Home » Food » Sorakaya in English- Anapakaya Benefits (ఆరోగ్య ప్రయోజనాలు)

Sorakaya in English- Anapakaya Benefits (ఆరోగ్య ప్రయోజనాలు)

సొరకాయ లేదా ఆనపకాయను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారు తెలుసుకునే ముందు దాని గురించి లేదా దాని చరిత్ర గురించి ముందుగా రెండు వాక్యాలలో చూద్దాం. సొరకాయను లేదా సొరకాయ ఆకులను ప్రాచీన కాలంలో ఆహారం గానే కాకుండా వైద్యరంగంలో కొన్ని విలువైన ఔషధాల తయారీలోనూ వినియోగించేవారు. ఇది Cucurbitaceae కుటుంబానికి చెందిన మొక్క. ఈ కుటుంబానికి చెందిన చాలా మొక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సొరకాయలో ఔషధ గుణాలు ఉండటం వలన దీనితోపాటు ఇతర కూరగాయలు ఏవైతే ఈ కుటుంబానికి చెందుతాయో కనుక్కొని వాటిని కూడా ఆయుర్వేద ఔషధ తయారీలో వినియోగించేవారు.

సొరకాయ యొక్క పోషక విలువలను మరియు దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా తెలుసుకునడానికి ఈ ఆర్టికల్ ని చివరి వరకు చదవడానికి ప్రయత్నించండి.

Anapakaya or Sorakaya in English

Anapakaya, sorakai, or Sorakaya english names
Sorakaya in English

Sorakaya has been called by different names in English. However, the popular name for this vegetable in English is Bottle gourd. The other names of anapakaya or sorakaya in English include calabash gourd, trumpet gourd, birdhouse gourd, and white-flowered gourd. The scientific name of sorakaya is Lagenaria siceraria. It has other popular names such as lauki, ghia or dudhi in India.

Sorakaya in Kannada – Sore kaaye

Sorakaya in Tamil –Sorakkai

Sorakaya in Marathi – Dhidi

Sorakaya in Gujarati – Doodhi

Sorakaya in Malayalam – Chorakaa

Sorakaya in Hindi – Lauki

Sorakaya in Bengali – Lau

Benefits of Sorakaya in English

 1. Sorakaya has been proven that it can control the stress.
 2. It can induce the formation or development of both red and white blood cells in the body.
 3. Sorakaya also has the power to significantly reduce body weight.
 4. It has been proved that it has the ability to control blood sugar levels and protect kidney functions.
 5. Sorakaya also has the ability to relieve body stress, and the power to cure liver problems.
 6. Sorakaya contains important components that are crucial for our muscle development, such as proteins, vitamins, amino acids, minerals, unsaturated fatty acids, etc.
 7. It helps us keep our bodies hydrated during summer.
 8. It improves digestion and energy absorption in the stomach.
 9. It burns cholesterol as it contains more water compared to other gourds.
 10. Sorakaya is good for skin health.

Types of curries with Sorakaya

సొరకాయతో చేసుకొని కొన్ని రకాల కూరలు
సొరకాయ తాలింపు (sorakaya thalimpu)
సొరకాయ బజ్జి (sorakaya bajji)
సొరకాయ పులుసు (sorakaya pulusu)
సొరకాయ పప్పు (sorakaya pappu)
సొరకాయ తీయకూర (sorakaya theyakura)
సొరకాయ రసం (sorakaya rasam)
సొరకాయ దోస (sorakaya dosa)
సొకాయ కుర్మా (sorakaya kurma)
సొరకాయ సాంబార్ (sorakaya sambar)
సొరకాయ పాలక్ (sorakaya palak)
సొరకాయ కీర్ (sorakaya keer)
సొరకాయ పచ్చడి (sorakaya pachadi)
సొరకాయ పకోడీ (sorakaya pakodi)
సొరకాయ పాయసం (sorakaya payasam)
సొరకాయ పాలు కూర (sorakaya pala kura)
సొరకాయ సూప్, (sorakaya soup)
సొరకాయ హల్వా, (sorakaya halwa)
సొరకాయ గోంగూర కర్రీ, (sorakaya gongura curry)
సొరకాయ గారెలు, (sorakaya garelu)
సొరకాయ రోటి (sorakaya roti)
సొరకాయ దప్పళం (sorakaya dappalam)
సొరకాయ దురుము (sorakaya dhurumu)
సొరకాయ అట్టు (sorakaya attu)
సొరకాయ బిర్యానీ (sorakaya biryani)
సొరకాయ ఎగ్గు కర్రీ (sorakaya egg curry)
సొరకాయ ఫిష్ కర్రీ (sorakaya fish curry)
సొరకాయ కొట్టు (sorakaya kuttu)
సొరకాయ మజ్జిగ పులుసు (sorakaya majjiga pulusu)

