Home » General Topics » Pesara Pappu in English, Benefits, Its Other names

Pesara Pappu in English, Benefits, Its Other names

There are several split pulses in India, which are frequently used in dishes. In India, one of the golden color pulses is known as pesarapappu in English and is used for a variety of purposes.

What do we call pesara pappu in English?

Green Gram,

Moong dal,

Jaigo Yellow Gram,

Green gram split: The pulse, which is split into two parts and looks yellow or golden yellow in color.

Green gram whole: the whole pulse without spilling into two parts.

Pesarapappu in English word
Pesarapappu in English

About Pesara pappu in English

  • Green gram cleanses the body and improves the metabolism and immune system.
  • It aids in the reduction of high cholesterol levels in the bloodstream.
  • Green Moong reduces bad cholesterol and improves artery and vein flexibility when consumed regularly. It also helps to control blood pressure.
  • Read more about the uses of pesara pappu in English, below.

Buy Best Organic Pesara Pappu Online

Pesarapappu uses in Telugu

పెసరపప్పు మన భారతీయ ఆహార ధాన్యాలలో ఒకటి. మన పూర్వీకులు పెసరపప్పును విరివిగా తమ ఆహార పదార్థాలలో వాడేవారు. దీనిని హిందీలో మూంగ్ దాల్ అని పిలుస్తారు. అధిక మోతాదులో ప్రోటీన్లు ,కాల్షియం పాస్పరస్ మరియు పిండి పదార్థాలు కలిగి ఉండడం వలన దీన్ని శక్తివంతమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పెసరపప్పు మంచి విటమిన్లు మరియు మంచి పోషక విలువలున్న ఆహార పదార్థం. పెసరపప్పును ఆహారంలో భాగంగా తీసుకొంటె శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎండా కాలంలో పెసర పప్పును తీసుకోవడం వల్ల వడదెబ్బ చమట కాయలు వంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది .

పెసరపప్పు అనగానే మనకు గుర్తొచ్చే ఆహారపదార్ధం పెసరట్టు. అంతే కాకుండా పెసరపప్పుతో మనం అనేక రకాల ఆహార పదార్థాలుతయారు చేసుకోవచ్చు.

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు గానీ పెద్ద వారికి గాని మొలకెత్తిన పెసరపప్పు గింజలని ఆహారం ద్వారా ఇవ్వడం వలన పౌష్టికాహార లోపం వలన కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పొట్టుతో ఉన్న పెసరపప్పును తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని అందిస్తోంది.

ముడి పెసరపప్పులో అనేక రకములైన ప్రొటీన్లు, విటమిన్లు కార్బోహైడ్రేట్లు అత్యధిక మోతాదులో ఉంటాయి మరియు ఉడికించిన వాటిలో 100% క్యాలరీల కంటే తక్కువగా ఉంటాయి.

Mudipesara pappu in English
Mudi pesarapappu in English

పెసరపప్పు తో తయారు చేసుకునే ఆహార పదార్థాలు: పెసరట్టు, పెసర పాయసం, పెసర పునుగులు, పెసర పప్పు పప్పు.

పెసరపప్పును తీసుకోవడం ద్వారా ఇది మన శరీరానికి రక్షణ కల్పించడమే కాకుండా మన జుట్టు మరియు చర్మం ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతాయి.

బరువు తగ్గించుటకు:

ముడి పెసరపప్పును మన అల్పాహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా మనం కొంచెం ఆహరం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని మనకు కలిగించడం ద్వారా త్వరగా ఆకలి కానివ్వకుండా మన శరీర బరువును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది.

ముడి పెసరపప్పు తో చేసిన కూరను రాత్రిపూట చపాతి లతో పాటు తీసుకోవడం ద్వారా ఇది మనకు అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రతి రోజు పెసర పప్పులో కాసిన్ని బియ్యం కలిపి పులగం తయారు చేసుకొని తినడం ద్వారా అధిక మోతాదులో బరువును తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

అధిక రక్తపోటును తగ్గించుటకు:

పెసరపప్పును తీసుకోవడం వలన అవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల స్థాయిని తగ్గించి అధిక రక్తపోటు ను నివారించడంలో తోడ్పడుతుంది.

శిరోజాలను వృద్ధి చేయుటలో

పెసర పప్పు లో వుండే న్యూట్రియన్స్ మరియు ప్రొటీన్లు వలన ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి సహాయ పడుతుంది.

అందువలన హెయిర్ ఫాల్ జుట్టు రాలే సమస్య లు ఉన్నవారు మొలకెత్తిన పెసర్లు పప్పును తినడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

డయాబెటిస్ క్రమబద్దీకరించుటలో:

చక్కెర వ్యాధి అనగా షుగర్ వ్యాధి ఉన్నవారు పెసరపప్పును తమ ఆహారంలో తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న డైటరీ ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవ్వడం ద్వారా రక్తంలో ఒక్కసారిగా విడుదలయ్యే గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గించే డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది.

జీర్ణక్రియ మెరుగు పరుచుటలో:

పెసరపప్పును తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనేక రోగాలను ఎదుర్కొనే యాంటీ బాడీస్ ని మన శరీరం లో విడుదలల చేస్తుంది, అందువలన ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం.

కండరాల నొప్పిని తగ్గిస్తుంది: హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారు పెసర పప్పు ను రోజు తమ ఆహారంలో తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్ధీకరణ చేయడమే కాకుండా కండరాల నొప్పి, తలనొప్పి మరియు నీరసాన్ని తగ్గిస్తుంది.

కంటి చూపు మెరుగు పరుచుటలో:

కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు రోజూ పెసరపప్పు తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు దరిచేరవు.

ఐరన్ లోపం ఉన్నవారు:

ఐరన్ లోపంతో బాధపడేవారు వారి రోజువారి ఆహారంలో పెసరపప్పును తీసుకోవడం ద్వారా ఐరన్ లోపం నుంచి బయట పడొచ్చు .పెసర పప్పు లు అధిక మోతాదులో ఐరన్ శాతం ఉండడం వలన అనీమియా వంటి వ్యాధులతో బాధపడేవారు పెసరపప్పును వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి కూడాను బయట పడవచ్చు. ముఖ్యంగా శాకాహార ఆహార విధానం అవలంబించేవారు పెసరపప్పును రోజూ తీసుకోవడం ద్వారా ప్రోటీన్ల శాతం అధికంగా లభిస్తుంది.

చర్మ రక్షణ కొరకు:

పెసరపప్పు లో చర్మాన్ని కాపాడే విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా పెసరపప్పులో విటమిన్ బి విటమిన్ సి మాంగనీస్ వంటి ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి.

సూర్యుడు ద్వారా ప్రసరించే అల్ట్రా వైలెట్ రేస్ అతినీలలోహిత కిరణాలు మరియు పర్యావరణం లోని కాలుష్యం ద్వారా వెలువడే దుమ్ము శరీరం లోనికి చొచ్చుకొని పోకుండా పెసరపిండి కాపాడుతుంది.

అందువలన పెసరపప్పును అనేక రకాల సౌందర్య ఉత్పత్తుల లో మరియు చిన్నపిల్లలు పెద్ద వారు ఉపయోగించే సున్నిపిండి తయారీలోనూ విరివిగా వినియోగిస్తారు.

సున్నిపిండిని తరుచూ స్నానానికి ముందు శరీరానికి పట్టించడం ద్వారా చర్మం పైన గరుకుదనం పోయి మృదుత్వం సంతరించుకుంటుంది .

పెసర పప్పు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కణాలు శరీరంలో అభివృద్ధి చెందకుండా రక్షణ కల్పిస్తాయి.

అధిక మొత్తంలో డైటరీ ఫైబర్:

పెసరపప్పు లో అధిక మోతాదులో పీచు పదార్థం డైటరీ ఫైబర్ ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది . పెసరపప్పుని మన రోజువారి ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో చురుకుదనం పెరిగి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

అంతేకాకుండా ఈ డైటరీ ఫైబర్ శరీరంలో నిల్వ ఉన్న అధిక మోతాదు క్రోవ్వు లను తగ్గించడం వలన ఊబకాయo బారిన పడకుండా ఉండి గుండె సంబంధిత వ్యాధులను ను తగ్గిస్తుంది. అందువలన హార్ట్ ఎటాక్ వంటి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే హృద్రోగులు పెసరపప్పునుతమ రోజువారీ ఆహారంలో తీసుకోవడం మంచిది.

Uses of Pesara pappu in English

  • Moong dal is good for healthy eyes.
  • The supplement of green gram helps to promote bone growth and muscle development.
  • It improves cognitive functioning.
  • It provides high energy as it is high in protein as well as vitamins.
  • It restricts anti-tumor activity.
  • It is used to reduce the risk of chronic disease.
  • Pesara Pappu helps prevent heat stroke.
  • Ideal for pregnant women:
  • As pesarapappu is rich in protein, it is an alternative food for vegetarians:
  • Pesarapappu helps lower blood pressure.
  • The consumption of green grams reduces blood pressure.
  • Blood sugar levels are controlled if you eat whole grains regularly.

Read Similar Posts:

Roop Chand Fish in TeluguModuga Chettu in Telugu, English, and Uses
Munagaku Uses or Benefits in TeluguThalli Palu Prayojanalu
Yaksha Prashnalu in TeluguTelugu Samethalu for Whatsapp
Telugu to English conversation topicsTenali Ramakrishna Stories
Honey benefits in TeluguTelugu Podupu Kathalu with Answers 
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram

Instagram