Home » Hindi to Telugu Dictionary » Jowar in Telugu (తెలుగు లో), Other Names, and Benefits

Jowar in Telugu (తెలుగు లో), Other Names, and Benefits

Sorghum is a millennium-old grain that originated in Africa. It has been used as a sweetener in sorghum syrup and sorghum molasses, as well as in the production of alcoholic drinks, in the American food supply for many years.

Sorghum outperforms many other grains in terms of nutrient density.
Sorghum has a low-fat content, with only 3 grams per half-cup.
Carbohydrates make up the majority of the calories in sorghum.
Sorghum is becoming more widely recognized as a cereal grain that can be eaten on its own.
Sorghum can be a healthy addition to most diets because it is high in protein, gluten-free, and full of antioxidants.

Niacin is present in sorghum. Niacin, also known as vitamin B3, helps the body transform food into usable energy and fuel by breaking down and metabolizing nutrients.

Minerals such as copper, iron, zinc, magnesium, and calcium can also be found in sorghum. Copper can aid in the absorption of iron into the body.

Meaning of Jowar in Telugu

జొన్నలు (Jonnalu)

జొన్నగింజలు (Jonnalu ginjalu)

Jowar in English

Sorghum

White millet

Jowar in Telugu

Benefits of Jowar in Telugu

జొన్నలు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది జొన్నరొట్టె మరియు కోడి కూర. జొన్నలను దక్షిణ భారత దేశంలో ఉండే ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ రాయలసీమ వంటి ప్రాంతాల్లో జొన్నలను ఎక్కువగా ఇష్టపడతారు. జొన్నలు ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. జొన్నలను వృక్షశాస్త్రంలో sorghum bicolor,ఇంగ్లీషులోsorghum, మరియు హిందీలో జోవార్ అని అని పిలుస్తారు. అదేవిధంగా జొన్నలలో అనేకరకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నందువలన జొన్నలను గ్రేట్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు. మార్కెట్లో మనకు అనేక రకాలైన జొన్న జాతులు లభిస్తాయి అవి తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, ఎర్ర జొన్నలు,స్వర్ణం, పాల, మల్లె, సీత, ఉత్తర, సాయి, తోక, ఇంకా తోక ముట్టని జొన్న అని అనేక రకాలుగా ఉన్నాయి. జొన్నలు మన శరీరంలో వేడిని తగ్గించడడమే కాకుండా వాతా, పిత, కఫ సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. జొన్నలు మనకు వగరు, తీపి, చేదు మరియు ఇతర రకాల రుచులలో లభిస్తాయి.
మనదేశంలో వరి, గోధుమ, తరువాత అత్యధిక స్థాయిలో పండించే పంట జొన్న పంట. జొన్నలను మనదేశంలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. కోస్తాంధ్ర కన్నా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో జొన్నల ని అధిక మోతాదులో సాగుచేస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా జొన్నలను ఆసియా, ఆఫ్రికా ,ఆస్ట్రేలియా వంటి ఖండాలలో కూడా ఎక్కువగా సాగు చేస్తారు. వివిధ ప్రాంతాలలో జొన్నలను పశువులకు పశుగ్రాసంగా, గుర్రాలకి దాణాగా కూడా ఉపయోగిస్తున్నారు.జొన్నలో అధికమోతాదులో పీచు పదార్థాలు ప్రోటీన్లు ఉంటాయి. అందువలన జొన్నలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో దోహదపడతాయి. ఒక వంద గ్రాములు జొన్మలలో మన శరీరానికి రోజుకు అవసరమయ్యే మెగ్నీషియం లో 50% మెగ్నీషియం మరియు క్యాలరీస్ లో 400 కేలరీలు, 5% క్యాల్షియం ఈ జొన్నలు ద్వారా మనకు లభిస్తాయి. అందువలన జొన్న లని క్యాలరీ రిచ్ ఫుడ్ మరియు సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.

అదేవిధంగా మధుమేహం మరియు కంటిచూపులో సమస్యలు ఉన్నవారు అధిక మోతాదులో జొన్నల్ని తీసుకోవడం మంచిది.

ఫాస్పరస్, కాపర్, కాల్షియం, జింక్, మాంగనీస్, మరియు పొటాషియం వంటి పోషకాహార విలువలు కలిగి ఉన్నందు వలన జొన్నలను మనం ఉత్తమ పోషకాహారం గా పేర్కొన వచ్చును.

Benefits of Jowar in Telugu
Benefits of Jowar in Telugu

బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ప్లమ్స్ వంటి పండ్లలో ఉండే యాంటాసిడ్స్ కంటే జొన్నలలో అధిక మోతాదులో యాంటాసిడ్స్ ఉంటాయి. అందువలన తక్కువ ఖర్చుతో మనం జొన్నలు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును.

గుండె సంబంధిత వ్యాధులైన గుండిపోటు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ లను నియంత్రించడంలో జొన్నలు సమర్థవంతంగా పనిచేస్తాయని అధ్యయనాలలో పేర్కొనబడి ఉంది.

జొన్నలో పీచుపదార్థం అధిక మోతాదులో ఉండడం వలన జీర్ణవ్యవస్థ పనితీరుకు మరియు జీర్ణ వ్యవస్థ, ఆరోగ్యానికి జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఇవి తోడ్పడతాయి.

