1. Manchi Jeevithaniki Manchi Matalu in Telugu (మంచి జీవితానికి మంచి మాటలు)
1. బంగారం కొత్తదే బాగుంటుంది……
బియ్యం పాతవి అయ్యేకొద్దీ బాగుంటాయి………
కానీ మన ఆకలి తీర్చేది మాత్రం బంగారం కానేకాదు, బియ్యం తో తయారైన అన్నం మాత్రమే……..
2. కొత్త పరిచయాలు సంతోషాన్ని ఇస్తాయి………..
పాత బంధాలు విసుగును కలిగిస్తాయి………….
కానీ కష్టం వచ్చినప్పుడు ఆదుకునేది కొత్తగా అయిన పరిచయాలు కాదు….. పాతవి అయినా పాతుకుపోయిన బంధాలు మాత్రమే……….
3. మీకు పక్షులు అంటే ఇష్టమా, వాటి శబ్దాలు వినడం అంటే ఇష్టమా, అయితే మీరు బోనులో పక్షిని పెట్టడం కాదు, ఒక చెట్టును మీ ఇంట్లో నాటి చూడండి.
4. ఎప్పుడూ కూడా….. డబ్బు లేదా పర్సు పెట్టినా, పాకెట్లో మరేవస్తువు పెట్టకండి, ముఖ్యంగా విరివిగా వాడే చేతిరుమాలు అస్సలు పెట్టకూడదు ఎందుకంటే చేతిరుమాలు తీసినప్పుడు పాకెట్ లో ఉన్న డబ్బు పడిపోయే అవకాశాలు ఎక్కువ.
2. Manchi Kapuraniki Manchi Matalu in Telugu (మంచి కాపురానికి మంచి మాటలు)
1. భార్య భర్తలు ఇద్దరూ ఒకే సమయంలో కోప్పడరాదు.
2. ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు కించపరచరాదు.
3. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి ప్రోత్సహించాలి.
4. ఒకరిపై మరొకరికి అనుమానంగానీ సందేహంగానీ ఉండకూడదు.
5. ఏమైనా తప్పుచేస్తే క్షమించాలి, అవసరమైతే క్షమాపణలు కూడా కోరాలి.
6. గతాన్ని తవ్వకూడదు గతం గురించిన ప్రశ్నలు అడగరాదు.
7. కుటుంబమంతా కలిసి ప్రార్థన చేయాలి, మరియు ఒకే సమయంలో కుటుంబమంతా కలిసి భోజనం చేయడానికి ఉపక్రమించాలి.
8. ఎలాంటి ఫంక్షన్ లో అయినా వచ్చిన బంధువులకు మరియు మిత్రులకు మద్యం పోయరాదు, ముట్ట రాదు.
9. పిల్లల దగ్గర తల్లిదండ్రులు మద్యం కానీ సిగరెట్ కానీ తేప్పించుకో కూడదు అలాగే పిల్లల ముందు సిగరెట్ తాగడం మంచి పద్ధతి కాదు.
10. పిల్లల ముందు మందు తాగడం వల్ల పిల్లలకు కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉందని గమనించుకోవాలి.
11. ఒకరినొకరు నొప్పించుకోకూడదు ఒకరు చేసిన పనిని మరొకరు మెచ్చుకోవాలి సరైన మార్గంలో భార్యాభర్తలిద్దరూ మెలుగుతూ సంసారాన్ని చక్కబెట్టుకోవాలి.
12. భార్య భర్తలు ఇద్దరు సంతృప్తితో తమ జీవనాన్ని కొనసాగించాలి .
13. ఇరువురి తల్లిదండ్రులను తమ తల్లిదండ్రులుగా భావించి ప్రేమించి గౌరవించాలి.
14. పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ గొడవ పడకూడదు.
Buy a Book of Apj Abdul Kalam, Online
3. Manchi Health ki Manchi matalu in Telugu (మంచి ఆరోగ్యానికి మంచి మాటలు)
మనలో చాలా మంది ఈ రోజుల్లో రకరకాల కారణాల వల్ల ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలా ఒత్తిడికి గురి కావడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, మరియు హార్మోన్ల అసమతుల్యత సమస్యల ప్రమాదం కూడా ఉంది.
బాగా ఒత్తిడికి గురైన వాళ్ళు అనేక ఆరోగ్య సమస్యల బారిన కూడా పడతారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. కొందరు ఆఫీస్ కారణాలవల్ల ఒత్తిడికి గురి అయితే, మరికొందరు వారి ఆర్థిక పరిస్థితి లేదా ఇంటి పరిస్థితుల కారణంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు.
