కరాచీ హల్వా అనే స్వీట్ పేరుని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ హల్వా పాకిస్థాన్ దేశం లో కరాచీ అనే పట్టణానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన హల్వా. కరాచీ హల్వానే బొంబాయి హల్వా అని కూడా పిలుస్తారు.
స్వతంత్రం రాకమునుపు భారత్ పాకిస్థాన్లు కలిసే ఉండేవి. ఆ సమయంలో పాకిస్తాన్ దేశంలోని కరాచీ ప్రాంతంలో ఈ హల్వాని తయారు చేసుకునేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ హల్వా తయారీ దారుడు భారతదేశంలోని ముంబై ప్రాంతానికి వలస వచ్చాడు. అప్పట్నుంచి ఈ కరాచీ హల్వాని ముంబై హల్వా అని కూడా పిలవడం మొదలు పెట్టారు. ఆ విధంగా ఈ కరాచీ హల్వా కాస్త ముంబై హల్వా గా పేరుగాంచింది.
ఈ రోజు ఈ బ్లాగ్లో మనం కరాచీ హల్వా ఎలా తయారు చేయాలి. మరియు కరాచి హల్వా తయారీకి కావలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు (Ingridients for halwa recipe in Telugu)
కాన్ ఫ్లోర్( మొక్కజొన్నపిండి): 2 కప్పులు
పంచదార: 5 కప్పులు
నీళ్లు: 2 లీటర్
ఫుడ్ కలర్: 1/2 tsp edible food color.
జీడిపప్పు,పిస్త, బాదం: నేతితో వేయించి పలుకులు చేసుకున్నవి.
నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
Preparation of halwa recipe in Telugu
@ ముందుగా అర లీటర్ నీళ్లు తీసుకొని రెండు కప్పుల మొక్కజొన్న పిండికి కలిపి, పిండి బాగా పలచగా ఉండేలా చూసుకోవాలి.
@ తరువాత కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని ఈ మిశ్రమానికి కలిపి ఉండలు లేకుండా మిశ్రమంతో కలపాలి.
@ తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో మిగిలిన 1.5 లీటర్ నీళ్లు పోసి బాగా ఉడికించాలి.
@ ఇలా నీళ్లు బాగా మరిగాక ఇందులో పంచదార వేసి. పంచదార మొత్తం నీళ్లలో బాగా కరిగేలా కలియపెట్టుకోవాలి.
@ ఇలా పంచదార పాకం బాగా ఉడుకుతుండగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ముందుగా తయారుచేసి పెట్టుకున్న కాన్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో నెమ్మదిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
@ ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ ఉంటె మిశ్రమం బాగా దగ్గరపడి హల్వాలా తయారవుతుంది.
@ ఇలా తయారుచేసుకున్న హల్వా కి ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తాపప్పు, బాదంపప్పు పలుకులను ఈ మిశ్రమంలో చేసి బాగా కలపాలి.
@ ఇలా మిశ్రమం మొత్తం బాగా కలిపాక. ఈ మిశ్రమాన్ని ముందుగా ఆయిల్ తో గాని నెయ్యితో గాని అప్లై చేసిపెట్టుకున్న ఒక rectangular tray లోకి వేసి స్పాచులాతో ఎత్తుపల్లాలు లేకుండా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
@ ఇందులో మీకు కావాలనుకుంటే ఎండబెట్టి తొక్కు తీసిన పుచ్చ గింజలు గాని, దోసగింజల గాని గార్నిషింగ్ కోసం వేసుకోవచ్చు.
@ ఇలా కొంచెం హల్వా కొంచెం గట్టిపడ్డాక, మీకు నచ్చిన షేప్ లో Halwa ని కట్ చేసుకోవచ్చు.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
పిండిని నేరుగా మరిగే నీళ్లలో కలపడం ద్వారా ఉండలు కట్టే ప్రమాదం ఉంది. అందువల్ల పిండిని ముందుగా నీళ్లతో బాగా పలుచగా కలుపుకొని తరువాత ఈ పిండి మిశ్రమాన్ని వేడి నీళ్లలో పోయడం ద్వారా ఉండలు కట్టకుండా ఉంటుంది.
హల్వా బాగా చీవిగా తినాలి అనుకునేవారు హల్వాని మరికొంచెం సేపు స్టవ్ మీద ఉంచి దానిలో ఉన్న తేమశాతం తగ్గేలా కొంచెం కొంచెం నెయ్యి ఆడ్ చేస్తూ గట్టిపడేలా ఉడికించుకోవాలి.
అంతేనండి ఎంతో రుచికరమైన కరాచి హల్వా తయారీ విధానం గురించి ఈ పోస్ట్ లో చూశాము కదా. మీరు కూడా ఒక సారి ఈ హల్వా నీ ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.