Nangu is a healthy food item that we get from the palm tree in the summer season. These are two to three heart-shaped seeds in the form of jelly balls found in the date palm fruit. Some of the fruits even possess a single jelly seed or ball. They are mostly found in South India, i.e. Telugu states, Kerala, and Tamil Nadu.
Nungu in English
The English names of nunju, nunja, or munja are “Ice apple, palm fruit, toddy palmyra fruit, or toddy fruit“. The scientific name of the toddy palmyra tree is Borassus flabellifer.
ఆంగ్లములో వీటిని ఐస్ ఆపిల్ (Ice Apple) పామ్ ఫ్రూట్ (Palm Fruit) లేదా టాడీ ఫ్రూట్ (Toddy Palmyra Fruit) అని పిలుస్తారు. తాటి చెట్టు యొక్క శాస్త్రీయ నామం “Borassus flabellifer”. తాటి నుంజ దానిపైన ఉన్న కవచం తొలగించినప్పుడు చూడటానికి ఐసుగడ్డలా అనిపిస్తుంది.
Most people in other countries don’t know about ice apples. It is a tree belonging to the Arecaceae family. The shell (tenka) on the top of the ice apple is very strong to look at and is completely black or dark brown in color. We get these fruits mostly from the tree during the summer. It can be considered a seasonal food, i.e., a fruit limited to only one period.
Benefits of Tati Nungu Fruit in English
- Nungu is a good cooling agent, which could reduce body heat if eaten regularly.
- It has antimicrobial properties as it contains valuable chemical compounds in its gelly flesh.
- Antioxidants that protect our body cells from free radicles are abundantly available in the transparent flesh of ice fruit.
- Eaten regularly, it reduces body weight at significant levels.
- It acts as good medicine for people suffering from regular constipation.
- It has been used as raw material for preparing cooling juice in the summer season.
- It contains essential vitamins that are crucial for our body’s growth and metabolism.
- It has anti-inflammatory properties.
- It can cure wounds and rashes on the skin.
- It has been used in making beauty products as it possesses valuable nutrients for skin health.
Thati Nungu Benefits in Telugu
మనము ఇప్పుడు నుంజ యొక్క ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యత గురించి ఈ ఆర్టికల్లో చర్చించుకుందాం. ఈ నుంజల వల్ల మన శరీరానికి మరియు మన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
- తాటి నుంజకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. వేసవికాలంలో దొరికే ఈ తాటి నుంజ వడదెబ్బకు గురి అయిన వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
- ఇది మన శరీరానికి కావలసిన విటమిన్స్ మరియు లవణాలు అన్నిటిని పుష్కలంగా కలిగి ఉంటుంది.
- తాటి నుంజ నుంచి చల్లటి ద్రావణాన్ని కూడా తయారుచేస్తారు.
- తాటి నుంజలను కొందరు మట్టితో చేసిన కుండలలో కొంత సమయం ఉంచి చల్లబడిన తర్వాత ఆహారంగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి శరీరంలో వేడి పూర్తిగా తగ్గిపోతుంది.
- ఇది యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది.
- దీనికి శరీరంలో ఇన్ఫ్లమేషన్స్ను తగ్గించే శక్తిని కూడా కలిగి ఉంటుంది.
- దీనికి సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తి ఉండడం వలన శరీరంలో కలిగే ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించగలదు.
- దీనికి గాయాలను మాన్పే శక్తి ఉండడం వలన.. కొందరు గాయాలు మీద కూడా ఔషధంగా వాడుతారు.
- వీటిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
- దీని తినని తరువాత బాగా ఆకలి కూడా వేస్తుంది.. అంటే పిల్లలలో ఆకలని పుట్టించగలిగే సామర్థ్యం దీనికి ఉంది.
- మలబద్ధకంతో బాధపడే వారికి దీనిని ఒక వారం పాటు ఆహార పదార్థంగా ఉదయాన్నే తీసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే మలబద్ధక సమస్య నుంచి బయటపడతారు.
- నుంజలతో తయారుచేసిన జ్యూస్ తాగడం వలన మన శరీరంలో పరాన జీవులు వల్ల కలిగే రుగ్మతలు కూడా దూరం అవుతాయి.
- నుంజలను తరచూ తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఘననీయంగా పెరుగుతుంది.
- వీటన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పల్లెలలో నివసించేవారు వేసవికాలంలో వారి చర్మానిపై వచ్చే చమటకాయలకు విరుగుడుగా కూడా దీని రసాన్ని చర్మం పైన రాస్తారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉండడం వలన చర్మంపై వచ్చే చమటకాయలను తక్షణమే నిర్మూలిస్తుంది.
- ఈ చల్లటి నుంజలను అమెరికా దేశాలు 90% వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారని మీకు తెలుసా. ఇది అమెరికా దేశాలలో ఐస్ క్రీమ్ల ఉత్పత్తులకు మరియు చల్లటి పానియాలా తయారీకి ఉపయోగించబడుతుంది.
- గత కొన్ని సంవత్సరాల నుంచి ఇతర దేశాలలో… అంటే… ఇవి లభించని దేశాలలో.. వీటిని తినడం రాను రాను గుర్తించని స్థాయిలో కి చేరుకుంటుంది.
- ఐస్ ఆపిల్ కి మన శరీరంలో క్రొవ్వున తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి.
- ఐస్ ఆపిల్ యొక్క పోషకాహార లక్షణాల గురించి చర్చించినట్లయితే, ఇది ఒక తక్కువ క్యాలరీస్ కలిగిన ఆహార పదార్ధం. అంటే ఇది 80 నుంచి 100 కేలరీస్ మాత్రమే కలిగి ఉంటుంది.
- మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికా దేశాలు దీనిని మంచి ఆరోగ్యకరమైన ఔషధ ఆహార పదార్ధముగా గుర్తించడమే.
Nutritional Value of Nungu
నుంజలను మంచి శీతల పదార్థముగా పరిగణిస్తారు. వీటిలో మన శరీరానికి కావలసిన విటమిన్స్ A, B మరియు C లు అధికంగా లభిస్తాయి. అదేవిధంగా మన కణజాల ల పెరుగుదలకు కావలసిన లవణాలు జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం లు అధికంగా లభిస్తాయి. దీనిలోని పోషక పదార్థాలు ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్ లో మనము గమనించవచ్చు….
నుంజలలో మనకు చాలా రకాల ఫైటో న్యూట్రియన్స్ దొరుకుతాయి. ఇది అనేక రకాల రసాయన సమ్మేళనాలను కలిగి ఉన్నందువలన దీనిని మంచి ఆహార పదార్ధంగా భావించవచ్చు. ఫైటో కెమికల్స్ అధికమవుతాదులో ఉండడం వలన దీనిని ముఖానికి అందాన్ని ఇచ్చే ఫేస్ ప్యాక్ లుగా కూడా చాలామంది వాడుతున్నారు. దీనిలో విలువైన రసాయనాలు ఉండడం వలన దీనికి చర్మంపై కాలిన మచ్చలను, చర్మం పొరలను, వేడి గుల్లలు ను, మొటిమలను తొలగించే సామర్థ్యం ఉంటుంది గనుక దీనిని కాస్మెటిక్స్ తయారీ లలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Information of Ice Apple in Telugu
వీటిని కొన్ని ప్రాంతాలలో చెట్టు నుంచి సేకరించకపోవడం వల్ల ఇవి పూర్తిగా పండి మంచి సువాసన వచ్చే పండ్లగా ఒకదాని తర్వాత ఒకటి చెట్టు నుంచి భూమి మీద వృధాగా పడిపోతాయి. కొంతమంది వీటిని సేకరించి వీటిలలో ఉన్న టెంకలను విడదీసి తేగలను పండిస్తారు. తేగలు అంటే టెంకల ద్వారా భూమిలో కి చొచ్చుకుపోయిన వేర్లు…. ఒక టెంక నుంచి ఒక తేగ మాత్రమే.. అంటే… ఒక వేరు మాత్రమే భూమి లోకి వెళుతుంది. ఇలా భూమిలోకి వెళ్లిన ఒకే వేరు కొన్ని రోజులకి బాగా దృఢంగా తయారయ్యి తినడానికి ఉపయోగపడే తేగలాగా మారుతాయి.
తాటికాయ అనేది మన కొబ్బరికాయ అంత సైజు ఉండి దానిలాగా దృఢంగా ఉంటుంది. నుంజలును కాయతో ఉన్నప్పుడే తినాలనుకున్నవారు ఈ తాటికాయను పైభాగాన అంటే కొబ్బరి బొండంని మనం ఎలా పైన చెక్కుతామో.. అలానే తాటి కాయను కూడా పైభాగాన చెక్కి లోపల ఉన్న నుంజలను తింటారు. కొంతమంది వ్యాపారస్తులు ఈ తాటికాయల నుంచి నుంజలను పూర్తిగా బయటకు తీసి వాటికి ఒక ధర కట్టి రోడ్డు పక్కన అమ్ముతూ ఉండటం మీరు గమనించే ఉంటారు.
తాటికాయ నుంచి బయటకు తీసిన నుంజలపై గోధుమ రంగులో ఉన్న దృఢమైన కవచంలో జల్లి రూపంలో ఉన్న తినబడే గట్టి పదార్థాన్ని కప్పబడి ఉంటుంది. తినే ముందు దీనిని సున్నితంగా తొలగించి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నుంజను కప్పబడి ఉన్న గోధుమ రంగులోని ఈ కవచనిపై చాలా ప్రయోగాలు కూడా జరిగి ఉన్నాయి. ఈ కవచానికి సూక్ష్మజీవులను నిర్మూలించగలిగే శక్తి ఉందని, దీనిని లోపల ఉన్న జల్లితో పాటు తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఈ కవచంలో మనకు కావాల్సిన ప్రోటీన్లు మరియు విటమిన్స్ కూడా లభిస్తాయని, ఇందువల్లే మృదువుగా ఉన్న జల్లి లాంటి పదార్థాన్ని ఈ కవచము సూక్ష్మజీవుల భారీ నుంచి రక్షించి కుల్లనీయకుండా కాపాడుతుందని చాలా పరిశోధనలలో తెలియజేయడమైనది.
ఇవి మన భారతదేశంలోనే కాకుండా థాయిలాండ్ శ్రీలంక కాంబోడియా మలేషియా ఇండోనేషియా మరియు మయన్మార్ దేశాలలో కూడా అధికంగా సాగు చేయబడతాయి.
You may also like reading the posts given in the table