కాయగూరలు మన ఆరోగ్యానికి ఎంత అవసరమో మీకు చెప్పనక్కర్లేదు. మనలో చాలామంది వారంలో కనీసం ఐదు రోజులైనా కాయగూరలతో చేసిన వంటకాన్ని భుజించక ఉండలేము. శాఖాహారులైతే కాయగూరల ద్వారానే వారి శరీర పెరుగుదలకు కావలసిన అన్ని రకాల పోషకాలను కాయగూరలు మరియు ఆకుకూరల ద్వారా మాత్రమే పొందుతారు. మాంసాహారంలో దొరకని పోషకాలు కూడా శాఖాహారంలో దొరికితాయి అంటే నమ్మడానికి కష్టమే. మాంసాహారంలో మనం తినే మాంసము కూడా ఒక జీవిదే… ఆ జీవి కూడా చెట్ల నుంచి వచ్చిన ఆహారాన్నే తింటుంది. మనం తినే అన్ని కాయగూరలలో బీరకాయ అనేది చాలా ముఖ్యమైన ఆహార పదార్థం. దీని ద్వారా అనేక రకాల వంటకాలను మన ఇంట్లో మన అమ్మ చేయడం చూస్తూనే ఉంటాం. బీరకాయ ద్వారా మన శరీరానికి కావలసిన కొన్ని ముఖ్యమైన లవణాలను మరియు పోషక పదార్థాలు పుష్కలంగా పొందవచ్చు.
ఇక్కడ మనం బీరకాయను ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో దానికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో… బీరకాయ యొక్క ఉపయోగాలు, పోషక విలువలు, మరియు బీరకాయతో మనకు దొరికే వంటకాల గురించి ఈ పోస్టులు క్లుప్తంగా తెలుసుకుందాం
Beerakaya in English
Birakaya is a very popular vegetable in India and has several benefits for health. Birakaya or beerakai is also available in China and Vietnam. Ridge gourd is the name of Beerakaya in English. Sometimes it is also known as Luffa or Chinese okra in English. Some people believe that beerkaya and zucchini are the same vegetable. The reason is that zucchini is shaped like a ridge gourd but zucchini does not have ridges on its body like ridge gourd does. The body of the zucchini is very soft and shiny green in color.
Benefits of Beerakaya in English
- Beerkaya is very helpful in reducing body weight.
- People with iron deficiency can get iron in excess by eating berkaya.
- Those who are suffering from anemia can get the iron required for blood production through beerakaya.
- It is rich in vitamin A, which is useful for our eyesight improvement.
- It has the ability to purify the blood and helps in removing impurities and toxic substances from the blood.
- Beerakaya is rich in antioxidants that always protect our body cells and tissues from free radicals.
- It helps in keeping our liver healthy as it has blood-purifying properties.
- It helps in controlling diabetes.
- Ridge gourd has the ability to improve our skin’s smoothness, color, and moisture.
- Beerkaya contains a large amount of water. Pure juice extracted or prepared from it helps in cooling our body.
- The one who suffers from constipation can get some relief from consuming it as food because it contains a high amount of fiber.
- Ridge gourd can play a role in boosting the immune system of those suffering from chronic health problems.
Guthula Beerakaya (Cluster Ridge Gourd)
మనకు మార్కెట్లలో దొరికే బీరకాయలు చాలా రకాలు ఉంటాయి అందులో గుత్తుల బీరకాయ ఒకటి. గుత్తుల బీరకాయ చూడడానికి మామూలు బీరకాయ కంటే పొడవులో చాలా చిన్నదిగా ఉండి… కొంచెం దానికంటే దృఢంగా ఉంటుంది. గుత్తుల బీరకాయ అని అనడానికి ప్రధాన కారణం ఇవి చెట్టుకు మూడు నుంచి పది కాయల వరకు ఒకే చోట ఒకే తీగకు గుత్తులు గుత్తులుగా కాయడమే.
ఇవి ఆకారంలో చిన్నవిగా ఉన్నా కూడా… సాధారణ బీరకాయలో మనకు లభించి అన్ని రకాల పోషకాలు ఇందులోనూ పుష్కలంగా లభిస్తాయి. కొన్ని రకాల బీరకాయలు సొరకాయల వలె లావుగా కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి.
