Home » Hindi to Telugu Dictionary » Bajra in Telugu (తెలుగు లో), Other Names and Benefits/Uses

Bajra in Telugu (తెలుగు లో), Other Names and Benefits/Uses

Pearl millet is known in India as Bajra. In Telugu, it is called Sajja or Sajjalu. It is one of the most ancient grains that has been cultivated. It’s popular in rural India and can be found all over the world. It contains a wide range of nutrients and has numerous health benefits. Fiber, protein, and essential vitamins are abundantly available in pearl millet.

In addition to being nutrient-dense, Bajra is resistant to heat and drought stress, as well as some types of contamination that harm other millets.

For years, the stalk of the plant has been used as animal feed and as a material for covering house roofs, but it’s also a great source of food for humans due to its low cost and high nutrient content.

It is particularly beneficial in areas where there is a lack of food.

The name of Bajra in Telugu

సజ్జ (Sajja)

సజ్జలు (Sajjalu)

Name and Benifits of Bajra in Telugu

Benefits of Bajra in Telugu

సజ్జలు అనగానే మనకు గుర్తుకివచ్చేది నాగుల చవితి పండుగ. నా బాల్యంలో నాగుల చవితి పండుగ రోజున మొలకెత్తిన సజ్జలను మరియు బెల్లంతో కలిపిన బియ్యం పిండిని ప్రసాదంగా మా కుటుంబంఅంతా కలిసి పుట్టకు పెట్టేవారు. మనలో చాలా మందికి సజ్జలు గురించి తెలిసే ఉంటుంది కానీ వాటిలో ఉన్న ఔషధ గుణాలు మరియు ఆరోగ్యతత్వాలు గురించి పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు.

ఈ బ్లాగ్ లో మనం సజ్జలు మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
సంపూర్ణ ఆహార పదార్థాలు గురించి మీరు వినే ఉంటారు వాటినే ఆంగ్లంలో బ్యాలెన్స్ డైట్ అంటాము. ఏ ఆహారంలో అయితే మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయో ఆ ఆహార పదార్థాన్ని సంపూర్ణ ఆరోగ్య పదార్థాలు లేదా సంతులిత ఆహార పదార్థాలు అంటాము. అయితే సజ్జలు పైన చెప్పిన అన్ని పోషకాలను కలిగి ఉండడం వలన సజ్జల ను సంతులిత ఆహార పదార్ధం అని కూడా పిలవ వచ్చును.

మొలకెత్తిన సజ్జల ను తీసుకోవడం ద్వారా అధిక బరువును నియంత్రణలో ఉంచడమే కాకుండా బరువు పెరగకుండా చేస్తుంది .

మనం బియ్యం పిండితో లేదా గోధుమ పిండితో చేసే వంటకాలుఅన్నీ సజ్జపిండి తో కూడా చేసుకోవచ్చు అందువలన బియ్యం పిండికి ప్రత్యామ్నాయంగా సజ్జ పిండిని వాడడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

సజ్జలతో సజ్జ జావ, సజ్జ వడలు, సజ్జల చెకోడీలు, సజ్జ సంగటి వంటి ఎన్నో రకాలైన ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకొనవచ్చును.

సజ్జలో అధిక మోతాదులో ప్రోటీన్లు మరియు ఫైబర్ (పీచు పదార్ధం) ఉన్నందువలన చక్కెర వ్యాధిగ్రస్తులు సజ్జలను తీసుకోవడం ద్వారా వారి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో పెట్టుకోవచ్చును.

సజ్జలు లో ఫైబర్స్ అత్యధికంగా ఉంటాయి మరియు రాగులలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి పిండిగా చేసి జావలా తాగడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు మధుమేహాన్ని అదుపులో ఉంచుకో గలరు.

సజ్జలలో అధిక మోతాదులో పీచు పదార్థాలు అనగా ఫైబర్ ఉన్నందు వలన అరుగుదలకు సంబంధిత మరియు మలబద్దకం సంబంధిత వ్యాధులతో బాధపడేవారు సజ్జల ను తమ ఆహారంలో బాగాగంగా తీసుకోవడం ద్వారా కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు

అదేవిధంగా చిన్న పిల్లలకు సజ్జలు ఇవ్వడం ద్వారా ఇందులో ఉన్న ఫైబర్ వారిలో అరుగుదలను పెంచి ఎక్కువ ఆకలి వేసేలా చేస్తుంది.

సజ్జలో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉంటాయి అందులో amino acids అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ప్రోటీన్లను తయారు చేయడంలో సజ్జలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి.

అదేవిధంగా సజ్జల లో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, మరియు విటమిన్ కె, లు పుష్కలంగా ఉన్నందువలన విటమిన్ లోపంతో బాధపడేవారు తమ రోజువారీ ఆహారంలో సజ్జలను చేర్చుకోవడం మంచిది.

Bajra in Telugu
Nutrients in Bajra in Telugu

సజ్జలు అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందువలన సజ్జలును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

హృద్రోగులు గుండె నొప్పితో బాధపడేవారు మరియు కీళ్ల నొప్పులు అనగా ఆర్థరైటిస్ తో బాధపడే వారు సజ్జలను రోజు కొంత మెరకయినా ఆహరంగా తీసు కోపోవడం మంచిది.