విద్యార్థులు అయితే పరీక్షలు మరియు వాటి ఫలితాలు కారణంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొన్ని సహజ పద్ధతులు ఉన్నాయి అవేంటో చూద్దాం.
1. మీరు బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఒంటరిగా ఉండరాదు. మీ కుటుంబ సభ్యులతోనో, స్నేహితులుతోనో లేదా మీకు ఇష్టమైన వారితోనో సరదాగా కాలం గడపాలి.
2. బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం. టీవీ లేదా మొబైల్స్ లో కామెడీ సీన్స్ చూడడం లేదా ఇష్టమైన సంగీతాన్ని వినడం వంటివి చేయాలి.
3. నిత్యం వీలైనంతవరకూ వ్యాయామం, ప్రాణాయామం, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి.
4. పండ్లు, పండ్ల రసాలు, ఆకుకూరలు, పచ్చని కూరగాయలు వంటి శాకాహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని చాలావరకు జయించవచ్చు.
5. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
6. మీకు బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు పది నిమిషాలపాటు సుదీర్ఘ శ్వాస తీసుకుంటే మీ ఒత్తిడి తగ్గి మీరు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఈ దీర్ఘ శ్వాస తీసుకోవడం అనే టిప్ ని మీరు ఏదైనా Interview అటెండ్ అవుతున్నప్పుడు, లేదా nerves గా feel అవుతున్నప్పుడు, పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందువచ్చు.
4. Manchi Andhaniki, Health ki Manchi Matalu in Telugu (మంచి అందానికి, ఆరోగ్యానికి మంచి మాటలు)
1. పళ్ళు శుభ్రంగా తెల్లగా ఉండాలంటే వారానికి ఒకసారి వాటిని టేబుల్ సాల్ట్ కానీ బేకింగ్ సోడాతో కాని తోముకోవాలి.
2. కమలా పండు రసం కి కొంచెం తేనె కలిపి చేతులకు రాసుకుంటే అరచేతులు మృదువుగా తయారవుతాయి.
3. నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి పొడి చేసి నీటిలో కలిపి మొహానికి రాస్తే మొటిమలు తగ్గుముఖం పట్టి జిడ్డు కారటం తగ్గుతుంది.
4. టమాటా రసం చర్మానికి రాసుకుంటే స్వేద గ్రంధులు పేరుకున్న మురికిని శుభ్రపరచి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.
5. చేతులు నునుపుగా అవడానికి నిమ్మరసం మరియు రోస్ వాటర్ను సమానంగా కలిపి ఆ ద్రవంతో చేతులు రుద్దుకుంటే చేతులు అందంగా కనబడతాయి.
6. గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి కొన్ని నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది .
7. చుండ్రు మాయం అవడానికి యూకలిప్టస్ నూనెలో ముంచినా దూదిని తీసుకుని తల మీద బాగా రుద్ది వేడినీటిలో ముంచిన బట్టను కొద్ది నిముషాలు తల మీద వుంచి, తరువాత షాంపుతో స్నానం చేయాలి.
8. జిడ్డుగా ఉన్న మొహానికి యాపిల్ గుజ్జును పట్టించి పావుగంట తర్వాత కడుక్కుంటే బుగ్గలు ఆపిల్ పళ్ళలా నునుపుగా అవుతాయి.
9. వేపాకును ఉడకబెట్టిన నీటిలో కొంచెం పసుపు కలిపి మొహాము, చేతులను కడుక్కోవడం వల్ల అవి కాంతివంతంగా ఉంటాయి.
10. ముల్లంగి రసానికి సమంగా మజ్జిగ కలిపి రాసుకుని పావుగంట ఆగి స్నానం చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు పోతాయి.
11. ముల్లంగి దుంప ముక్కలకు కొంచెం ఉప్పు చల్లి….. తేలు కుట్టిన చోట కాసేపు ఉంచితే ఆ విషము వల్ల కలిగే బాధ తగ్గుతుంది.
12. తులసి ఆకు వేసి ఒక రాత్రంతా నిల్వ ఉంచిన నీటిని ఉదయం లేచి ముఖం కడుక్కున్న తర్వాత తాగితే మలబద్దకం వంటి దోషాలు హారించి రక్తశుద్ధి కూడా జరుగుతుంది.
13. వేడి పదార్థాలను గాజుసీసాలో పోసేటప్పుడు సీసాను చెక్క పెట్టె పైన పెట్టి పోయండి అప్పుడు సీసా పగిలే ప్రమాదం ఉండదు.
14. కొండ ఉసిరి కాయలను ఎండబెట్టి పొడి చేసి పరగడుపున ప్రతి ఉదయం ఒక స్పూను పొడిని తీసుకొంటే స్త్రీలకు ఋతు సంబంధమైన అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.
