హాయ్ ఫ్రెండ్స్ ఈ blog లో మనం ఆంధ్ర స్పెషల్ అయిన అమ్మమ్మల కాలంనాటి ఆవకాయ పచ్చడి (Mamidikaya pachadi) ఎలా చేయాలో చూద్దాం. ఆవకాయ అంటే నోరూరని వారంటూ ఎవ్వరూ ఉండరు, ఆవకాయ తెలుగువారికి ఇష్టమైన ఆహార పదార్ధం. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఆవకాయ కలుపుకొని తింటే … ఉంటుంది చూడండి అబ్బా….. ! ఆ మజాయే వేరు.
పెళ్లి భోజనాలు, వింధులు, ఫంక్షన్ ఏదైనా సరే మంచి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు భోజనాలలో మన ఆవకాయ ఉండి తీరాల్సిందే. అంత డిమాండ్ ఉంది మన ఆవకాయకి. ఇంకా చెప్పాలంటే ఆవకాయ పేరుతో మన టాలీవుడ్ లో కొన్ని తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అవి కమల్ కామరాజు మరియు బిందు మాధవి నటించిన ఆవకాయ బిర్యాని, ఇంకా స్నేహ మరియు ప్రకాష్ రాజ్ నటించిన ముద్ద పప్పు ఆవకాయ. ఇంకా నువ్వే.. నువ్వే… సినిమా లోని తరుణ్ ఫేమస్ డైలాగ్ అయినా అమ్మ, ఆవకాయ, అంజలీ ఎప్పుడు బోర్ కొట్టదు… అనే ఫేమస్ డైలాగ్స్ కూడా ఆవకాయ పేరుతో ఉన్నాయి. ఇంత గొప్ప పేరు ఉంది మన ఆవకాయకి.
ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం……………………….
Ingredients for Mamidikaya pachadi (Avakaya Pachadi):
మామిడికాయ టెంక ముక్కలు : 2 కేజీలు
ఎర్ర కారప్పొడి :300 గ్రా
ఆవపిండి. :200 గ్రా
ఉప్పు. : 500 గ్రా
తొక్క తీస్కున వెల్లులి రెబ్బలు. :2 పెద్ద వెళ్లులి
వంట నూనె. : 800 గ్రా
Buy Masala Powder for Mango Pickel Preparation on Amazon
Preparation of Avakaya Pachadi in Telugu step by step
1. మామిడికాయ ఊరగాయ లేదా ఆవకాయ బాగా రావాలంటే ముందుగా దీనికోసం మంచి మామిడికాయలను ఎంచుకోవాలి.
2. ఎక్కువ పుల్లగా ఉన్న మామిడికాయలను ఎంచుకోవడం ఇంకా మంచిది. మనకు మార్కెట్లో ఊరగాయ పెట్టుకోవడానికి చాలా రకాల మామిడి కాయలు దొరుకుతాయి. ఈ మామిడికాయలు మీడియం సైజు అయ్యి ఉండాలి.
3. Kottapalli kobbari mamidikaya పచ్చడి పెట్టుకోవడానికి అనువైన మామిడికాయ. ముందుగా మామిడి కాయల్ని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి, ఆరబెట్టుకున్న తర్వాత ప్రతి మామిడికాయను తీసుకొని చెమ్మ లేకుండా శుభ్రమైన గుడ్డ తో తుడుచుకోవాలి.
4. ఇలా శుభ్రం చేసుకున్న మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని అందులోని మామిడికాయ జీడిని శుభ్రంగా తీసివేయాలి, మామిడికాయ ముక్కలు కొట్టేటప్పుడు టెంక మామిడికాయ నుండి విడిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలి.
5. ఇలా మామిడికాయ టెంక తో పాటు కొట్టడం వల్ల ఆవకాయ ఊరే కొది ముక్కుకి ఉన్న టెంక ముక్కను నూనెలో కరిగిపోనీ కుండా పట్టి ఉంచుతుంది.
6. ఇలా ముక్కలుగా కొట్టుకున్న మామిడికాయలను శుభ్రమైన బట్టతో మట్టి ,చెత్త, చెమ్మా ఇలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకొని మామిడికాయ ముక్కలను ఆవకాయ కలుపుకోవడానికి అనుకూలంగా ఉండే ఒక వెడల్పాటి పాత్రలో వేసి ఇందులో ముందుగా కారం, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి.
7. చివరగా కాచీ చల్లార్చు కున్నా లేదా పచ్చి వంట నూనె తీసుకొని మొత్తం నూనె వేసెయ్యకుండా కొంచెం కొంచెంగా నూనెను కలుపుతూ ముక్కలుఅన్నీ బాగా తడిచేలా నూనె పట్టించుకోవాలి. మిగిలిన నూనెను కూడా ఇందులో వేసి ఆవకాయ పొడి పొడిగా ఉండేలా చూస్కోవలి. అవసరమైతే ఒక టీ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవచ్చు .
8. ఆవకాయ పచ్చడి ని శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో ఆరబెట్టిన జాడీ కానీ గాజు సీసా కానీ తీసుకొని అందులో ఉంచి భద్రపరుచుకోవాలి.
Mango pachad ని నిల్వ ఉంచుటకు కొన్ని సలహాలు
Avakaya Pachadi తయారీలో ఉపయోగించే గరిటెలు కానీ గిన్నెలు కానీ లేదా చేతితో కలిపేటప్పుడు చేతులకు కానీ ఎటువంటి తడి లేదా నీళ్ళ చెమ్మ లేకుండా చుస్కోవలి, ఆవకాయ కి నీటి చెమ్మ తగిలినట్లు అయితే ఆవకాయ కి బూజు పట్టి చెడిపోయే అవకాశం ఉంది. కావున ఆవకాయ తయారు చేసేటప్పుడు తడి చెమ్మా తగలకుండా చూసుకోవాలి. ఇలా పైన చెప్పిన కొలతలు లో ఆవకాయను తయారు చేయడం వల్ల ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది.
ఇలా తయారుచేసుకున్న ఆవకాయని గాజుసీసాలో గాని జాడీలో గాని భద్రపరిచి మూడు రోజులు దీనిని పక్కన పెట్టుకోవాలి. నాలుగవ రోజు నూనె పైకి వచ్చి ముక్కలు కింద కి పోయి ఉంటుంది.ఇలా ఉన్న జాడీ లోని ఆవకాయని తీసుకొని దానిని ఎండలో ఆరబెట్టిన చమ్మ లేని శుభ్రమైన గిన్నెలోకి వేసి నూనె అంతా ముక్కలకు బాగా పట్టేలా తిరగ కలుపుకోవాలి. ఆవకాయ జాడీ చుట్టూ అంటుక్కున ఆవకాయని టిష్యూ తో గానీ లేదా ఒక శుభ్రమైన గుడ్డతో కానీ తుడిచి మళ్లీ జాడీలో పెట్టుకోవాలి.
ఇలా నాల్గవరోజు Avakaya Pachadi తీసి తిరగ కలపడం ద్వారా ఆవకాయ కి ఉప్పు, కారం ,నూనె సరిపోయాయా లేదా అని సరి చూసుకోవచ్చు .ఒకవేళ ఉప్పు కారం తగ్గినట్లయితే, రుచికి సరిపడా తగినంత ఉప్పు కారం కలుపుకొవచ్చు. ఇలా తయారుచేసుకున్న ఆవకాయని ఎండ తగలని ప్రాంతంలో నిల్వ ఉంచి సంవత్సరం పొడవునా ఉపయోగించుకోవచ్చు. నేను పైన చెప్పిన కొలతల తో ఆవకాయ తయారు చేసుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ మీరు ఉప్పు కారం కలిపే అవకాశం ఉండదు.
Buy Tasty Andhra Mango Pickel Online
Mamidikaya pachadi ఎక్కువ కాలం నిల్వ ఉంచుటకు చిట్కాల (Tips):
మన అందరికీ తెలిసినట్టుగా ఆవకాయ చెడిపోవడానికి లేదా బూజు పట్టడానికి కారణం గాలిలోని సూక్ష్మజీవులు.
ఆవకాయను తయారు చేయుటకు ఉపయోగించే పదార్థాలలో సూక్ష్మజీవుల నిర్మూలన శక్తి కలిగి ఉన్నా పదార్థాలు అయిన పసుపు, ఉప్పు, నూనె వల్ల మామూలుగా ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనితో పాటుగా మరికొన్ని రోజులు ఆవకాయ ను నిల్వ చేసుకోవడానికి మనము ఈ మూడు పదార్థాలలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఇంకొన్ని రోజులు ఆవకాయను చెడిపోకుండా కాపాడవచ్చు.
1. పసుపు ఒక యాంటీబయాటిక్ దీనిని చాలా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.
మనము తగిన మోతాదులో ఈ పసుపును ఆవకాయ తయారీలో ఉపయోగించినట్లయితే ఆవకాయను ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.
2. మనం Mamidikaya pachadi తయారీలో ఎక్కువగా రుచి కోసం పచ్చి నూనెను ఉపయోగిస్తాం, కానీ ఈ పచ్చి నూనెను వేడి చేయకుండా వాడడం వల్ల అందులో ఉన్న కొన్ని సూక్ష్మ జీవులు ఆవకాయలో బూజును ఉత్పత్తి చేస్తాయి. ఇలా బూజుపట్టిన ఊరగాయను మనం పడక వేయక తప్పదు. అందుకని వేడిచేసిన నూనెను ఆవకాయ తయారీలో ఉపయోగిస్తే చాలా వరకు ఆవకాయ చెడిపోకుండా కాపాడవచ్చు. నూనెను తగిన మోతాదులో ఉపయోగించడం వల్ల, అంటే… ఆవకాయ మునిగేటట్లుగా పోయడం వల్ల ఆవకాయ లోపల ఉన్న ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. గాలిలోని ఆక్సిజన్ ఆవకాయలోకి చొరబడి నట్లయితే ఆక్సిజన్ ఉపయోగించి బ్రతికే సూక్ష్మజీవులు ఆవకాయను చెడి పోయేటట్లు చేస్తాయి. అందుకని కాచిన నూనెను ఆవకాయ మునిగే టట్లు పోయడం వల్ల పర్యావరణంలోని సూక్ష్మజీవులను మరియు వాటి పెరుగుదలకు కావాల్సిన ఆక్సిజన్ ను ఆవకాయ లోకి చొరబడనీయకుండా చేయవచ్చు.
3. మూడవది ఉప్పు, తగిన మోతాదులో ఉప్పును Mamidikaya pachadi లో కలపడం వల్ల ముక్కలని బాగా ఉరపెట్టడమే కాకుండా అందులో ఉన్న సూక్ష్మజీవులను మరియు వాటి పెరుగుదలకు కావాల్సిన నీటి శాతాన్ని తగ్గించవచ్చు. మామూలుగా ఉప్పుకు తేమను పీల్చే శక్తి ఎక్కువగా ఉంటుంది, ఇందువల్ల చెడు సూక్ష్మజీవులు అయినా బ్యాక్టీరియా మరియు ఫంగైలలో ఉన్న తేమ తగ్గిపోయి అవి క్రమేణా నశించిపోతాయి.