చిన్నారులకు సజ్జలను తినిపించడం లో తల్లులు ఎన్నెన్నో సందేహాలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకు కారణం సజ్జలు తొందరగా జీర్ణం కావు అని తల్లులు భావిస్తూ ఉంటారు. అందువలన సజ్జల ను బాగా ఎండబెట్టి వాటిని దోరగా వేయించి, మెత్తగా పొడి చేసి, ఈ పొడిలో పాలను చక్కెరను కలిపి జావలా చేసి పిల్లలకు తాగించడం ద్వారా సజ్జలు బాగా జీర్ణమై చిన్నపిల్లల్లో ఉన్న శారీరక మానసిక లోపాలు తగ్గుముఖం పడతాయి.

సజ్జ లో అధిక మోతాదులో ఐరన్ ఉన్నందువలన ఐరన్ లోపంతో మరియు రక్తహీనత , అనీమియాతో బాధపడేవారికి సజ్జల ను తీసుకోవడం ద్వారా వారి లోపాలను సరి చేసుకోవచ్చును.

ఇన్ఫెక్షన్స్మ, మరియు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు సజ్జల ను తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.

ఐరన్ లోపం ఉన్న ఆడవారు మరియు నెలసరి సమస్యలతో బాధపడుతున్నవారు సజ్జలును తీసుకోవడం మంచిది. ఇలా సజ్జలను తీసుకోవడం ద్వారా ఎముకలు గట్టి పడి ఆడవారు తమ నెలసరి సమస్యల వలన ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చును.

సజ్జలు లో అధిక మోతాదులో పీచు పదార్థం మరియు ప్రోటీన్లు ఉన్నందువలన, సజ్జలను ఆహరం తీసుకోవడం ద్వారా త్వరగా ఆకలి కలగదు కనుక డైటింగ్ విధానాన్ని అవలంబించేవారు మొలకెత్తిన సజ్జలను మరియు సజ్జల జావను తీసుకొని శరీర బరువును అదుపులో ఉంచుకొనవచ్చును.

సజ్జలలో పైటిక్ యాసిడ్ ఉన్నందు వలన ఇవి జీర్ణక్రియ ద్వారా మన శరీరం గ్రహించే గ్లూకోజ్ను, కొన్ని హానికర కెమికల్స్ ను రక్తంలోకి శోషించకుండా నిరోధిస్తుంది తద్వారా మన శరీరంలో జీర్ణక్రియలో హానికర ప్రక్రియలను అదుపులో ఉంచి శరీర సమతుల్యతను కాపాడుతుంది.

అంతేకాకుండా దీనికి యాంటీ ఆక్సిడెంట్ అనే స్వభావం ఉండటం వలన మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వృద్ధిని అరికడుతుంది.

మలబద్ధకం సమస్యలతో బాధపడే పెద్దవారు మరియు చిన్నారు కూడా సజ్జలను ఆహారంగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాపిగా జరిగి, సులువుగా మలబద్ధక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అదేవిధంగా సజ్జలలో అధిక మోతాదులో క్యాల్షియం ఉండటం వల్ల పిల్లలకు తల్లిపాలు ఇచ్చే తల్లులు సజ్జల ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పాల ఉత్పత్తి అధికమై విటమిన్స్ అధిక మోతాదులో ఉన్న పాలను ఎనర్జీ రిచ్ మిల్క్ ను పిల్లలకు ఆహారం గా అందించ వచ్చును.

పాలలో ఉండే కాల్షియం కంటే మూడో వంతు ఎక్కువగా కాల్షియం సజ్జలలో ఉన్నందువలన, పాలు అంటే అలర్జీ ఉన్నవారు సజ్జలు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పాల ద్వారా పొందే కాల్షియంను సజ్జలు నుంచి పొందవచ్చును.

ఈ విధంగా సజ్జల ను వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల సజ్జల లో ఉండే అనేక రకములైన ఔషధగుణాలు, ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్ వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనం బయట పడవచ్చును.

Uses of Bajra millet in English

  • Bajra lowers your chances of getting breast cancer.
  • It helps people with ulcerative colitis, rheumatoid arthritis, asthma, gout, Crohn’s disease, and other neurodegenerative diseases.
  • It lowers the chances of a child developing asthma.
  • It makes you feel more energized for a long as it is rich in high energy sources.
  • It lowers your chances of dying as a result of inflammatory diseases as it contains antioxidants and valuable nutrients.
  • Bajra lowers your chances of developing cardiovascular disease.
  • It lowers the chances of getting type 2 diabetes.
Moong dal in Telugu (తెలుగు లో), Other Names, BenefitsCarom Seed in Telugu | Others Names and Uses
Senagapappu in English, Benefits, and Its Other NamesPesara Pappu in English, Benefits, Its Other names
States starting with O letter in the USAAll Countries List in the World 
Korameenu Fish in English, Telugu, Its BenefitsRohu Fish in Telugu (తెలుగులో) and Its Benefits (Good or Bad for Health)
Roop chand Fish in Telugu- Benefits, Good or Bad for HealthHalwa Recipe in Telugu
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram