Home » General Topics » Thotakura in English | ఆరోగ్య ప్రయోజనాలు (Benefits)

Thotakura in English | ఆరోగ్య ప్రయోజనాలు (Benefits)

We all know that most of our food comes from plants. These foods provide all the nutrients our body needs. Even if we don’t eat meat, the food we get from trees is sufficient for the growth of all aspects of our body. Most of all, greens are the main plant-based source of all nutrients, and we also get all the essential metabolic components required for life from this leafy vegetable.

Thotakura in English

It has a high nutritional profile. Its scientific name is Amaranthus cruentus L. It is a plant belonging to the family Amaranthaceae. Thotakura is called Green Amaranth Leaves in English.

There are a total of 70 species of plants belonging to the Amaranthaceae family. Some of these are grown as vegetables, and others are used for front yard appeal. Some of these plants have leaves of different colors. In ancient times, these were deposited under weeds grown in commercial crop fields.

  1. It can be used as an astringent as it possesses betacyanins, saponins, and protoalkaloids.
  2. These leaves help to treat diarrhea, ulcers, and cases of pharyngitis.
  3. The juice made from these leaves can be used as a mouthwash to reduce the smell of the mouth and infections.
  4. There are several reports on these leaves stating that they have been used for excessive menstruation and skin problems such as acne and eczema.
  5. These leaves show hepatoprotective activity.
  6. Several studies have documented their antioxidant activity.
  7. Amaranth leaves contain phytochemicals that have anticancer activity, according to recent research.
  8. They are tested to have antihyperglycemic and hypolipidemic activity.
  9. The phytochemicals in the leaf extract of this plant exhibit anti-inflammatory activity.
  10. Rigorous microbial studies have stated that this plant contains antimicrobial and antiviral compounds.
thota kura english name

చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో

తోటకూర ఆస్టిన్ జెంట్ గా పనిచేస్తుంది. అంటే తోటకూర యొక్క రసాన్ని చర్మంపై తరచూ రాసుకున్నట్లయితే చర్మంపై ఉన్న ముడతలు తొలగిపోతాయి. తోటకూర కు ఆస్ట్రింజెంట్ లక్షణం ఉండడానికి గల కారణం ఇందులో అధిక మొత్తంలో శాపోనియన్స్, ప్రోటో ఆల్కలాయిడ్స్ మరియు బీటా సైనిన్స్ ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని పెంచి అనేక రకాల లోషన్ లేదా క్రీములలో తోటకూర నుంచి సేకరించిన రసాయనాలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

కాలేయ రక్షణకు

చాలా రకాల ఆకుకూరలు కాలేయాన్ని మరియు దాని యొక్క పనితీరును మెరుగుపరచుటలో సహాయపడతాయి. కాలేయ సంరక్షణకు ఆకుకూర యొక్క ప్రధాన పాత్రను వివిధ శాస్త్రీయ సంబంధిత ఆర్టికల్స్లలో మనము గుర్తించవచ్చు. ఈ ఆకులు మాత్రమే కాకుండా తోటకూర నుంచి వచ్చిన గింజలు కూడా కాలేయం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తోటకూర గింజలలో ఉండే ఆయిల్ మన శరీర వ్యాధి నిరోధక శక్తితో పాటు కణజాల అభివృద్ధికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. వీటి విత్తనాలలో ఉన్న ఆయిల్ కాలేయంలోని లిపిడ్ ప్రొఫైల్ ను సరిచేస్తుంది. మరియు కాలేయంలో ఏదైనా విషపూరిత పదార్థాలు నిల్వ ఉన్నట్లయితే వాటిని కాలేయం నుంచి తొలగిస్తుంది.

అదేవిధంగా కాలేయాన్ని నిర్మించి ఉన్న కణాల యొక్క జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా, కాలేయంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవల్స్ ను చాలావరకు ఇది తగ్గించగలుగుతుంది. ఈ ఆయిల్ లో ముఖ్యంగా స్క్వేలిన్ అనే రసాయన సమ్మేళనం కాలేయంలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీకి కారణం అవుతుంది. దీనివలన విషపూరిత మూలకాలైన ఫ్రీ రాడికల్స్ పూర్తిగా నశించిపోతాయి.