Benefits of Beerakaya in Telugu
బీరకాయ అనేది ఒక తెల్లటి గుజ్జు కలిగిన సువాసన లేని కాయగూర. బీరకాయతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా సాంబార్, బీరకాయ తీయగూర, బీరకాయ చట్నీ లేదా పచ్చడి, బీరకాయ తాలింపు, మరియు బీరకాయ పప్పు. పైన వివరించిన వంటకాలు అన్నీ మన తెలుగు రాష్ట్రాలలోనూ, తమిళనాడులోను, కేరళలోనూ, కర్ణాటకలోనూ ఎక్కువగా బీరకాయని ఉపయోగించి చేసుకుంటారు. మరికొన్ని రాష్ట్రాలలోనూ మరియు ఇతర దేశాలలోనూ బీరకాయ అనేక రకాల ఆహార పదార్థాల తయారీలో వినియోగించబడుతుంది.
శరీర బరువు తగ్గించుటలో: మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇందులో మన శరీర బరువు పెరుగుదలకు ఉపయోగపడే ఎటువంటి కొవ్వు పదార్థాలు మరియు క్యాలరీస్ తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో నీరు ఉండడం వలన దీనిని ఆహార పదార్ధంగా తీసుకున్నప్పుడు మనకు కొంచెం తిన్నా… ఎక్కువ తిన్నట్టు అనుభూతి కలగడం వలన మన శరీర బరువుకు కారణమైన ఇతర కొవ్వు పదార్థాలను మనము తెలియకుండానే తిరస్కరిస్తాము. ఇది తక్కువ మోతాదులో ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడం వలన మరియు అధిక స్థాయిలో నీరు ఉండడం వలన మన శరీరంలోని జీవక్రియలను ప్రేరేపించి ముందుగా పేరుకుపోయిన కొవ్వు (కొలెస్ట్రాల్) ను కరిగించుటలో సహాయపడుతుంది. అదేవిధంగా మన రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఇన్సులిన్ లాంటి హార్మోన్ మరియు ఇతర ఆల్కలైట్స్ ఇందులో ఉండటం వలన ఇది శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహంతో బాధపడే వారికి మేలు కలిగిస్తుంది.
కాలేయ పనితీరును పెంచడంలో: బీరకాయలో ఉండే కొన్ని రకాల లవణాలు, రసాయన సమ్మేళనాలు మన శరీరంలో మనకు హాని కలిగించే విషపూరిత పదార్థాలతో పోట్లాడి వాటిని శరీరం నుంచి బయటకు విడుదల అయ్యేలా పనిచేస్తాయి. ఇలా మన రక్తంలోని విష పదార్థాలను, వ్యర్థ పదార్థాలను తొలగించడం వలన మన శరీరంలో ఉన్న అవయవాలు మంచి ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు నిల్వచేసుకునే కాలేయం బీరకాయలోని ఈ లక్షణాల వల్ల చాలా మేలుని పొందుతుంది. కాలేయ సమస్యతో బాధపడేవారు బీరకాయను లేదా దాని ఆకుల నుంచి తీసిన గుజ్జును తరచూ తీసుకోవడం వల్ల కాలేయ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎక్కువగా ఆల్కహాల్‌కు అలవాటు పడి కాలేయ సంబంధిత రోగాలతో బారిన పడినవారు. బీరకాయను ఆహారంగా తీసుకుంటే వారిలో కాలేయ పనితీరు పెరగడమే కాకుండా ఆల్కహాల్ కారణంగా నిల్వ అయిన కొవ్వు పదార్ధం మరియు ఇతర ఆల్కహాల్ సంబంధిత విష పదార్థాలను ఇది కలిగించుటలో తోడ్పడుతుంది.
రక్తహీనత సమస్యలను నివారించుటలో: ఏ కుటుంబంలో అయితే తరచూ బీరకాయను తమ వంటకాలలో కాయగూరగా చేర్చుకుంటారో ఆ కుటుంబంలో రక్తహీనతతో బాధపడేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇది అధిక మోతాదులో ఐరన్ ని కలిగి ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకున్న వారిలో రక్త హీనత తో కలిగే సమస్యలు వారి దరికి చేరవు. ఇందులో ఉన్న ఐరన్ స్థాయిలు మన శరీరంలో మనకు కావలసినంత రక్తాన్ని తయారు చేయుటలో చాలా వరకు దోహదపడతాయి. ఇది ఐరన్ కలిగిన ఒక మంచి కాయగూర గనుక దీనిని రక్తహీనతతో బాధపడేవారు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టమూ లేదు. చాలామంది పరకడపనే లేచి బీరకాయతో చేసిన రసాన్ని ఆరోగ్య పానీయంగా స్వీకరిస్తారు. ఐరన్ తో పాటుగా మన శరీరంలో ఎర్ర రక్త కణాల విడుదలకు సహాయపడే విటమిన్ b6 కూడా బీరకాయలలో విస్తారంగా లభిస్తుంది. రక్తం తగిన స్థాయిలో ఉండడం వల్ల మన శరీరంలో అవయవాలకు పుష్కలంగా రక్తప్రసరణ జరుగుతుంది.
అల్సర్ ని తగ్గించుటలో: అల్సర్ తో ఇబ్బంది పడే వారికి బీరకాయతో చేసిన వంటకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. బీరకాయకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండడం వలన మనకు కడుపులో అల్సర్ కు కారణమయ్యే రసాయనాలను అదుపులో ఉంచి కడుపు మంట నుంచి మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా ముందుగా చెప్పుకున్నట్లుగా ఇది మన శరీరాన్ని చల్లపరచుటలో చాలా దోహదపడుతుంది. కొందరికి మూత్ర విసర్జన సమయంలో మంట కలుగుతుంది. అలాంటివారు బీరకాయ గుజ్జును లేదా బీరకాయ నుంచి తీసిన రసాన్ని తీసుకుంటే వారికి కూలింగ్ ఎఫెక్ట్ కలుగుతుంది. వేసవికాలంలో వడదెబ్బకు గురైన వారిలో ఎక్కువమంది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. వారికి బీరకాయ నుంచి తీసిన రసంలో ఒక బద్ద నిమ్మరసం పిండి ఇచ్చినట్లయితే వారికి త్వరగా నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
మలబద్ధక నివారించుటలో: మలబద్ధకంతో బాధపడే వారికి వైద్యులు ఎక్కువగా పీచు పదార్థం ఉండే ఆహార పదార్థాలను తరచూ వారి రోజువారి ఆహారంలో చేర్చుకోమని సలహా ఇస్తూనే ఉంటారు. పీచు పదార్థం అధికంగా కలిగిన కూరగాయలలో బీరకాయ అనేది ముందు అందులో ఉంటుంది. బీరకాయలో పీచు పదార్థము తో పాటు అధిక మోతాదులో నీరు ఉండడం వలన ఇది మలానికి జారుడు గుణం వచ్చేలా సహాయపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే రెండు బీరకాయ ముక్కలను లేదా బీరకాయ జ్యూస్ ను త్రాగడం వలన వారు సులువుగా మలవిసర్జన చేయవచ్చు. పీచు పదార్థము మరియు నీరే కాకుండా బీరకాయలో ఇతర లవణాలు అంటే మన కడుపులో తేమ శాతం పెంచే శక్తి కలిగిన రసాయన సమ్మేళనాలు కూడా విరివిగా లభిస్తాయి.