జొన్నలలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ ఉన్నందు వలన అవి శరీరంలో అధిక మోతాదులో ఉత్పన్నమయ్యే ఫ్రీరాడికల్స్స సంఖ్య ను అదుపులో ఉంచి క్యాన్సర్ బారిన పడకుండా మన శరీరాన్ని సమర్థవంతంగా కాపాడతాయని నిపుణుల చెపుతున్నారు.

అదేవిధంగా ఉదర సంబంధిత వ్యాధులైన గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, కడుపులో మంట, కడుపులో పుండు, కడుపులోని గడ్లు, కడుపులో నొప్పి, మరియు వాంతులు వంటి సమస్యలకు చెక్ పెట్టడం లో జొన్నలు సమర్థవంతంగా పని చేస్తాయి.

విటమిన్ B6 జోన్నలో అధికంగా ఉండడం వలన జొన్నలు మన శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పెంపొందించి శరీరాన్ని ఉత్తేజ భరితంగా చేసి శరీర అలసటను దూరం చేస్తాయి.

జొన్నలలో రక్త వృధిని పెంపొందించే ఇనుము, క్యాల్షియం, పోలిక్ యాసిడ్, మరియు విటమిన్ బి అధిక మొత్తంలో ఉన్నందువలన రక్తం తక్కువగా ఉన్నవారు మరియు రక్త హీనత,అంటే అనీమియా తో బాధపడేవారు జొన్నలను స్వీకరించడం మంచిది.

జొన్నలో క్యాలరీలు తక్కువగా ఉండి ఇనుము, జింక్ పరిమాణాలు ఎక్కువగా ఉన్నందు వలన ఇది శరీర క్యాలరీలను పెరగకుండా చేసి, అధిక బరువును తగ్గించడంలో, మరియు శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.

అంతేకాకుండా వీర్యవృద్ధి పెంచడంలో కూడా జొన్నలు ఎంతగానో తోడ్పడతాయి. అంటే సంతానలేమి సమస్యలతో బాధపడే మగవారు జొన్నలను తీసుకోవడం ద్వారా వారిలో శుక్ర కణాలు వృద్ధి జరిగి తొందరగా సంతానం పొందగలరు.

బలహీనులకు అంటే బలం తక్కువగా ఉన్న వారికి జొన్నసంగటి, జొన్న రొట్టె, జొన్న జావ వంటి వాటిని ఆహారంలో ఇవ్వడం వలన కండర వృద్ధికి తోడ్పడి శరీరంలో శక్తిని పెంపొందిస్తాయి.

పౌష్టికాహారలోపం తో బాధపడే చిన్న పిల్లలకు పాలు కలిపిన జొన్నపిండి జావ త్రాగించడం ద్వారా వారిలో మానసిక మరియు శారీరక లోపాలు దూరమై పిల్లలు పుష్టిగా తయారవుతారు.

అదేవిధంగా మధుమేహ సమస్యలు ఉన్నవారు జొన్నరొట్టెలు లేదా జొన్న సంగటి మరియు జొన్న జావ తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి మధుమేహం ద్వారా ఏర్పడే సమస్యల నుంచి సత్వర పరిష్కారం పొందవచ్చు.

పాప్కాన్ లాగా జనాలను కూడా పేలాలు గా చేసి చిన్నపిల్లలకు పెట్టడం ద్వారా వారు ఎంతో ఇష్టంగా జొన్నలను తింటారు.

అదేవిధంగా చిన్నపిల్లలు మరియు పెద్దవారిలో ఇన్స్టెంట్ ఎనర్జీ (త్వరిత శక్తీ) కోసం జొన్నలను పేలాలుగా చేసి మెత్తగా పొడిచేసి కొంచెం చక్కెరను కలిపి తినడం ద్వారా వేసవికాలంలో కలిగే నీరసం నుంచి మరియు వడదెబ్బ నుంచి ఉపశమన పొందగలరు.

పాలిచ్చే తల్లుల్లో పాల వృదిని పెంచి పుష్కలంగా పాలు ఇవ్వడం కోసం జొన్నలను బాలింతలకు ఆహారంగా పెట్టడం మంచిది.

Uses of sorghum in English

Sorghum has numerous health benefits in relation to our digestive system. Let’s take a closer look at the advantages in more detail.

It may contain almost half of the daily nutritional requirements, B-vitamins like riboflavin, niacin, and thiamin, as well as a higher amount of calcium, iron, magnesium, and copper, and an adequate amount of dietary fiber, phosphorus, and potassium.

  • Sorghum is suitable for celiac disease and gluten intolerance.
  • Jowar possible that it’ll help you shed some pounds.
  • White millete has the potential to lower inflammation levels.
  • It’s suitable for a sodium-restricted diet. It aids in the control of blood pressure.
  • It’s possible that it will help with blood sugar levels.
  • It has the potential to improve bone health.
  • It can be classified as a gluten-free grain.
  • Sorghum has been shown to help with digestion.
Senagapappu in English, Benefits, and Its Other NamesMoong dal in Telugu (తెలుగు లో), Other Names, Benefits
Pesara Pappu in English, Benefits, Its Other namesCarom Seed in Telugu | Others Names and Uses
States starting with O letter in the USAAll Countries List in the World 
Halwa Recipe in TeluguKorameenu Fish in English, Telugu, Its Benefits
Rohu Fish in Telugu (తెలుగులో) and Its Benefits (Good or Bad for Health)Bajra in Telugu (తెలుగు లో) Other Names and Benefits
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram