Home » General Topics » Sirraku in English (సిర్రాకు ప్రయోజనాలు), Hindi, Kannada, Tamil

Sirraku in English (సిర్రాకు ప్రయోజనాలు), Hindi, Kannada, Tamil

సిర్రాకు అనేది ఒక మంచి ఔషధ గుణాలు కలిగిన ఆకుకూర. ఇది ఆకుకూరలలో ముఖ్యమైన ఆకుకూరగా పిలవబడుతుంది. వీటిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. మనకు ఆకుకూరలు మన భారతదేశంలో విరివిగా లభిస్తాయి. ఆకుకూరలలో ఉండే పోషకాలు ఏ ఇతర ఆహార పదార్థాలలో లభించవు. రామాయణంలో హనుమాన్ అంతటివాడే లక్ష్మణుని ప్రాణాలు కాపాడుటకు సంజీవిని ఆకుల కోసం వెతుకులాడి చివరికి తెలియక సంజీవని పర్వతాన్ని పెకలించి శ్రీలంకకు తీసుకువస్తాడు. అంతటి ప్రాముఖ్యత ఉంది ఆకులకు. ఆకులలో ఔషధ గుణాలు కలిగిన మూలకాలు ఉండడం వలన చాలామంది వైద్యులు ఎక్కువగా ఆకుకూరలను ఆహారంగా తీసుకోమని సలహాలు ఇస్తూ ఉంటారు.

ఈ పోస్టులో మనం సిర్రాకుని ఇంగ్లీషులో ఏమని అంటారు మరియు దాని యొక్క పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

Sirraku in English

Chirraku in English

It is a very popular leafy vegetable available in India, Srilanka, Pakistan, Nepal, Europe, etc. It has several names even in the Telugu language such as Chirraku, Sirraku, Siri Kura, or Perugu thota kuraan. The names of sirraku in English is Tender Amaranth leaves, chaulai, or pigweed.

Other names of Sirraku

Sirraku in Telangana- Koyagura
Sirraku in Hindi – Maat ki Bhaaji
Sirraku in Tamil – Mulai keerai

Benefits of Sirraku in English

  1. It is packed with valuable nutrients essential for good health.
  2. It helps our heart function and improves its life.
  3. It controls body weight and reduces cholesterol in the body.
  4. As it contains a good amount of iron, it prevents the development of anemia.
  5. Leafy vegetables boost insulin production, which controls diabetes.
  6. As it is rich in calcium, which is crucial for bone health and muscle function, it reduces the severity of joint and backbone pains.
  7. It improves digestion and eliminates accumulated toxins from the body.

Health Benefits of Chirraku in Telugu

  • ఇందులోని ఔషధ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి.
  • వీటికి ఇన్సులిన్ ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి.
  • సంతానం కలగడానికి కావలసిన శరీర హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి.
  • రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి మధుమేహ సమస్యలను అదుపులో ఉంచుతాయి.
  • మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ను అదేవిధంగా ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తులను ప్రేరేపిస్తాయి
  • అధిక బరువుతో బాధపడేవారు ఈ ఆకుకూరలను ఆహారంగా తీసుకోవడం వలన చాలావరకు బరువును తగ్గించుకొనవచ్చును

ఈ ఆకుకూర మనకు ప్రతి సీజన్లో లభిస్తుంది. దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి చాలామంది పచ్చి ఆకులను తీసుకొని రసం చేసుకొని పరగడుపునే తాగుతారు, మరికొందరు దీనిని ఉడికించి వివిధ రకాల కూరలలో వేసుకుని ఆహారంగా తీసుకుంటారు.

ఈ ఆకుకూరలో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, మరియు తగిన మోతాదులో పిండి పదార్థాలు కూడా లభిస్తాయి. మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా ఈ ఆకుకూరలలో అధిక మోతాదులో లభిస్తాయి.

ఈ ఆకుకూరలు ప్రాచీన కాలంలో విలువైన పంటల మధ్య ఒక కలుపు మొక్కగా పెరిగేవి. అందుకని మన పెద్దలు వీటిని ఒక కలుపు మొక్క గా పరిగణించి…. వేర్లతో పాటు తొలగించేవారు. క్రమేనా వీటిలో పోషక విలువలు ఉన్నాయి అని తెలుసుకుని ఈ మధ్యకాలంలో వీటిని పోషక పదార్థాలు కలిగిన విలువైన ఆకుకూరగా పరిగణించి చాలామంది రైతులు విరివిగా సాగు చేస్తూ ఉన్నారు.

ఈ ఆకుకూరలలో బీటా కెరటిన్ అధిక మొత్తంలో లభిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఈ ఆకుకూరను తరచూ ఆహారంగా తీసుకోవడం వలన ఇందులో ఉన్న ఐరన్ వారి శరీరంలో రక్త కణాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

మన శరీరానికి మన ఎముకల పటుత్వం ఎంత అవసరమో మనకు తెలుసు. కానీ వయసు పెరిగే కొద్దీ వాటి యొక్క గట్టితనం తగ్గిపోతూ వస్తుంది. ఒక వయసు రాగానే కీళ్ల నొప్పులు మరియు వెన్నెముక నొప్పి రావడం సాధారణమైపోయింది. ఇటువంటి నొప్పులను తగ్గించడానికి మరియు ఎముకల బలాన్ని పెంచడానికి ఆకుకూరలలో క్యాల్షియం అధికంగా లభిస్తుంది. వీటితో పాటుగా మన శరీరంలో తయారయ్యే విషపూరిత పదార్థాలను ఎప్పటికప్పుడు నాశనం చేయడానికి ఆకుకూరలలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది.

Nutrients in Chirraku leaves

Sirraku nutrients in telugu

దీనిలో అధిక మోతాదులో ఐరన్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, అమినోయాసిడ్స్, విటమిన్స్, మరియు డైటరీ ఫైబర్స్ ఎక్కువగా లభిస్తాయి.

ఇందులో అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నాయని చాలామందికి తెలియకపోయినా. దీనిని అనేక రకాల వంటల తయారీలలో ఉపయోగించుటకు ఇది ఎప్పుడు మన వంట గదిలో కనిపిస్తూనే ఉంటుంది. దీనికి కారణం దీనితో తయారుచేసిన వంటకాలు ఒక రకపు సుగంధ పరమైన మట్టి వాసనను, కొంచెం వగరు రుచిని ఇవ్వడం. దీనితో తయారుచేసిన వంటకాలను ఆహారంగా తీసుకోవడంతో ఇటు మాంసాహారులు అటు శాఖాహారులు ఇద్దరూ ఎక్కువగా లబ్ధి పొందుతారు.

దీనితో తయారు చేసే కూరలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డవి

సిర్రాకు పప్పు (Sirraku Pappu)
సిర్రాకు పుల్లగూర (Sirraku Pullagura)
సిర్రాకు తీయకుర (Sirraku Theeyakura)
సిర్రాకు ఫ్రై (Sirraku Fry)
చిర్రాకు తాలింపు (Chirraku Thalimpu)
చిర్రాకు చారు (Chirraku Charu)
చిర్రాకు గోంగూర పల్లగోర (Chirraku Gongura Pullakura)
చిరాకు పచ్చడి (Chirraku Pchadi)

If you like my explanation of “Sirraku in English”, you can read the following posts to learn more

Dosakaya Sorakaya
BeerakayaTaati Munjalu
Guruvinda GinjaBommidala Fish
AnchoviesBocha Fish
Inguva BenefitsRava Kesari Recipe
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram

Instagram