Benefits of Sorakaya in Telugu

 • సొరకాయ మన జీర్ణ క్రియకు అనుకూలించే పీచు పదార్థాన్ని కలిగి ఉంటుంది.
 • ఎవరైతే మలబద్దకంతో బాధపడుతూ ఉంటారు వారికి పీచు పదార్థం కలిగిన ఆహార పదార్థాలు చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి.
 • సొరకాయలో లవణాలు ఉండడం వలన మన గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.
 • సొరకాయకు మన శరీర బరువుని తగ్గించగలిగే శక్తి ఉంది.
 • సొరకాయను ఆహారంగా తీసుకున్న లేదా సొరకాయ నుంచి తయారు చేసిన జ్యూస్ ను శరీరానికి రాసిన చర్మ సౌందర్యం పెరుగుతుంది.
 • సొరకాయలో పొటాషియం మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి.
 • సొరకాయ జీర్ణశక్తిని మరియు ప్రేగులలో ఆహార సోషనను మెరుగుపరుస్తుంది.
 • నిద్రలేమితో బాధపడుతున్న వారికి సొరకాయ చాలావరకు ఉపశమనం కలిగిస్తుంది.
 • మన రక్తంలోని చక్కెర శాతాన్ని ఇది అదుపులో ఉంచుతుంది.
 • శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. వీటి అన్నిటితో పాటుగా సొరకాయలు మన కండరాల నిర్మాణానికి కావలసిన పోషక పదార్థాలు ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, అమినోయాసిడ్స్, అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ విరివిగాని లభిస్తాయి.

సొరకాయలు అధిక మోతాదులో నీటిని కలిగి ఉంటాయి. ఇది చూడటానికి వాటర్ బాటిల్ వలే ఉండడం వలన దీనిని బాటల్ గార్డ్ అని పిలుస్తారు. ఇది ఆకారంలో చాలా రకాల ఆకృతులను కలిగి ఉంటుంది. కొన్ని పొడవుగా ఉండి ఆకారంలో క్రింద నుంచి పై వరకు ఒకే రకమైన షేప్ ని కలిగి ఉంటాయి. మరికొన్ని క్రింద భాగంలో ఉబ్బుగాను పైకి వెళ్లే కొద్దీ సన్నగా ఉంటాయి. మరొక రకం సొరకాయలు క్రింది భాగము మరియు పై భాగము ఉబ్బుగా ఉండి మధ్యలో సన్నగా ఉంటాయి.

సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల దీని ద్వారా మనకు ఆరోగ్యపరమైన లాభాలు చాలా ఉన్నాయి అని పురాతన మరియు ఆధునిక కాలంలో అనేక ప్రయోగాల ద్వారా నిరుపించబడింది. ఈ సొరకాయకు మన శరీరానికి బరువును తగ్గించే లక్షణాలు ఉన్నందువలన, మరియు మన శరీరానికి కావలసిన పోషకాలు ఇందులో విరివిగా లభించుటవలన ఈ సొరకాయను హెల్తీగార్డ్ అని పిలుస్తారు. ఎవరైతే తమ రోజువారి ఆహారంలో క్యాలరీస్ మరియు కొవ్వు పదార్థాలను తక్కువగా ఉండాలనుకుంటారో వారు సొరకాయను తమ ముఖ్యమైన ఆహార వంటకంగా భావించడం చాలా ఉత్తమం. దీనిలో మనకు అవసరమైన రసాయన సమ్మేళనాలే అధికంగా లభించడమే కాకుండా అవసరం లేని కొన్ని మూలకాలు కూడా ఇతర కూరగాయలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో బీపీకి కారణమైన ఉప్పు శాతం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో అధిక మోతాదులో నీరు ఉండడం వలన ఇది మన శరీరాన్ని వేసవికాలంలో ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు లేకపోవడం వలన దీనిని ఆహారంగా తీసుకున్నప్పుడు మన శరీరానికి కావలసిన కొవ్వు పదార్థాలు మన ఆహారం ద్వారా అందకపోవడం వలన శరీరంలో ముందుగా నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలను మన శరీరం అవసర నిమిత్తం కరగదీస్తుంది.

వీటిని ఆహారంగా తీసుకునే ఆనవాయితీ ప్రాచీన కాలం నుంచి సాగుతూనే ఉంది. దీనిని పల్లెలలో చాలామంది వారి ఇంటి పక్కనే సాగు చేస్తారు. ఒక చెట్టుకు సుమారు 100 సొరకాయల వరకు దిగుబడి జరుగుతాయి. ఇవి అల్లుకునే మొక్కలు కనుక ఒక మొక్కకు కనీసం ఒక సెంటు స్థలం అవసరం అవుతుంది. వీటి జీవితకాలం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇవి పల్లెలలో అధికంగా లభించే ముఖ్యమైన కాయ కూర. పల్లెలలో కంటే పట్నంలో దీనికి ఎక్కువ గిరాకీ కలదు కారణం పల్లెలలో చాలా వరకు ఉచితంగా లభించే కాయగూర. పట్నంలో దీనిని మనం మార్కెట్ నుంచి పొందగలం. ఇవి బరువులో సుమారు ఒక కేజీ నుంచి 5 కేజీల బరువు వరకు పెరగగలవు.

అనేక ప్రయోగాల ద్వారా దీనికి టెన్షన్ తగ్గించే గుణం, శరీరంలో రక్త కణాలను పెంచే లక్షణం, శరీర బరువును గణనీయంగా తగ్గించే శక్తి, రక్తంలో చక్కెర సాతాన్ని అదుపులో ఉంచగలిగే సామర్థ్యం, శరీర ఒత్తిడి ని పోగొట్టగలిగే సత్తువ, కాలేయ సమస్యలను నయం చేయగలిగే బలం ఉన్నాయి అని నిరూపించబడింది.

కానీ దీనిని లేదా దీని రసాన్ని ఉడికించకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల విషపూరిత పదార్థాలు శరీరంలోకి చేరుతున్నాయని ఆధునిక ప్రయోగాల ద్వారా కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2015 లో జరిగిన ప్రయోగాల ద్వారా ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏమిటంటే…. సొరకాయను ఉడకబెట్టకుండా తయారుచేసిన దోసకాయ రసాన్ని తాగడం వలన అందులో ఉన్న cucurbitacins అనబడే విషపూరిత పదార్థం మన శరీరంలోకి చేరి చాలా రకాల రుగ్మతలకు కారణమవుతుందని తెలియజేశారు. సొరకాయ రసాన్ని ఆహారంగా తీసుకున్న కొంతమంది విపరీతమైన వాంతులకు గురయ్యారు అని, కడుపు నొప్పి బారిన పడ్డారు అని, మరియు స్పృహ లేకుండా మతిస్థిమితం కోల్పోయారు అని తెలియజేశారు.

మీరు ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదములు. ఇక్కడ ఇవ్వబడిన వివరణ ఒక అవగాహన కోసము మరియు శాస్త్రీయ సమాచార సేకరణ కోసము మాత్రమే. దయచేసి దీనిని ఆయుర్వేద పరంగా శరీర ప్రయోజనాల కోసం సేకరించే ముందు మీ యొక్క వైద్యుని సలహా పొందడం చాలా ఉత్తమం.

Beerakaya Benefits Guruvinda Ginja Facts
Nungu Health BenefitsInguva Uses
Anchovies means Bommidala Fish
Salmon Fish in TeluguBocha Fish Benefits
Flax Seeds UsesFoxtail Millets
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram