ట్రై గ్లిజరైడ్స్ అనేవి ఒక రకమైన కొవ్వు పదార్థాలు. ఇవి మన రక్తంలో పసుపు రంగు వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండవలసిన మోతాదులో ఉండకుండా రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల అనారోగ్యాలకు దారితీస్తాయి. మనం ఎప్పుడైనా రక్త పరీక్ష చేసుకున్నప్పుడు వీటి యొక్క స్థాయి మనకు రిపోర్టులలో కనపడుతుంది. ఇవి ఎక్కువగా నూనె కలిగిన వస్తువులను లేదా అధికంగా మాంసం తినే వారిలో వీటి శరీర నిల్వలు ఎక్కువగా ఉంటాయి. . ఇవి రక్త కణాలలో చేరి రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఇవి శరీరంలో అధికమైనప్పుడు రక్తనాళాలలో అక్కడక్కడ పేరుకుపోవడం వలన హృదయ సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. కొంత వయసు దాటిన తరువాత ఇవి మన శరీరంలో ఎంత శాతం ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకోవడం తప్పనిసరి. తక్కువ వయసు వారి కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో ఇవి అధికమవుతాదులో నిల్వ చేయబడి ఉంటాయి.
హైపర్ ట్రైగ్లిజరిడెమియా అనేది ఒక విధమైన అనారోగ్యానికి కారణమయ్యే పరిస్థితి. హైపర్ ట్రైగ్లిజరిడెమియా అంటే రక్తంలో అధికమవుతాదులో ట్రై గ్లిజరైడ్స్ యొక్క స్థాయి అధిక మోతాదులో ఉందని.
సాధారణంగా ట్రై గ్లిజరైడ్స్ రక్తంలో అధిక మోతాదులో ఉన్నప్పుడు నిర్దిష్ట వ్యాధికి గురి అవుతామని నిర్దేశించలేము. వీటి ఫలితముగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా…కొరోనరీ ఆర్టరీ వ్యాధి (గుండె జబ్బు (CAD)), ఆర్టెరియోస్క్లెరోసిస్ (పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్), గుండెపోటు, కాలేయ సమస్యలు, మరియు పాంక్రియాటైటిస్ (క్లోమము వాపు లేదా క్లోమ క్రోధం).