కంటి చూపుని మెరుగుపరచటలో: బీరకాయలు అధిక మోతాదులో విటమిన్ ఏ ఉంటుంది. ఈ విటమిన్ మన కంటి చూపు మెరుగుపరచడానికి చాలా సహాయపడుతుంది. బీరకాయ ఎక్కువ వయసు కలిగిన వారిలో కంటిచూపు సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపుకు తోడ్పడే కండరాలు ఎక్కువ వయసు ఉన్న వారిలో రోజురోజుకు నశిస్తూ ఉంటాయి. ఈ కండరాలను స్థిరపరచుటలో మరియు దృఢపరుచుటలో బీరకాయలోని రసాయనాలు చాలా దోహదపడతాయి. కంటిలోని రెటీనాను కూడా ఇందులో ఉన్న పోషక విలువలు మెరుగుపరచగలవు. ముందుగా చెప్పుకున్నట్లుగా బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కంటి చూపును తగ్గించే విషపూరిత పదార్థాలతో కలిసి వాటిని శరీరం నుంచి తొలగిస్తాయి. ఈ విషపూరిత పదార్థాలలో అధికంగా ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఆరోగ్యకరమైన కణాలలో చేరి వాటి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. అందువలన బీరకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కంటి చూపు పై ఎటువంటి ప్రభావం లేకుండా కంటి చూపుని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా బీరకాయలో మన కంటి చూపుకు మేలు చేసే బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
మధుమేహ నివారణలో: బీరకాయలు మామూలుగానే కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీస్ తక్కువ స్థాయిలో ఉంటాయి. అదేవిధంగా ఇందులోని పీచు పదార్థం శరీరంలో నిదానముగా జీర్ణమై తక్కువ స్థాయిలో చక్కెరను విడుదల చేస్తుంది. పైన చెప్పినట్లుగా ఇది ఆకలిని తగ్గించే కాయగూర. దీనికి కారణంగా మధుమేహంతో బాధపడేవారు బీరకాయను ఆహారంగా తీసుకున్న తర్వాత ఇతర ఆహార పదార్థాలు తినాలని ఆశను కోల్పోతారు. బీరకాయలో అధిక మోతాదులో ఆల్కలైడ్స్ మరియు ఇన్సులిన్ లాంటి పెప్టైడ్ ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనితో పాటుగా బీరకాయ తిన్న తర్వాత మన శరీరంలో జీవక్రియలు ముఖ్యంగా కొవ్వును కరిగించే రసాయన క్రియలు ప్రోత్సహించబడి ఆల్రెడీ పేరుకుని ఉన్న కొవ్వు పదార్థాలను కరిగించి వాటిని శరీరం నుంచి తొలగించి అధిక బరువు నుంచి ఉపశమనం ఇస్తుంది. బీరకాయకు మరొక ముఖ్యమైన లక్షణం దీనికి హైపోగ్లైసిమిక్ లక్షణం ఉండడం. దీని అర్థం ఏదైనా ఆహారం తిన్న వెంటనే మన రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా దీనికి వాటిని నిరోధించగలిగే సామర్థ్యం ఉండడం.
వడదెబ్బ నుంచి రక్షించుటలో: బీరకాయకు శరీర ఉష్ణోగ్రతను కాపాడుటలో అంటే…. అధిక ఉష్ణోగ్రత మన శరీరం పొందకుండా చల్లబరుచుటలో దోహద పడుతుంది. వేసవికాలంలో ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు బీరకాయ రసాన్ని తీసుకుంటే ఆ రోజంతా మన శరీరం చల్లగా ఉండటమే కాకుండా ఎండకు మన శరీరం నుంచి విలువైన లవణాలు కోల్పోకుండా కాపాడుతుంది. ఇలా ఎలక్ట్రోలైట్స్ ని కోల్పోకుండా ఇది కాపాడడానికి ముఖ్య కారణం ఇందులో అధికమవుతాదులో పొటాషియం, కాల్షియం, సోడియం, సెలీనియం, కాపర్, మరియు జింక్ అనే మినరల్స్ ఉండడమే. ఈ మినరల్స్ మన శరీరంలో అసిడిటీని తొలగించి ఆల్కలైన్ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలా చేయడం వల్ల మన శరీరం ఎప్పటికీ డిహైడ్రేషన్ కి గురికాదు.
చర్మ సమస్యలను తగ్గించుటలో: బీరకాయలో అధిక మోతాదులో విటమిన్ సి మరియు విటమిన్ ఏ లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు జీవ క్రియలో సహాయపడటమే కాకుండా మన చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఈ రెండు విటమిన్లు ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మం పైన ఏదైనా గాయం తగిలిన లేదా మచ్చ ఏర్పడిన బీరకాయతో చేసిన చూర్ణాన్ని పూసినట్లయితే వాటి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కనీసం కొద్ది మోతాదులో అంటే రెండు లేదా మూడు బీరకాయ ముక్కలను మన ఆహారంలో చేర్చుకుంటే చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. చర్మ సౌందర్యానికి కావలసిన పోషక పదార్థాలు మరియు లవణాలు బీరకాయ గుజ్జులో మరియు వాటి విత్తనాలలో కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆయుర్వేదంలో బీరకాయ నుంచి సేకరించిన విత్తనాలను చర్మ సౌందర్యం కోసం తయారు చేసే కాస్మెటిక్ క్రీమ్స్ లో ఎక్కువగా వినియోగిస్తారు అంటే…. నమ్మశక్యం కాదు. దీనికి కారణం గుజ్జులో కంటే వీటికి గింజలలో అధికమవుతాదులో అమినోయాసిడ్స్ మరియు కొద్ది మోతాదులో ఒమేగా ఫ్యాటి యాసీడ్స్, కెరోటిన్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మరియు ఇతర పోషకాలు ఉండడమే.
గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో: మన గుండె సక్రమంగా పనిచేయడానికి ఎల్లప్పుడూ ఎక్కువ మోతాదులో పొటాషియం మరియు మెగ్నీషియం మినరల్స్ చాలా అవసరం. బీరకాయ ఈ మినరల్స్ ను అధిక మోతాదులో కలిగి ఉంటుంది. వీటితో పాటుగా గుండె కణాలు మరియు కణజాలాలు ఎల్లప్పుడూ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కి గురికాకుండా మరియు ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడబడటానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బీరకాయలో అధిక మోతాదులో లభిస్తాయి.
వ్యాధి నిరోధక శక్తి: పైన మనం బీరకాయ గురించి తెలుసుకున్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ ముఖ్యంగా కంటి పెరుగుదలకు, కాలేయ పనితీరు పెంచుటకు, మధుమేహ నివారణకు, చర్మ సౌందర్యానికి మూల కారణం పైన చెప్పిన పోషకాలే కాకుండా… దీనిలో పుష్కలంగా రైబోఫ్లేవిన్ మరియు థయామిన్ కూడా లభించడమే. ఈ రెండు పోషక పదార్థాలు శరీర కణజాల వృద్ధికి మరియు రుగ్మతలను నిర్మూలించడానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఈ రెండు పదార్థాలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పంచగలవు.
Nutrients in Ridge gourd vegetable per 100g
బీరకాయలో మన శరీర పెరుగుదలకు కావలసిన కొన్ని ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో లభిస్తాయి. వీటిలో ముఖ్యంగా మనకు కావలసిన ప్రోటీన్ మరియు డైటరీ ఫైబర్ అధికమవుతాదిలో ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్ చాలా వరకు తక్కువగా… అంటే చాలా వరకు లేనట్టే చెప్పుకోవచ్చు. కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉండడం వలన దీనిని తింటే బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు. దీనిలో అన్నిటికంటే మన శరీర శక్తికి కావలసిన కార్బోహైడ్రేట్స్ అధికంగానే లభిస్తాయి. ఇందులో ఫాట్స్ చాలా తక్కువగా ఉండి…. ఇది క్యాలరీస్ కూడా తక్కువ మోతాదులోనే కలిగి ఉంటుంది.
పైన చెప్పిన వాటితో పాటుగా బీరకాయలో శరీరంలోని జీవక్రియలకు తోడ్పడే కొన్ని ముఖ్యమైన లవణాలు మరియు విటమిన్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా చాలా రకాల విటమిన్లు మనకు దొరుకుతాయి. ఐరన్ కూడా 100 గ్రాముల బీరకాయలో సుమారు 2% వరకు ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి తో పాటు విటమిన్ B6 కూడా ఎక్కువ మోతాదులో మనం బీరకాయ ద్వారా పొందవచ్చు. మన కణజాలాల అభివృద్ధికి కావలసిన లవణాలలో ముఖ్యమైనవి సోడియం, పొటాషియం, మరియు మెగ్నీషియం. ఇవి కూడా బీరకాయలో పుష్కలంగా లభిస్తాయి.
ఈ పోస్ట్ ను పూర్తిగా చదివినందుకు ధన్యవాదములు. మీరు ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి మా వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసమే మరియు శాస్త్రీయపరమైన సమాచార సేకరణ కోసమే. మీరు ఆరోగ్యపరంగా సమాచారానికైనా మీ యొక్క వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
Senagapappu | Bocha Fish |
Korameenu Fish | Pesara Pappu |
Salmon Fish | Rohu Fish |
Horsegram | Anchovies |
Bommidala Fish | Mamidikaya pachadi |