అంకోవి అనేది ఒక చిన్న చేప. ఇది సాధారణంగా అన్నిటికంటే చిన్నదిగా ఉండి చాలా రుచికరమైన మాంసాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణ మేతను తీసుకుంటుంది. ఇవి మంచినీటిలోనూ మరియు ఉప్పునీటిలోనూ జీవించగలవు. మంచినీటి ఆంకోవీలు చాలావరకు ఉప్పును తక్కువగా కలిగి ఉంటాయి. ఈ చేపలను పట్టిన వెంటనే తినవచ్చును లేదా కొన్ని ప్రాంతాలలో వీటిని బాగా ఎండలో ఎండబెట్టి నిల్వ ఉంచి కావలసినప్పుడు వాటిని కొంతసేపు నీటిలో నానబెట్టి కావలసిన వంటలను చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మంచినీటి ఆంకోవీలతో పోలిస్తే ఉప్పు నీటిలో దొరికే ఆంకోవీలు ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. దీనికి కారణం ఉప్పు నీటిలో జీవించిన ఆంకోవీలు వాటి మాంసంలో ఉప్పు కలిగి ఉండడం. ఇవి మన భారతదేశంతో పాటు ఇతర దేశాలలోనూ పుష్కలంగా దొరుకుతాయి.
Anchovies in Telugu Language
వీటిని ఆంగ్లంలో ఆంకోవీలు అని తెలుగులో మెత్తళ్లు (Methallu) లేదా నెత్తల్లు (Nethallu) అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ చేపలను మన తెలుగు భాషలో ఇంగువ (Inguva) చేప లేదా పోరవళ్ళు అని పిలుస్తారు.
వీటిని మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలోనూ చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా రోజులు నిల్వ చేసుకోవడానికి అనుకూలంగా ఉండటం వలన ఇవి మార్కెట్లో మనకు అన్ని రకాల సీజన్లలో తక్కువ ధరలో లభిస్తాయి.
ఇవి ఆరోగ్యానికి మంచి పోషకాలను అందిస్తాయి. వీటిలో మనకు కావాల్సిన అన్ని రకాల లవణాలు, ప్రోటీన్లు, మరియు విటమిన్లు అధికంగా దొరుకుతాయి. కానీ కొంతమందిలో ఇవి అలర్జీని కూడా కలిగిస్తాయి. మన ఆంధ్రప్రదేలో నెత్తల్లు పులుసు ముఖ్యంగా పల్లెలలో చాలా ఇష్టకరమైన వంటకం.
వీటిని తాజాగా పట్టి వెంటనే కూడా పులుసుకు ఉపయోగిస్తారు. కానీ ఉప్పునీటిలో దొరికే వాటిలో ఉప్పు అధికంగా ఉండటం వలన చాలామంది మంచినీటిలో దొరికే వాటిపై ఎక్కువగా ప్రాధాన్యత చూపుతారు. వీటితో చేసిన పులుసు ముఖ్యంగా అప్పుడే పట్టిన వాటిని చేప పులుసు కనుక పెడితే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. వీటికి శరీరంలో చాలా చిన్న ముళ్ళు ఉండడం వలన, వీటికి ముళ్ళు తీసే అవసరం ఉండదు.
దీనిని పల్లెలలో చిన్న చేపల పులుసు, లేదా మెత్తళ్ల పులుసు లేదా ఎండు చేపల రసం లేదా మెత్తల రసం అని పిలుస్తారు. ఇలా చేసుకున్న వంటకాన్ని ఎక్కువగా రాగి సంగటిలో తినుటకు చాలామంది పెద్దవారు ఇష్టపడతారు. పూర్వకాలంలో ఈ పులుసును పడిశముకు మందుగా భావిస్తారు. జలుబు లేదా పడిశం వచ్చినప్పుడు పెద్దవారు దీనిని చేసుకుని అమృతంగా భావించి భుజిస్తారు.
Anchovies uses in Telugu
వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ బాగానే లభిస్తాయి. వీటిని ఆహారంగా తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని కొవ్వు శాతాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. వీటిలో పుష్కలంగా మన శరీరానికి కావలసిన విటమిన్లు కూడా లభిస్తాయి. మన రక్త కణాల వృత్తికి ఉపయోగపడే ఐరన్ కూడా ఈ చేపల ద్వారా లభిస్తుందని చాలా రకాల ప్రయోగాలలో తేలింది. కొంతమందిలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయని మరియు కండరాల వృద్ధిని కూడా మెరుగుపరుస్తాయని కొన్ని పరిశోధనలు విసదీకరించాయి. మన శరీరంలో మనకు అవసరం లేని మరియు శరీరానికి హాని కలిగించే ట్రై గ్లిజరైడ్స్ నిల్వలను అదుపులో ఉంచుతాయి. వీటి స్థాయిలు మన రక్తంలో తక్కువగా ఉండటం వలన మనకు రక్తపోటు అనేది దూరంగా ఉంటుంది.
ఎవరైనా బరువు తగ్గాలనుకున్నవారు వీటితో తయారు చేసుకున్న పులుసును లేదా రసాన్ని తరచూ తీసుకుంటే వారి శరీర బరువును తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. వీటిలో ఉన్న పోషకాలు మన గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుటలో ప్రాధాన్యత చూపుతాయి. సముద్రంలో దొరికి ఈ నెత్తల్లులో కొన్ని రకాలు మాత్రం అధికంగా సోడియం కలిగి ఉండడం వలన కొంతమందిలో రక్త పోటుకి కూడా దారితీస్తాయి. అలర్జీ ఉన్నవారు ఈ చేపలను ఆహారంగా తీసుకొనుటకు నిరాకరిస్తారు. ఇందుకు కారణం సముద్రంలో దొరికే ఈ చిన్న చేపలు కొన్ని రకాల హానికరమైన అలర్జీ ని ప్రేరేపించే స్థాయిలో ఉండడం వలన.
యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలైన సెలీనియం మరియు విటమిన్సీలు ఈ నెత్తలలో అధికంగా లభిస్తాయి. ఈ ఆంటీ ఆసిడ్స్ అధికంగా ఉండుటవలన హానికర పదార్థాల వల్ల మన శరీరంలోని కణాలు మరియు కణజాలాలు విచ్ఛిన్నం అవకుండా కాపాడుతాయి.
Anchovies Nutritional Value
High in Protein: చేప మన శరీరంలో కణజాలాల వృద్ధికి అవసరమయ్యే ప్రోటీన్లను అధికంగా కలిగి ఉంటుంది.
Omega-3 Fatty Acids: మన మెదడుకు మరియు గుండెకు అవసరమయ్యే ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ ని కూడా అధికమవుతాదులో నిల్వ ఉంచుకొని ఉంటుంది.
Vitamins and Minerals: ఇవి అధిక స్థాయిలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మరియు విటమిన్ బి12, అదేవిధంగా మన శరీరానికి అత్యంత అవసరమైన నియాసిన్ ని కూడా ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచుకొని ఉంటాయి.
Rich in Antioxidants: చెప్పినట్లుగా ఈ చేప మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా అందించగలరు.
Promotes Heart Health: ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆ సీడ్స్ మన గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మన శరీరంలో ఇన్ఫ్లుమేషన్స్ ని కూడా తగ్గిస్తుంది.
Aids in Weight Management: ఈ చేప మాంసంలో అధికంగా ప్రోటీన్లు ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకున్న వారికి తక్కువ ఆహారంతోనే వారికి కడుపు నిండినట్లుగా అనుభూతి చెందేలా కలిగించి, ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడాన్ని నిర్మూలించి, శరీర బరువుని తగ్గించుటలో చాలావరకు సహాయపడుతుంది.
ఈ చేప మాంసం అధికంగా కాల్షియం మరియు విటమిన్ D లను అధిక స్థాయిలో కలిగి ఉండడం వలన మన శరీరంలోని ఎముకలు దృఢంగా ఉంచడంలో సహాయపడడమే కాకుండా వాటిని బలహీన పడకుండా చూసుకుంటాయి.
Frequently asked questions
1. Where are anchovies commonly found in the wild?
ఇవి మంచినీటిలోనూ సముద్రపు నీటిలోనూ బాగా జీవించగలవు. వీడికి ఎక్కువ ఆహారం దొరికే చోట అధిక సంఖ్యలో గుడ్లను విడుదల చేసి వాటి సంఖ్యను పెంచుకుంటాయి. సముద్ర నీటిలో బాగా పచ్చిక ఉన్న ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మంచినీటి సరస్సులలో లేదా గుంటలలో వీటికి ఆహారంగా సైవలాలు సిలింద్రాలు మరియు పచ్చికనుంచి వచ్చే కుళ్ళిన పదార్థాలు ఆహారంగా ఉపయోగపడతాయి.
2. What are some typical physical characteristics of anchovies?
ఇవి ఆకారంలో చాలా చిన్నవిగా ఉంటాయి వీటి సైజు అంటే పొడవు 2 – 3 అంగుళాల వరకు మాత్రమే ఉంటుంది. వీటి శరీరం చాలా పలుచగా ఉండి నీటిలో చాలా సులువుగా ఈదగలిగేలా తేలికగా ఉంటుంది.
ఈ చేప పైన చాలా చిన్న పులుసులు సిల్వర్ కలర్ లో ఉంటాయి ఇవి ఇవి చేపకు మెరుపుని ఇస్తాయి. ఈ మెరుపు వల్ల… ఈ చేపలు నీటిలో….. నీటి అలలుకి వచ్చే మెరుపులో కలిసి పోవడం వల్ల పెద్ద చేపల నుంచి రక్షించబడతాయి.
3. Can anchovies be farmed?
ఇవి మంచి రకాల లవణాలను పోషక పదార్థాలను కలిగి ఉండటం వల్ల వీటిని తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమంది మాత్రం సముద్రంలో లభించే మెత్తళ్లను తినడానికి తిరస్కరిస్తారు. ఇందుకు కారణం.. వీటిలో కొన్ని రకాల చేపలలో మెర్కురి అని విష పదార్థం ఎక్కువగా ఉండటం వలన. ఈ పదార్థం మన శరీరంలో మెదడుపై ప్రతికూల పరిస్థితిని కలిగించి శరీరంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
4. What is the scientific name of anchovies?
ఈ చేప యొక్క శాస్త్రీయ నామం ఎన్ గ్రావిలీడియే.
5. Can anchovies be eaten raw, or are they typically cooked?
ఈ చేపలను అన్ని రకాలుగా అంటే పచ్చివి గా ఉన్నప్పుడు తింటారు లేదా మరికొందరు బాగా ఎండ పెట్టుకొని నిల్వ ఉంచుకొని కొన్ని రోజులపాటు మాంసకృతుల కోసం ఆహారంగా తీసుకుంటారు.
పైన చెప్పిన విధంగా వీటిని చాలామంది ఆహారంగా తీసుకుంటారు. వీటిలో అధికంగా పోషక పదార్థాలు పుష్కలంగా లభించడం వలన……. పట్టిన చేపలను అదిపనిగా ఎండలో బాగా ఎండబెట్టి… పొడి సంచులలోనో లేదా బుట్టలలోనో నిల్వచేసి వాటికి పురుగు పట్టకుండా చుట్టూ చీమల మందు చల్లి ఎక్కువ కాలం పాటు వాటిని విలువైన సంపదగా దాచుకుంటారు. ఇలా ఎండబెట్టిన చేపలకు మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది.
6. What are some nutritional benefits of consuming anchovies?
వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన కణజాలాలను అభివృద్ధి చేసుకోవచ్చు, ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు, గుండెకు సంబంధించిన వ్యాధుల మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో అధికంగా ఐరన్ ఉండడం వలన రక్తహీనతను నిర్మూలించవచ్చు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం వలన కొలెస్ట్రాల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. దీనికి కొవ్వును కరిగించే స్వభావం ఉన్నందువలన ఊబకాయం నుంచి ఉపశమనం పొందవచ్చు.
దీని మాంసంలో నియాసిన్ అంటే విటమిన్ B3 పుష్కలంగా లభించడం వలన ఇది మన శరీరంలో ఎక్కువ శక్తిని మన శరీరానికి ఇవ్వడంలో తోడ్పడుతుంది. ఈ నియాసిన్ మన శరీరంలో జరిగే రసాయన క్రియలలో చాలా ప్రాధాన్యత చూపుతుంది. మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుటలో ఈ పదార్థం చాలా అవసరం. మన చర్మానికి కలిగే రుగ్మతలను తొలగించడం లో విటమిన్ B3 ప్రత్యేక పాత్ర వహిస్తుంది. ఇది మానసిక శక్తిని బలంగా ఉంచడమే కాకుండా శారీరికంగా ముఖ్యంగా రక్తపోటును నివారించుటలో తోడ్పడుతుంది.
Similar posts that you may like reading.