15. విషం కలిగిన కీటకాలు కుట్టినప్పుడు కరివేపాకు కాయ రసంతో నిమ్మరసం సమపాళ్లలో కలిపి పూస్తే నొప్పి తగ్గుతుంది.
16. ఆవు పాలకు బెల్లం కలిపి వేడి చేసి త్రాగితే వ్యాధులు నయమవుతాయి .
17. చేతులు పని వల్ల మొరటుగా అందవిహీనంగా తయారైతే నిమ్మరసంలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు మృదువుగా మారతాయి .
18. నిమ్మరసాన్ని పాదాలకు రాసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే పాదాలకు పట్టిన మురికి పోతుంది.
19. సబ్బుతో తలస్నానం ఎన్నడు చేయకూడదు అలా చేస్తే డాండ్రఫ్ పోదు, ఎప్పుడూ షాంపూతో నే తలస్నానం చేయాలి.
20. మొటిమలు పోవడానికి జీలకర్రపొడి లో కొద్దిగా నీళ్ళు కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకుని తడిఆరాక మొహం కడుక్కోవాలి.
21. సన్నగా ఉన్నవారు లావు అవ్వాలనుకుంటే అరటి పండ్లు అధికంగా తినాలి.
5. Sampada Kosam Manchi Matalu in Telugu (దీపారాధన గురించి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు)
మీ ఇంట్లోకి ఏ వైపు నుంచైనా దీపకాంతి ప్రవేశిస్తుంది. ఈ దీపకాంతి ప్రక్క ఇంటిలో వెలిగించిన లైట్లు వల్ల కానీ మరియు ఇంటి చుట్టుపక్కల ఏదైనా ప్రార్థనా మందిరాలు కానీ దేవాలయాలు కానీ ఉన్నప్పుడు అక్కడ వెలిగించిన దీపకాంతి కానీ లైట్ల కాంతి గాని మీ ఇంట్లో పడుతూ ఉంటుంది. ఇలా దీపకాంతి మీ ఇంట్లో పడడం వల్ల, అది మీకు కొన్ని సార్లు సత్ఫలితాలనిస్తుంది మరికొన్ని సార్లు దుష్ఫలితాలనిస్తుంది. చెడ్డ ఫలితాలు సంభవిస్తాయని అనుకున్నప్పుడు మీ ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేసి ఆ కాంతి మీ ఇంట్లో పడకుండా చేసి సత్ఫలితాలు పొందండి.
దేవుని గుడి, ప్రార్థనా మందిరాల్లో వెలువడే దీపకాంతులు ఏ వైపు నుంచి ప్రవేశించినా కష్టనష్టాలు కలుగుతాయి. వీధి వాకిలి లో నుంచి మీ ఇంట్లోకి ఈ దీప కాంతి ప్రవేశిస్తే మరింత హాని కలుగుతుంది. సాధ్యమైనంత వరకూ ఆ దీపకాంతులు మీ ఇంట్లోకి చొరబడకుండా చూసుకోండి.
మీ చుట్టుపక్కల ఏ దిశలో నైనా బ్రాహ్మణుల ఇల్లు ఉండి, మీ ఇంటి దీపకాంతి ఆ ఇంట్లో ప్రవేశించినట్లయితే సంపదలు క్రమంగా వారింటికి చేరిపోతాయి…….. అందుకు మూయడానికి అవకాశం ఉన్న తలుపులు కిటికీలను ఎల్లప్పుడూ మూసి ఉంచండి.
మీ ఇంట్లో వెలిగించిన దీపాలు తూర్పుముఖంగా ఉత్తరముఖంగా పెట్టినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.
ఇంట్లో పడమర దిశలోగాని దక్షిణ దిశలోగాని దీపాలు వెలిగించిపెట్టినా క్రమంగా ఇంట్లో సంపద అంతా క్షీణించి పోతుంది.
దీపకాంతి నాలుగు దిశల ప్రశ్నిస్తుంటే మీ ఇంట్లో సిరి సంపదలు లభిస్తాయి.
సంధ్యా దీపం మొదలు ఉదయం వరకు ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
సంధ్యా సమయంలో ఇంటి వెనుక గుమ్మానికి ఎదురుగా ఉండే తులసికోట ముందు ప్రతి రోజు దీపం వెలిగించినా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.
ప్రతీ ఇంట్లో పూజా మందిరం ఉంటుంది. ఆ పూజా మందిరంలో ఉదయం సాయంకాలం దీపం వెలిగిస్తూ ఉండడమే దీపారాధన, ఈ విధంగా దీపారాధన చేసిన ప్రతి ఇంట్లో సిరులు పొంగిపొర్లుతుంటాయి.
Read also…..