మునగాకు గురించి మన భారతదేశంలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మునగ ఆకుల లో విటమిన్ A మరియు C లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కావున కంటి సమస్యలు మరియు విటమిన్ C డెఫిషియన్సీ ఉన్నవారు తమ రోజువారి ఆహారంలో మునగాకును తీసుకోవడం ద్వారా పై సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
మునగాకును మరియు మునక్కాయలను మనం నిత్యం అనేక కూరలలో ఉపయోగిస్తూనే ఉంటాము. మునక్కాయలను ఉపయోగించి సాంబారు, పులుసు, వేపుడు, ఊరగాయ అనే అనేకరకాల కూరలను, పచ్చళ్ళును మనం నిత్యం ఇంట్లో తయారు చేస్తూనే ఉంటాము. అంత రుచిగా ఉంటుంది మునక్కాయ. సాంబార్లో కనుక ఒక మునక్కాయని ముక్కలుగా చేసి వేస్తే …. ఉంటుంది చూడండి అబ్బా..! ఆ రుచే వేరు …అంత పేరుంది మునక్కాయ కి మన తెలుగు ఇండ్లలో.
సినిమాలలో మరియు సీరియల్స్ లో కూడా ఎక్కువగా హీరోయిన్లు హీరోలకి మునక్కాయ తో చేసిన కూరనే వడ్డిస్తూ ఉంటారు. ఈ రోజు ఈ పోస్ట్ లో మనం మునక్కాయ ఆకు అనగా మునగ చెట్టు ఆకు (మునగాకు) దాని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషద గుణాలు గురించి తెలుసుకుందాం.
Munagaku Uses or Benefits (మునగాకు ఔషద గుణాలు):

1. లైంగిక సమస్యలకు: మునగాకు మగవారిలో సంతాన సమృద్ధిని పెంచే పోషక విలువలు అధికంగా ఉండటం వలన లైంగిక సమస్యలతో బాధపడేవారు మునగాకును ఉపయోగించి మంచి ఫలితం పొందవచ్చు.
మునగాకు పువ్వులను పాలలో కలిపి మరిగించి తాగడం వల్ల పురుషులలో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది.
2. సంతానలేమికి: మునగాకులో Aphrodisiac అనే పదార్థం మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ ని పెంచడం ద్వారా శుక్రకణాల సంఖ్య పెరుగుతుంది . తద్వారా మగవారిలో లైంగిక సామర్థ్యం పెరిగి సంతానలేమికి కారణమగు సమస్యలు తగ్గుతాయా.
3. వ్యాధులకు ఔషధంగా: అలాగే క్యాల్షియం, ఐరన్ లు కూడా మునగాకులో పుష్కలంగా లభిస్తాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు మునగ ఆకును, కాయలను అనేక రకాల ఆహార పదర్ధాలలో మరియు వ్యాధులకు ఔషధంగా కూడా ఉపయోగించారు, ఇంకా కూడా మనం ఉపయోగిస్తూనే ఉన్నాము.
దాదాపు 400 కు పైగా వ్యాధులను నయం చేసే శక్తి మన మునగాకు ఉందంటే నిజంగా ఆశ్చర్యపడే విషయమే.
మునగాకులో మనకు అనేక Vitamins and Minerals పుష్కలంగా లభిస్తాయి. మనము మార్కెట్లో కొనుక్కునే ఆకుకూరల కంటే కూడా మునగాకులో మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
4. కళ్ళ సమస్యలకు: క్యారెట్ లో మనకు లభించే విటమిన్ A కంటే 10 రెట్లు విటమిన్ A మనకు మునగాకు లో లభిస్తుంది. కావున కళ్ళ సమస్యలతో బాధపడేవారు Munagaku ను తరచూ తమ ఆహారంలో తీసుకోవడం మంచిది.
5. కీళ్ల సమస్యలకు: అంతేకాకుండా పాల నుంచి మనకు లభించే కాల్షియం కన్నా 18 రెట్లు అధికంగా కాల్షియం మునగాకు నుంచి మనకు లభిస్తుంది. అందువల్ల కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఆర్థరైటిస్ సమస్యలు ఉన్నవారు మునగాకును తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
అరటి పండు నుంచి మనకు లభించే పొటాషియం కన్నా 14 రెట్లు అధికంగా పొటాషియం మనకు మునగాకు నుంచి లభిస్తుంది.
6. మధుమేహానికి: మధుమేహ వ్యాధితో బాధ పడేవారు Munagaku ను ఎండబెట్టి పొడిలా తయారు చేసుకొని రోజుకి ఏడు గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే మునగాకు లో ఉండే Chlorogenic acid బ్లడ్ లో సుగర్ లెవెల్స్ ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
7. థైరాయిడ్, Pcod, Pcos కి: అంతేకాకుండా హార్మోన్ సంబంధిత వ్యాధులైన థైరాయిడ్, Pcod, Pcos కి కూడా మునగాకు చాలా చక్కగా పనిచేస్తుంది.
8. ఎముకలకి: Munagaku ను బాగా ఉడికించి విటమిన్ C మరియు కాల్షియం డెఫిషియెన్సీ ఉన్న పిల్లలకి ఆహారంగా పెట్టడం ద్వారా వారిలో కాల్షియం లెవెల్స్ ను పెంచి ఎముకలు గట్టిపడేలా చేస్తుంది.
మునగాకు కొద్దిగా వేడి చేసి దానిని పల్చని గుడ్డ లో పరచి నొప్పులు, బెణుకులు ఉన్నచోట కట్టుగా కట్టినచో నొప్పులు హరించును.
9. తల్లులలో పాల ఉత్పత్తికి: అంతేకాకుండా పాలిచ్చే తల్లులకు మరియు గర్భిణీలకు Munagaku పెట్టడం ద్వారా గర్భిణీలలో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే అనేక పోషక విలువలు అందించడమే కాకుండా తల్లులలో పాల ఉత్పత్తికి కూడా ఈ మునగాకు తోడ్పడుతుంది.
10. అజీర్తికి: మునగాకు పువ్వులను మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బసం, అజీర్తి వంటి వాటికి మందుగా పనిచేస్తుంది.
11. జ్ఞాపక శక్తికి: మునగాకు రసానికి కొంచెం తేనె కలిపి తీసుకోవడం వల్ల కంటి సంబంధిత వ్యాధులు అయినా రేచీకటి, కళ్ళు మంటలు, కళ్ళు వాపు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా మెరుగు పరచును.
12. గజ్జి, తామర మొదలగు చర్మ వ్యాధులకు: మునగాకు గుజ్జును నువ్వులనూనెతో కలిపి, ఈ గుజ్జును నీరు ఆవిరి అయ్యేలా మరిగించి లేహ్యంగా తయారుచేసి గజ్జి, తామర మొదలగు చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ లేహ్యాన్ని పై పూత మందుగా ఉపయోగించవచ్చు.
13. మొటిమలకు: మునగాకు రసానికి కొంచెం మిరియాల పొడిని కలిపి మొటిమలు ఉన్నచోట రాస్తే క్రమంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.