Home » General Topics » Rohu Fish in Telugu (తెలుగులో) and Its Benefits (Good or Bad for Health)

Rohu Fish in Telugu (తెలుగులో) and Its Benefits (Good or Bad for Health)

రోహు ఫిష్ మన అందరికి తెలిసిన చేప ఇది ఎక్కువగా మంచినీటిలో ఉంటుంది. మంచినీటిలో అంటే ఎక్కువగా చెరువుల లోనూ, నదుల లోను, సరస్సుల లోను, పెద్ద పెద్ద గుంతలు లోనూ దొరుకుతుంది. దీనిని ఎక్కువగా సాగు కూడా చేస్తారు ఇది మనకు మార్కెట్లో లభించే చేపలలో ఒక ముఖ్యమైన చేప. మన భారతదేశంలో మనకు దొరికే మూడు ముఖ్యమైన చేపలతో దీనిని ప్రధమ చేపగా చెప్పవచ్చు.

Rohu Fish in Telugu Name

రోహు ఫిష్ ని తెలుగు లో సీలావతి చేప లేదా గండి చేప అని మరి కొన్ని ప్రాంతాలలో బొచ్చలు, జ్ఞాడు మీను, రోహితాలు అని అంటారు.

రోహు ఫిష్ ని ఇంగ్లీష్ లో Roho labeo, Labeo rohita అని అంటారు

BUY FISH SCALE REMOVER ONLINE

Rohu fish in Telugu and English

Buy Fishing Nylon Net Online

Information about Rohu Fish in Telugu

ఇది ఎక్కువగా చిన్న చిన్న చేపలను, నీటిలో లభించే పురుగులను, మెత్తటి పచ్చికను, చిన్నపాటి విత్తనాలను ఆహారంగా తీసుకుంటుంది, అందుకుగాను దీనిని సర్వ భక్షక జీవుల (ఓమ్నివౌరే) వర్గంలో చేర్చారు. సర్వ భక్షక జీవి అంటే, ఆహారంగా మాంసాహారాన్ని మరియు శాకాహారాన్ని భుజించే జీవి అని అర్థం. ఈ చేపను ప్రతి ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా ఆహారంగా తీసుకోవచ్చునని పరిశోధనల పరంగా తెలిసింది. ఈ చేప మాంసం లో మనకు ఎక్కువగా కావలసిన ఒమేగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ మరియు క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. చాలామంది మన భారతదేశంలో ఈ చేపను వారానికి కనీసం ఒకసారి తినుటకు అలవాటు పడతారు, దీనికి కారణం ఇది స్వచ్ఛమైన మంచినీటి చేప. మనకు మాసంలో లభించని లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు, క్రొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, దీనిద్వారా అధిక మోతాదులో లభిస్తాయి. చేపలు ఎక్కువగా తినడానికి ఇష్టపడే వారిని పిషిటేరియన్ అని అంటారు.

ఇది ఇతర దేశాలలో కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కావున, మన భారతదేశంలోనూ, అటు ఇతర దేశాలలోనూ, ముఖ్యంగా అమెరికాలో దీనిని ఆక్వాకల్చర్ ఫిషరీస్ లో భాగంగా ఎక్కువగా సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారు. మన దేశంలో రోజుకు కనీసం ఐదుకోట్ల కేజీల చేప మాంసం అమ్ముడు పోతుంది అంటే ఆశ్చర్యపడనవసరం లేదు.

చాలామంది చేపలను తినుటకు నిరాకరిస్తారు ఎందుకంటే చాలా వరకు చేపలు విషపూరితమైన లవణాలను మరియు రసాయనాలు కలిగి ఉండటమే కారణం. ఈ రోహు ఫిష్ మాత్రం అన్నీ చేపలలా విషపూరితమైన రసాయనాలను ముఖ్యముగా మెర్క్యురీ ని చాలా తక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. ఇతర చేపలలో అధికంగా ఉన్నటువంటి ఈ మెర్క్యురీ అనబడే రసాయనం రక్తపోటుకు, మెమరీ లాస్ కు, కంటి చూపు తగ్గించుటలో ఎక్కువ పాత్ర వహిస్తుంది. అందుకని చేపను ఆహారంగా ఎంచుకోవడంలో మనము చాలా జాగ్రత్త వహించాలి.

BUY FISH CUTTING KNIFE ONLINE

Uses/ Benefits of Rohu Fish in Telugu (రోహు ఫిష్ యొక్క ఉపయోగాలు)

కొన్ని పరిశోధన పత్రికలను బట్టి అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ, చెప్పింది ఏమిటంటే, ఎవరైతే ఎక్కువగా చేపలను మాంసాహారంగా ఎంచుకుంటారో వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి మరియు మరణాల సంఖ్య తక్కువగా ఉంటుంది.

దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన ఇది మన శరీరంలో వచ్చే రుగ్మతలను  తగ్గించడం, గుండెకు సంబంధిత సమస్యలను తగ్గించడం, ప్రోటీన్స్ లోపం వల్ల వచ్చే వ్యాధులను రానివ్వకుండా కాపాడడం, మరియు తదితర వ్యాధులను రానివ్వకుండా మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

దీనిలో EPA, DHA, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించడం వల్ల దీనిని తిన్న వారికి వారి శరీరంలో రక్త ప్రసారం చాలా మెరుగు పడుతుంది. రక్త ప్రసారం మెరుగు పడటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరంగా ఉంటాయి.

