కొన్ని వందల సంవత్సరాల నుంచి అవిస గింజలని మన పూర్వీకులు విరివిగా ఉపయోగిస్తున్నారు. అవిస గింజలుని సూపర్ ఫుడ్ గా కూడా చాలా మంది శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈరోజుల్లో కూడా అవిసె గింజలని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Avise ginjalu in English: = Flax seeds
Avise plant scientific name: Linum usitatissimum
Avise ginjalu uses in Telugu
ఇప్పుడు మనం అవిసగింజల యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
1. అవిస గింజలలో న్యూట్రియన్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి.
2. ప్రాచీన యుగం నుంచి ఆధునిక యుగం వరకు అవిసగింజల యొక్క ప్రయోజనాలను మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అవిస పంట చాలా పురాతన కాలమైనా పంట, అవిస గింజలు మనకు రెండు రకాలుగా,
(గోల్డెన్ మరియు బ్రౌన్ రంగులలో) మనకు లభిస్తున్నాయి. రెండూ కూడా ఎక్కువ ఆరోగ్యకరమైనవే.

3. ఒక టేబుల్ స్పూన్ లో సుమారు ఏడు గ్రాముల అవిస గింజలు లభిస్తాయి. ఒక్క టేబుల్ స్పూన్ అవిసగింజలలో మన శరీరానికి కావలసినంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైటరీ ఫైబర్స్, ఇంకా విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.
4. అవిస గింజలలో జీర్ణానికి అవసరమయ్యే తగినంత పీచు పదార్థం కలిగి ఉండడం వలన వీటిని ఎక్కువగా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు తీసుకుంటారు.
5. అవిసె గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో కొవ్వును తగ్గించుకుని, స్థూలకాయం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
6. అవిసె గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. అవిస గింజలను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేయవచ్చు.
7. అవిస గింజలు ఎక్కువ స్థాయిలలో ప్రోటీన్ నిల్వలు కలిగి ఉన్నందున. ప్రోటీన్ లోపం ఉన్నవారు అవిసగింజలని వారి ఆహారంలో స్వీకరించవచ్చు.
8. అవిస గింజలు ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు తద్వారా తక్కువ ఆహారం తినడం వలన ఎక్కువ బరువు పెరగకుండా అదుపులో పెట్టుకోవచ్చు.
9. అవిసె గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు అవిసె గింజల్ని తీసుకోవడం ద్వారా కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.
10. అవిసె గింజల నుంచి తీసిన నూనెను అనేక రకాల ఆహార పదార్థాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.
11. అవిసె గింజల నూనెను, పెరుగుతో కలిపి తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
12. అవిస గింజల నూనె తో బ్రెడ్ టోస్ట్ చేసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకొని శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
13. అవిస గింజల నూనెను రోజు మనం తాగే నీటిలో కలుపుకొని సేవించడంద్వారా అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.
14. అవిసె గింజల నూనెను ఆలివ్ ఆయిల్ బదులుగా సలాడ్ లో కూడా ఉపయోగించుకోవచ్చు.
15. అవిసె గింజల నూనెను వంటనూనె బదులుగా మనం రోజూ తినే ఆహార పదార్థాలలో మరియు వంటలలో కూడా ఉపయోగించుకోవచ్చు.