ఇందులో 25 రకాల ఫినాలే కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఆకుకూరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీని ఇస్తాయి. ఇప్పటివరకు ఎలుకపై జరిగిన పరిశోధనలలో, ఆకుకూర మొక్క యొక్క అన్ని భాగాలలో ఔషధాలు ఉన్నట్లు వెళ్ళడయ్యింది.

క్యాన్సర్ నివారణలో

తోటకూరలో లభించే రసాయన సమ్మేళనాలకు క్యాన్సర్ ను నిర్మూలించగలిగే శక్తి ఉందా లేదా తెలుసుకోవడానికి ఇప్పటివరకు అనేక రకాల ప్రయోగాలు జరిగాయి. దీనికోసం చాలా రకాల ఎలుకలను మరియు ఇతర జంతువులను ప్రయోగంలో ఉపయోగించారు. తోటకూర నుంచి తీసిన రసంలో క్యాన్సర్ను నిర్మూలించగలిగే రసాయన మూలకాలు ఉన్నాయని, అవి మొక్క యొక్క పెరుగుదలను బట్టి మార్పు చెందుతున్నాయని, తెలియజేశారు.

శరీర కొలెస్ట్రాలను తగ్గించుటలో

ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ప్రకారం ఆకుకూర శరీరంలోని కొలెస్ట్రాల్ను మరియు రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహంతో మరియు అధిక బరువుతో బాధపడేవారు తోటకూరను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రత్యేకమైన లాభాలను పొందవచ్చునని అనేక ప్రయోగ ఫలితాలు తెలుపుతున్నాయి.

కొందరు శాస్త్రవేత్తలు, ఒక వర్గాన్ని ఎంచుకొని వారిని తరచూ ఆకుకూరలు ముఖ్యంగా తోటకూరను తినమని సూచించిన కొన్ని రోజుల తర్వాత వారి పైన జరిగిన పరీక్షలలో కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు వెళ్ళడయ్యాయి. అవి ఏమిటంటే, తోటకూరను ఆహారంగా తీసుకున్న వారిలో శరీర బరువుని పెంచే ట్రై గ్లిజరైడ్స్ తోటకూరను ఆహారంగా తీసుకొని వారితో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని నిర్ధారించబడడం మరియు శరీర బరువును పోల్చినప్పుడు చాలా వ్యత్యాసం ఉండడం గమనార్హం.

జుట్టు పెరుగుదలకు

తోటకూర ముఖ్యమైన రసాయన సమ్మేళమైన టోకోఫెరాల్ కు మంచి మూలం. టోకో పెరాల్ జుట్టుని ఎండ నుంచి కాపాడడంలో చాలా ప్రాధాన్యత చూపుతుంది. ఈ మూలకం తోటకూరలో అధికంగా ఉండడం వలన, జుట్టును సంరక్షించి ఆయిల్ లలో తోటకూర యొక్క వాడకాన్ని మనం గమనించవచ్చు. మీరు గనుక ఆయుర్వేద ఔషధాలను మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి వాడుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఆ బాటిల్ పై అమరాంత్ ఎక్స్ట్రాక్ట్ అని గుర్తించగలరు. దీనికి సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తి ఉన్నందున మన జుట్టుకు కలిగే చుండ్రుని కూడా సులువుగా నిర్మూలించగలదు. తోటకూర యొక్క రసాన్నే కాకుండా ఇతర మొక్కల నుంచి తీసిన రసాయన సమ్మేళనాలు కూడా సమీక్షించి శిరోజాల మరియు చర్మపు సౌందర్యాన్ని మెరుగుపరుచుటకు తయారు చేసే ఔషధ పదార్థాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram

Instagram