Table: Rohu fish benefits in Telugu

Buy Wow Omega 3 Fish Oil

Vitamin A కంటిచూపును మెరుగుపరుస్తుందని మనకు అందరికి తెలుసు. ఇందులో అధిక మోతాదులో Vitamin A ఉండడంవల్ల దీన్ని తిన్నవారిలో కంటిచూపు మెరుగవుతుంది.

రోహు ఫిష్ ని తినేవారిలో రే చీకటి వల్ల కలిగే ఇబ్బందులు కూడా చాలా వరకూ తగ్గుతాయి.

ఈ చేపలలో విటమిన్-D తో పాటుగా అధికంగా క్యాల్షియం కూడా లభిస్తోంది అందుకని ఈ చేప తినడం వలన కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొంతవరకూ ఉపశమనం పొందవచ్చు.

రోహు ఫిష్ ఒక యాంటీ-ఏజింగ్ ఏజెంట్, ఇది ఎక్కువగా తిన్నవారు వారి యొక్క చర్మాన్ని త్వరగా ముడతలు పడకుండా కాపాడుకుంటారు. అదేవిధంగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎక్కువగా ఉండటం వలన ఇది మనం బయకు వెళ్ళినప్పుడుమన చర్మాన్ని అల్ట్రా వైలెట్ (UV) కిరణాల నుంచి కూడా కాపాడుతుంది.

ఇది మెదడుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఇందులో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన ఇది తినే వారికి క్యాన్సర్ నుంచి కొంతవరకూ ఉపసమనం దొరుకుతుంది.

మధుమేహంతో బాధపడేవారు ఈ చేపను ఆహారంగా తీసుకుంటే ఈ చేపలో ఉన్నా vitamin D మధుమేహం వల్ల కలిగే కొన్ని సమస్యలను అదుపులో పెడుతుంది. దీనిని తిన్న వారిలో ముఖ్యంగా టైపు-2 డయాబెటిస్ యొక్క ప్రతికూల ప్రభావాలు చాలా వరకు తక్కువగా కనిపిస్తాయి అని కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలో తెలియజేశారు.

విటమిన్ C కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందుచేత విటమిన్-సి లోపంవల్ల బాధపడేవారు ఈ చేపను వారి యొక్క మాంసాహారం గా ఎంచుకోవచ్చు.

ఎవరైతే ఎక్కువగా జిమ్ముకి వెళ్లి కసరత్తులు చేస్తారో వారికి కూడా ఈ చేప మంచి మాంసాహారం.

చివరిగా… ఇందులో మనకు ఉపయోగపడే అన్ని పదార్థాలు లభించటం వలన దీనిని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకోవడం మంచిది.

A few points about Rohufish in English

  • The rohu, rui, or roho labeo is a fresh water species found in rivers throughout South Asia. It is a large omnivore that consumes almost all of the food available to it.
  • Rohu is a river fish. It is considered to be a good source of vitamin C, which is necessary for good health. It protects against colds and coughs, as well as other diseases that are linked to them.
  • Rohu, also called Carpo fish, is a protein-rich fish. Omega 3 fatty acids, as well as vitamins A, B, and C, are abundant in this product.
  • Energy, moisture, protein, fat, carbohydrates, fiber, calcium, iron, and phosphorus are all important nutrients found in 100 grams of ROHU.
  • Rohu is a high-protein, low-fat fish with a big head and tail.
  • It also has a high concentration of minerals like zinc, iron, and calcium, as well as proteins.
  • Labeo rohita is the scientific name for one of the two major Indian carp species used in polyculture systems: Labeo rohita and Labeo rohita.
  • The Indo-Gangetic riverine fauna, which is unique, is found in the north and central India along the rivers of Pakistan, Bangladesh, and Myanmar, as well as their environs.
  • Prevents cough and cold, helps in bodybuilding and growth, improves the function of the circulatory system, reduces heart problems, prevents cancer onset, improves brain function, improves vision levels, maintains skin moisture, etc.

If you find this information helpful, read other articles given beven below.

Roop Chand Fish in TeluguModuga Chettu in Telugu, English, and Uses
Munagaku Uses or Benefits in TeluguThalli Palu Prayojanalu
Yaksha Prashnalu in TeluguTelugu Samethalu for Whatsapp
Telugu to English conversation topicsTenali Ramakrishna Stories
Honey benefits in teluguTelugu Podupu Kathalu with Answers 
Photo of author

Supraja

Hi Friends, thank you for visiting MYSY Media. Myself Supraja, a self-motivated person. I have been blogging since 2019. As a content writer and course mentor, I read a lot and would like to share the knowledge whatever I know with the people who need it. I’ll be writing informative articles or blog posts and getting in touch with my website visitors to increase our online presence. Moreover, this website is not specified for a certain niche. Here you can get information related to various topics including Funny and moral stories, Meaning for words of different languages, Food, Health tips, Job information, Study topics, etc.

Home

Stories

Follow

Telegram

Instagram