Home » Education » Telugu Words » Ulavalu in English (ఉలవలు)

Ulavalu in English (ఉలవలు)

ఉలవల గురించి మన భారతదేశంలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఉలవలు నవధాన్యాలలో ఒకటి.

క్రమం తప్పకుండా ఉలవలు తీసుకున్న వారి ఆరోగ్యం గుర్రంలా పరుగు తీస్తుంది అన్న నానుడి కూడా ఉంది.

మనకు కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు గురించి తెలిసినంత బాగా ఈ విలువల గురించి వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు.

Ulavalu in English with different names

Ulavalu ని English లో Horse gram, kulthi bean, kulthi horse, madras gram, and hurali అని పిలుస్తారు.

ఈ ఉలువలనే గుర్రాలకి మరియు పశువులకు దాణాగా ఉపయోగిస్తారు .అందువల్ల ఇవి గుర్రాలకి పెట్టే ఆహారంగా కూడా బాగా ప్రసిద్ధిగాంచాయి. అందువలన వీటిని ఇంగ్లీషులో “హార్స్ గ్రామ్” అని పిలుస్తారు.

ఉలవలని రకరకాల ప్రాంతాల్లో వివిధ పేర్లతో  పిలుస్తున్నారు.

 

Ulavalu in Telugu and benefits
Figure: Ulavalu in English Names

వివిధ ప్రాంతాలలో ఉలవలకు గల పేర్లు

1. తెలుగు – ఉలవలు (Horse gram in Telugu ulavalu)

2. తమిళం – కొల్లు  (in Tamil kollu)

3. తులు – కుడు (in Tulu – kudu)

4. నేపాలి – గహాట్ (Nepali – gahat)

5. హిందీ – కుల్తి/హల్తి (in Hindi – kulthi/halthi)

6. కొంకణి – కుల్తి (in Konkani – kulthi)

7. కన్నడ – హురులే (in Kannada – hurule)

8. ఒడియా – కొలుత (in Odia – kolutha)

9. గుజరాతీ కులుతా (in Gujarati – kulutha)

10. బెంగాలి కుల్తి (in Bengali – kulthi)

ఉలవలను మన భారతీయులు మన పూర్వీకులు కూడా బాగా వినియోగించారు అందువల్లే వీటిని అతి ప్రాచీనమైన పంటగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఉలవలు రకరకాల రంగులలో మనకు లభిస్తాయి.అవి ముదురు ఎరుపు, నలుపు,తెలుపు రంగులలో ఉండి గుండ్రంగా మిన మిన మెరుస్తూ ఉంటాయి.

ఉలవలుమంచి ప్రోటీన్ మరియు శక్తి కలిగి ఉండటం వల్ల వీటిని గుర్రాలకి ,ముఖ్యంగా గుర్రపు పందేములో ఉపయోగించే గుర్రాలకు దానా గా వేస్తారు.
ఉలవలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి తరచూ ఉలవలని ఆహారంలో తీసుకోవడం ద్వారా మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది.

అంతే కాకుండా ఉలవలలో మనకు ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ ఫైబర్, కూడా విరివిగా లభిస్తాయి.

Ulavalu benefits in Telugu

1. మధుమేహనికి: ఉలవలులో ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. తద్వారా మధుమేహ వ్యాధిని రాకుండా చేస్తుంది.

2. ఇర్రెగ్యులర్పీరియడ్స్ కి: ఈ ఉలవలు మలబద్ధకానికి మరియు స్త్రీలలో నెలసరి సమస్యలు అయిన పిసిఓడి, పిసిఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి, కూడా బాగా పనిచేస్తాయి.

3. వ్యాధులను నివారిచడంలో: ఉలవలను కడుపులోని అల్సర్లుకు, మూత్రాశయంలో మంట తగ్గడానికి, ఆకలిని పెంచుటకు, కాలేయ వ్యాధులను నివారిచడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తయి.

అంతేకాకుండా ఉలవలుతో మంచి రుచికరమైన ఉలవచారు మరియు మసాలా వడలు కూడా తయారు చేసుకోవచ్చు.

4. కిడ్నీలో రాళ్లు కరిగించడంలో: ముల్లంగి రసానికి కొద్దిగా ఉలవలు రసం కలిపి క్రమంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి.

5. కొవ్వును తగ్గించడంలో: ఉలవలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడమే కాకుండా ఊబకాయం బారిన పడకుండా చేస్తుంది.

6. నొప్పితగ్గించడంలో: ఉలవలును కొద్దిగా పెనుం పై వేసి వేయించి ఒక మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో పెట్టినచో నొప్పి నుంచి ఉపశమనం కలుగును.

7. ఋతుక్రమ సమస్యలకు: ఒక గ్లాసు ఉలవలకు నాలుగు గ్లాసుల నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టి పొద్దున వాటిని కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ అచిన తర్వాత ఏర్పడ్డ ఉలవ కట్టుకి కొంచెం ఉప్పు కలిపి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సన్నబడడమే కాకుండా, స్త్రీలలో తలెత్తే ఋతుక్రమ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

8. మైలుని తొలగించడంలో: కాన్పు అయిన మహిళలకు ఉలవలు కట్టు ఇవ్వడం ద్వారా కాన్పు తర్వాత కడుపులో మిగిలిపోయిన మైలుని కూడా తొలగిస్తుంది.

9. బోదకాలుకి: కొంచెం ఉలవ పిండికి పుట్టమట్టిని మరియు కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి బోదకాలు మీద లేపనం లా వేయడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది.

10. లైంగిక సమస్యలకు: లైంగిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉలవల పిండిని బియ్యం పిండిని కలిపి జవలా చేసుకుని పాలతో కలిపి కొన్ని వారాలపాటు సేవించడం ద్వారా క్రమంగా లైంగిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

 

Read More Topics In Telugu

Avise ginjalu in English (అవిసె గింజలు)

Telu in English word (తేలు)

Borugulu in English (బొరుగులు)

Endrakaya in English (ఎండ్రకాయ)

Uyyala in English (ఉయ్యల)

Sanagalu in English (శనగలు)

Guraka in English (గురక)

Opika in English (ఓపిక)

Daniyalu in English (ధనియాలు)

 

Photo of author

Supraja

Hi Friends, thank you for visiting my blog. My name is Supraja, a self-motivated person. I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Recommended For You

Leave a Comment