవ్వండి అని ప్రోత్సాహమిస్తూ, తాపత్రయ పడే వారు (andharni navvandi navvandi ani prosthahisthu pradheya padevaru)

జవాబు: ఫోటోగ్రాఫర్ (photographer)

జీవితాంతం మనతో తోడుగా ఉండే పాము (jeevithantham manatho thoduga unde paamu)

జవాబు: వెన్నుపాము (vennu pamu)

మేకల్ని తోలేసి తడికలకి పాలు పిండుతారు? (mekalni tholesi thdikalaku paalu pithikaru)

జవాబు: తేనె పట్టు (thene pattu)

తెర తెరిస్తే ముత్యాల బేరు (thera theristhe muthyala beru)

జవాబు: దంతాలు (teeth)

లాగి విదిలితేనే ప్రాణం (laagi vadhilithene pranam)

జవాబు: శ్వాస (swasa)

తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది? (thelisi kuduthundhi, theliyaka chasthundhi)

జవాబు: చీమ, దోమ (cheema and dhoma)

లోయలో లోలకం (loyalo lolakam)

జవాబు: నాలుక (toungue)

రెండు కొడతాయి… ఒకటి పెడుతుంది? (rendu koduthai okati peduthundhi)

జవాబు: ఎండ, వాన, చలి (yenda, vana, chali)

వాహనాలకు లేని టైర్లు (vahananiki leni tyrulu)

జవాబు: సెటైర్లు (satire lu)

పాలు కాని పాలు, ఏమి పాలు? (palu kani palu, emi palu)

జవాబు: లోపాలు (lopalu)

వీసా అడగని దేశం (visa adagani dhesam)

జవాబు: సందేశం (sandesam)

గుడిలో ఉండని స్వామి (gudilo undani swami)

జవాబు: భాగస్వామి (bhagaswami)

రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు? (ralla aduguna villu, villu konalo mullu)

జవాబు: తేలు(thelu)

మనం ఎవ్వరికీ ఇవ్వలేని దానం (manam evvariki ivvaleni daanam)

జవాబు: నిదానం (nidhanam)

రంగం కాని రంగం, ఏమి రంగం? (rangam kaani rangam, emi rangam)

జవాబు: వీరంగం (veerangam)

Telugu riddles with answers

రసం కాని రసం (rasam kaani rasam)

జవాబు: నీరసం (neerasam)

ఓక గ్రహం లేకుంటే, మరో గ్రహం వస్తుంది (oka graham lekunte maro graham vasthundhi)

జవాబు: నిగ్రహం మరియు ఆగ్రహం (nigraham and aagraham)

అందరికి నచ్చే బడి (andhariki nache badi)

జవాబు: రాబడి (raabadi)

ధనము కాని ధనము, ఏమి ధనము? (dhanamu kani dhanamu, emi dhanamu)

జవాబు: ఇంధనము (indhanamu)

కంగారు పెట్టించే వరం (kangaru pettinche varam)

జవాబు: కలవరం (kalavaram)

Telugu samethalu kosam ea link click cheyandi: Samethalu

Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram