Home » General Topics » Avise Ginjalu Uses in Telugu | Nutritional Benefits, for Hair Growth, Weight Loss

Avise Ginjalu Uses in Telugu | Nutritional Benefits, for Hair Growth, Weight Loss

కొన్ని వందల సంవత్సరాల నుంచి అవిస గింజలని మన పూర్వీకులు విరివిగా ఉపయోగిస్తున్నారు. అవిస గింజలుని సూపర్ ఫుడ్ గా కూడా చాలా మంది శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈరోజుల్లో కూడా అవిసె గింజలని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

  • Avise ginjalu in English = Flax seeds or  linseed
  • Avise plant scientific name = Linum usitatissimum

Avise Ginjalu Uses in Telugu

ఇప్పుడు మనం అవిసగింజల యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. అవిస గింజలలో న్యూట్రియన్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి.

2. ప్రాచీన యుగం నుంచి ఆధునిక యుగం వరకు అవిసగింజల యొక్క ప్రయోజనాలను మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అవిస పంట చాలా పురాతన కాలమైనా పంట, అవిస గింజలు మనకు రెండు రకాలుగా,
(గోల్డెన్ మరియు బ్రౌన్ రంగులలో) మనకు లభిస్తున్నాయి. రెండూ కూడా ఎక్కువ ఆరోగ్యకరమైనవే.

Avesa ginjalu uses in telugu
Avise ginjalu uses in Telugu

3. ఒక టేబుల్ స్పూన్ లో సుమారు ఏడు గ్రాముల అవిస గింజలు లభిస్తాయి. ఒక్క టేబుల్ స్పూన్ అవిసగింజలలో మన శరీరానికి కావలసినంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైటరీ ఫైబర్స్, ఇంకా విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి.

4. అవిస గింజలలో జీర్ణానికి అవసరమయ్యే తగినంత పీచు పదార్థం కలిగి ఉండడం వలన వీటిని ఎక్కువగా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు తీసుకుంటారు.

5. అవిసె గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో కొవ్వును తగ్గించుకుని, స్థూలకాయం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

6. అవిసె గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. అవిస గింజలను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవల్స్ను కంట్రోల్ చేయవచ్చు.

7. అవిస గింజలు ఎక్కువ స్థాయిలలో ప్రోటీన్ నిల్వలు కలిగి ఉన్నందున. ప్రోటీన్ లోపం ఉన్నవారు అవిసగింజలని వారి ఆహారంలో స్వీకరించవచ్చు.

8. అవిస గింజలు ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు తద్వారా తక్కువ ఆహారం తినడం వలన ఎక్కువ బరువు పెరగకుండా అదుపులో పెట్టుకోవచ్చు.

9. అవిసె గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నవారు అవిసె గింజల్ని తీసుకోవడం ద్వారా కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.

10. అవిసె గింజల నుంచి తీసిన నూనెను అనేక రకాల ఆహార పదార్థాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.

Buy Best Quality Avise Ginjalu Online

11. అవిసె గింజల నూనెను, పెరుగుతో కలిపి తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

12. అవిస గింజల నూనె తో బ్రెడ్ టోస్ట్ చేసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకొని శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

13. అవిస గింజల నూనెను రోజు మనం తాగే నీటిలో కలుపుకొని సేవించడంద్వారా అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.

14. అవిసె గింజల నూనెను ఆలివ్ ఆయిల్ బదులుగా సలాడ్ లో కూడా ఉపయోగించుకోవచ్చు.

15. అవిసె గింజల నూనెను వంటనూనె బదులుగా మనం రోజూ తినే ఆహార పదార్థాలలో మరియు వంటలలో కూడా ఉపయోగించుకోవచ్చు.

Flaxseeds nutritional Value (USDA)

Avise ginjalu for weight loss in Telugu

అవిసె గింజలలో మన శరీరానికి అవసరమైన స్థూల మరియు సూక్ష్మపోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వీటిలో ఫైబర్ (పీచు పదార్ధం), ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి అధికంగా ఉన్నాయి.

వీటిలో అధిక పోషకాలు ఉన్నప్పటికీ, మన శరీర బరువును పెంచే క్రొవ్వు పదార్ధాలు, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతరీతర చేడు క్రొవ్వు ఆమ్లాలు చాల తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా అవిసె గింజలని ఆహారంగా తీసుకున్న వెంటనే వీటిలో ఉండే అతితక్కువ క్రొవ్వు పదార్ధాలు కూడా అవిసె గింజలనుంచి అంత తొరగా శరీరం ద్వారా సులభంగా గ్రహించబడవు. అందుకే ఇవి తినిన వెంటనే రక్తంలో చక్కర శాతం ఒక్కసారిగా పెరుగదు.

ఇందులో ఉండే పీచు పదార్ధం మన జీర్ణక్రియ యొక్క పనితీరును మెరుగు పరుస్తుంది, ఈ పీచు పదార్ధం జీర్ణమై మిగిలిన మలంతో కలిసి సులువుగా మలవిసర్జన జరిగేలా సహాయపడుతుంది. మలబద్దకంతో బాధ పడేవారు మరియు శరీర బరువుని తగ్గించుకోవాలి అనుకునే వారికీ ఈ అవిసె గింజలు మంచి ఆహార పదార్ధం.

Avise ginjalu for Hair growth in Telugu

అవిసె గింజలను శతాబ్దాలుగా మంచి పోషకాహారంగా మరియు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఉపయోగించ బడుతున్నాయి. ఇప్పుడు వీటిని ఇతర ప్రయోజనం కోసం కూడా ఉపయోగించ వచ్చు అని అధ్యయనాలలో తేలింది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు అవిసె గింజలు చాల ప్రాముఖ్యత వహిస్తాయి.

అవిసె గింజలు మన జుట్టు రక్షణకు మరియు పెరుగుదలకు అవసరమగు అన్ని రకాల పోషక పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా బి-విటమిన్స్ మరియు విటమిన్-సి తో పాటు మన జుట్టు వృద్ధికి తోడ్పడే alpha-linolenic acid (ALA), అనే క్రొవ్వు పదార్ధం అధికం గా ఉంటుంది.

అవిసె గింజలను ఉపయోగించి నూనెను తీసి దానిని తలకు పట్టించిన లేదా వాటిని బాగా నానబెట్టి తిన్నా కూడా జుట్టుకు కావలసిన పోషకాలు పూర్తిగా అందుతాయి అని నిపుణుల నమ్మకం. ఈ రెండిటిలో మీరు ఏది చేసిన మీ జుట్టు మరింత మెరుగ్గా ఎదుగుదలను చూపుతుంది మరియు జుట్టు మొదుళ్ళు బలంగా మారుతాయి కూడా.

మన శరీరానికి సంభవించే శోధమును (Inflammation) అవిసె గింజలలో ఉండే alpha-linolenic acid (ALA) అతివేగంగా నిర్ములిస్తుంది. మన శరీరం ఏదైనా వత్తిడికి గురైన లేదా మనకు పడని పదార్ధాలు తిన్నా శరీరం లో శోధము కలుగుతుంది, ఇది మన జుట్టును రాల్చే అంత ప్రభావానికి కూడా దారితీస్తుంది. కావున, మనం రోజువారీ ఆహరం లో కొంతవరకైనా అవిసె గింజలను చేర్చుకోవడం అనేది ఒక ఆరోగ్యకరమైన మార్పు.

How to use flaxseeds for your hair in Telugu

అవిసె గింజల యొక్క జుట్టును పెంచే లక్షణాలను మన సొంతం చేసుకోవడానికి మనకు వాటిని మనం చాల రకాలుగా వినియోగించుకోవచ్చు.

అవిసె గింజలనుంచి నూనెను తీయడం కూడా సాధ్యమే. మనకు వీటి నుంచి తీసిన నూనె ఆన్లైన్ లో కూడా లభిస్తుంది లేదా మనకు దగ్గరిగా ఉన్న గ్రోసరీ షాప్స్ లో కూడా పొందవచ్చు.
అవిసె గింజలను తలకు నూనె రూపంలో పట్టించడంతోనే కాకుండా, వీటిని నానబెట్టి బాగా చూర్ణం చేసుకుని దానిని ఆహరంగా తీసుకున్న కూడా జుట్టు పెరుగుదలలో మంచి ఫలితం కనబడుతుంది.

మనకు లభించే అవిసె గింజల నూనె మనం కొబ్బరి నూనెకు బదులుగా కూడా ఉపయోగించవచ్చు. మనకు వాటి వాసన నచ్చకపోతే కనీసం తల స్నానికి 20 నిమిషాల ముందైనా తలకు పట్టించి తరువాత స్నానం చేయవచ్చు.

ఇందులో ఉండే ఆంటియాక్సిడెంట్స్ జుట్టు మొదళ్లలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను (విషపూరిత రసాయనాలను) పూర్తిగా ఎలా 20 నిమిషాలలో నిర్ములిస్తుంది.

ఫ్రీ రాడికల్స్ మాములుగా జుట్టు మొదళ్ళలో ఉండే కణజాలాన్ని చంపి జుట్టుని రాలెలా చేస్తాయి. అందుకని ఎప్పటికప్పుడు జుట్టుకు మంచి ఆంటియాక్సిడెంట్స్ ఉండే ఆయిల్ లేదా కండిషనర్ ను పట్టించడం ఒక ఆరోగ్యకరమైన లక్షణం.

Beneficial Facts about Flax seeds

You may not be aware that flaxseeds have more than just health benefits; they can also help you grow thick, lustrous hair.

Over the past few years, exploiting the beneficial properties of flaxseed for scalp health and hair growth has become quite common.

Both women and men all over the world have started including flaxseed in their regular diets and developing creative ways to apply it to their hair in order to get a natural look.

Omega-3 fatty acids, especially alpha-linolenic acid (ALA), which reduces inflammation and improves blood circulation, are abundant in flaxseeds. Hence, it is a particularly amazing ingredient for maintaining healthy skin, hair, and bones.

Vitamin E, which is found in flaxseeds, reduces the impact of free radicals on your scalp and encourages the growth of hair follicles, which results in thicker hair.

They are advantageous for the health of the scalp because they contain omega-3 fatty acids that reduce inflammation or itchiness.

Antioxidants and growth stimulants, which are present in all plant-based oils, help to increase hair growth and decrease hair loss.

Applying flaxseed oil to your hair may help seal the cuticle, stop follicle and hair breakage brought on by free radicals, and stimulate the best possible hair growth.

I hope you enjoyed reading the information on Avise ginjalu beneficial properties in Telugu language. If you need to read other articles published on our website, go through some of the trending articles listed below.

Kodo Millet Dondakaya benefitsJalaga English name
Panasakaya benefits Gasagasalu benefitsFacts about Panasa Pandu
Ulavalu benefitsMinapappu benefitsKandipappu uses
Vamu nutitional factsMackerel fish Foxtail Millets, Telugu Facts
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram