శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడంటే చాలా ఇష్టం. అతని తెలివికి, చతురతకి మరియు సమయస్ఫూర్తికి శ్రీకృష్ణదేవరాయలు ముగ్ధుడై పోయేవాడు.
1. నాణేల గంప నాటకీయం
ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకు రామలింగడి తెలివిని పరీక్షించాలనె ఆలోచన పుట్టింది. అనుకున్న విధంగానే రామలింగడి తెలివికి మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఒక గంప నిండా బంగారు నాణేలను బహుమతిగా రామలింగడికి ఇస్తాడు. ఆ గంప నిండా నాణాలు ఉండడంతో ఆ గంప చాలా బరువుగా ఉంటుంది, ఏ మాత్రం కుదుపు వచ్చినా గంప లో ఉన్న నాణలు అన్నీ కింద పడిపోతాయి, ఎవ్వరూ ఎత్తలేనంత బరువుగా ఉంటుంది ఆ గంప. దాంతో మిగిలిన సభికులు అంతా రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించసాగుతారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా ఆ గంప లేవదు.
ఇలా రామలింగడు కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తన తలకి ఉన్న తలపాగాను తీసి నేలపై పరిచి అందులో కొన్ని నాణాలను తలపాగాలో పోసి మూటగట్టుకుంటాడు, కొన్ని నాణాలను తన జేబులో నింపుకొని, మూటగట్టుకున్న నాణేలను బుజాన వేసుకుని, వెలితి పడిన గంప నెత్తిన పెట్టుకొని నడవడం మొదలు పెడతాడు.
రామలింగనీ సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు” శభాష్ రామలింగా! శబాష్!” అంటూ మెచ్చుకొంటాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తలవంచి నమస్కరిస్తూ ఉండగా ….బరువు కి అతని జేబి లోని నాణేలు నేలమీద పడిపోతాయి. ఆ నాణాల శబ్ధంతో సభంతా మార్మోగి, ఆ బంగారు నాణాలన్నీసభంతా చెల్లాచెదురుగా పడిపోతాయి.
రామలింగడి తొందరపాటుకు సభంతా నవ్వుతారు, దాంతో నెత్తిన పెట్టుకున్న గంపను మరియు వీపున వేసుకున్న మూటను కిందపెట్టి రామలింగడు ఆ జారి పడిపోయిన నాణేల కోసం వెతకడం ప్రారంభింస్తాడు. పడుతూ లేస్తూ నాణాలను ఏరుకుంటున్న రామలింగడినీ చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా చూస్తూ అందరూ తలో మాట అంటారు.
“ఎంత దురాశ పరుడివి రామలింగా నువ్వు ..! రాజుగారు నీకు గంప నిండా బంగారు నాణాలు ఇచ్చినాకూడా నువ్వు కిందపడిపోయిన బంగారు నాణాల కోసం వెతుకుతున్నావు “అని అంటాడు ఆ ఆస్థాన పూజారి”. రామలింగడు మాత్రం ఎవరి మాట పట్టించుకోకుండా..అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి, రాజు గారి సింహాసనం పక్కన మరోకటి అనుకుంటూ సభంతా పరిగెత్తుతూ కింద పడిన నాణేలను ఎరుతాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో “ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు ..!” అంటూ రామలింగడిని దూషిస్తాడు.
రామలింగడు ఎవరి మాటలు పట్టించుకోకుండా నాణలన్నింటిని ఏరసాగుతాడు. రామలింగడు నాణాలున్నింటిని ఏరిన తరువాత రాజు రమలింగనితో ఇలా అంటాడు” రామలింగా..! నేను నీకు గంపెడు బంగారు నాణేలను ఇచ్చాను కదా..! మరి నువ్వు ఎందుకు ఇంత దురాశ పడి కిందపడిన కొన్ని నాణేల కోసం వెతుకుతున్నావు..?. అప్పుడు రామలింగడు రాజుతో ఇలా అంటాడు…” రాజా ఇది దురాశ కాదు నాణేలపైన మీ యొక్క ప్రతిమ మరియు మీ పేరు రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోట నాణేలను పెట్టడం వల్ల ఎవరైనా వాటిని తొక్కి మిమ్మల్ని అవమానించే ప్రమాదం ఉంది. అది నేను సహించలేను కాబట్టి నేను అంత ఆత్రుతగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మూగబోతుంది.
రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకుని. అతనికి మరో గంపెడు బంగారు నాణేలను బహుమతిగా ఇస్తాడు.
ఈ కథ ద్వారా తెలుసుకోవలసింది: సభలోని సభ్యులు లాగా తొందరపడి మాట జారడం ఇతరులు చేసే పనిని కించపరచడం అనేవి వారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి.
Buy Telugu Tenali Ramakrishna Story Book Online
2. రామకృష్ణుని బాల్యం (One of the best Tenali Ramakrishna stories in Telugu)
విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను నియోగి బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యం తో చనిపోతాడు, తండ్రిని కోల్పోయిన రామకృష్ణుడు కి మరియు అతని తల్లికి ఆ గ్రామంలో నా అనువారు ఎవరూ లేకపోవడం వల్ల తెనాలి వాస్తవ్యుడైన ఆమె తల్లి సోదరుడు ఆమెను మరియు రామకృష్ణుని తన వెంట ఇంటికి తీసుకొని పోతాడు. తండ్రి లేని పిల్ల వాడు అవడం వల్ల రామ కృష్ణుడిని అతని తల్లి మరియు మేనమామలు చాలా గారాబంగా మరియు అల్లారుముద్దుగా పెంచుతారు, దాంతో రామకృష్ణుడు చదువు అటకెక్కుతుంది. అతను క్రమేపి చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం ఆరంబిస్తాడు.
అతనికి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చేయాలనుకున్న సొంత మేనమామ మరియు అతని తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. రామకృష్ణుడు చెడిపోతున్నాడని బాధపడి క్రమంగా కొట్టడం కూడా మొదలు పెదుతుంది అతని తల్లి. దాంతో రామకృష్ణుడు ఇంటికి రావడం మానివేసి ఊరిలోని దేవాలయాలలోని, సత్రాలలో కాలం గడుపుతూ ఇంటి మొహం చూసే వాడు కాదు. కొడుకు తిండి తిప్పలు లేక ఇంటి ముఖం పట్టక పూర్తిగా చేతికి అందకుండా పోతున్నాడని తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది.
ఒకరోజు రామకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊరు బయట ఆడుకుంటూ ఉండగా. ఆ సమయంలో ఒక యోగి రామకృష్ణడుని చూస్తాడు. అతనిని చూసి యోగి “ఇంత అందమైన బాలుడు ఇట్లా చెడిపోతున్నాడని భావించి ఇతనిని ఎట్లైనా బాగు చేయాలని, రామకృష్ణుడుని తన వద్దకు పిలిచి అతని కులగోత్రాలు అడిగి తెలుసుకుంటాడు. బ్రాహ్మణ పిల్లవాడు అయిన నీవు చదువు సంధ్యలు మాని ఈ విధంగా ఆటలతో కాలం గడపటం మంచిది కాదు. కనుక నీకు నేను ఒక మహా మంత్రం ఉపదేశిస్తాను. దానిని చదివిన వెంటనే నీవు గొప్ప విద్యావంతుడువి మరియు మంచి పేరు తెచ్చుకుని చక్కని జీవితాన్ని పొందుతావు అని చెప్తాడు. అప్పుడు రామకృష్ణడు “స్వామీ మీరు వెంటనే నాకు ఆ మహామంత్రమును ఉపదేశించండి అని కోరుకుంటాడు. వెంటనే యోగి రామకృష్ణుని వెంటబెట్టుకుని ఒక గుహలోనికి తీసుకుని పోతాడు. అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి రమ్మని రామకృష్ణడుకి ఆ యోగి ఆదేశిస్తాడు.
రామకృష్ణుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ యోగి రామకృష్ణునికి ఆ మహా మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. తర్వాత ఆ యోగి రామకృష్ణుడిని చూసి “కుమారా నీవు ఈ మంత్రమును మీ గ్రామమునందు ఉన్న మహాకాళికా మాత గుడి లో కూర్చుని భక్తి శ్రద్ధలతో జపించుచూ” దేవి అనుగ్రహం నీవు తప్పక పొందగలవు నీకు శుభం కలుగుతుంది అని దీవించి అక్కడనుంచి వెళ్ళిపోతాడు.
రామకృష్ణుడు ఆరోజు రాత్రి ఊరిలో ఉన్న కాళికామాత గుడికి చేరుకొని, గర్భగుడిలో ఉన్న మహాకాళి విగ్రహం ముందు కూర్చుని యోగి చెప్పినా మంత్రోపదేశంని భక్తిశ్రద్ధలతో పాటిస్తాడు. రామకృష్ణుని భక్తిని చూసి ఎంతో సంతోషించిన కాళికామాత రామకృష్ణుడి ముందు ప్రత్యక్షమవుతుంది. కాళికామాత ప్రత్యక్షమవగానే వెయ్యి తలలు మరియు చేతులతో భీకరంగా ఉన్న కాళికామాతను చూసి రామకృష్ణుడు పకపకా నవ్వడం ఆరంభిస్తాడు. రామకృష్ణుడు అలా నవ్వడాన్ని చూసిన కాళీమాతకు కోపం వచ్చి రామకృష్ణుడితో ఇలా అంటుంది. “ఓయీ..! రామకృష్ణ నన్ను చూచి భయపడని వారంటూ ఎవరూ ఉండరు కానీ నీవు నన్ను చూసి పకపకా నవ్వుతున్నావు. నీ నవ్వుకు గల కారణం ఏమిటి అని కోపంగా చూస్తోంది”.
మాత మాటలు విని రామకృష్ణుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లు పలికెను. “తల్లి నిన్ను చూసి నవ్వినందుకు నన్ను క్షమించు కాళికామాత నేను నీ భక్తుడిని, నీ రూపం చూసినప్పుడు నా మదిలో ఒక సందేహం కలిగినది”. అందువల్ల ఆ సందేహం గుర్తుకు వచ్చి నేను నవ్వు ఆపుకోలేకపోయాను అని చెప్పెను. అప్పుడు కాళికాదేవి రామకృష్ణుడిని నీకు వచ్చిన సందేహం ఏమిటి అని ప్రశ్నించగా. అప్పుడు రామకృష్ణుడు ఇలా సమాధానం చెప్పను “ఒక్క తల గల నేను జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకొనుటకు రెండు చేతులు నొప్పి పుట్టి బాధపతుంటాను. అలాంటిది వెయ్యి తలల గల నీవు పడిశం పట్టినప్పుడు ఎంత బాధ పడి ఉంటావో అన్న సందేహం కలిగి నవ్వు వచ్చెను అని అంటాడు.
రామకృష్ణుడు కలిగిన సందేహం విని దేవి లోలోపల నవ్వుకొనుని అతనికి ఏదైనా మేలు చేయదలచి, కుడి మరియు ఎడమ చేతిలో రెండు పాత్రలను సృష్టించి ఒక దానిలో పాలు మరియెక దానిలో పెరుగులతో నింపి, పెరుగు తాగినచొ విద్యాబుద్ధులు లభించును, పాలు తాగినచొ ధనప్రాప్తి కలుగును అని చెప్తుంది.
అపుడు కొంచం సేపు ఆలోచించిన రామకృష్ణుడు కాళికామాత తో ఇలా అంటాడు. అమ్మా ఆ రెండు పాత్రలను నా చేతికిస్తే వాటిలో ఏది రుచిగా ఉందో చూసి అప్పుడు స్వీకరిస్తాను అని చెప్పగా. అప్పుడు దేవి తన చేతుల్లో ఉన్న రెండు పాత్రలను అతనికి ఇస్తుంది. ఆ రెండు పత్రాలను తన చెతిలోకి తీసుకోనీ వాటిలో ఉన్న పాలు మరియు పెరుగును కలిపి రామకృష్ణుడు తాగి వేసెను. అమ్మ నువ్వు నాకు ఇచ్చిన రెండు పాత్రలు లోని పాలు మరియు పెరుగు ఎంతో రుచిగా ఉన్న కారణమున నేను రెండింటిని తాగి వేసితిని. అంతే కాకుండా మానవునికి విద్య ధనము రెండు అవసరమైనవే. ధనం ఉండి విద్య లేకపోతే మానవునికి గౌరవముండదు మరియు విద్య ఉండి ధనం లేకపోతే మానవుడికి సుఖం ఉండదు. నాకు విద్యా మరియు ధనం రెండూ అవసరమే కనుక రెండిటినీ తాగితిని. కావున నా పైన కోపం తెచ్చుకోకుండా, నాయందు దయ ఉంచి నాకు విద్య మరియు ధనం రెండింటిని ప్రసాదించాలని కోరుతున్నాను. పిల్లలు ఎంత చెడ్డ వారు ఆయనను తల్లులు వారిని దండించదరు కావున నన్ను మన్నించవలసిందిగా కోరుచున్నాను అని వేడుకొనెను.
రామకృష్ణుని పని కాళికాదేవి కి కొంచెం కోపం తెప్పించినా.. అతని మాటలు ఆమెకు జాలి కలిగించినవి. అయినా కూడా హద్దుమీరి ప్రవర్తించిన రామకృష్ణుని పూర్తిగా క్షమించని కాళికాదేవి “వికటకవి” అవుదువు గాక అని శపించెను. నా తప్పులను క్షమించి నాకు దారిద్ర్యము కలగకుండా కాపాడు అని రామకృష్ణుడు కాళికాదేవిని ప్రార్ధించెను.
అతని ప్రార్థనలు విన్న కాళికాదేవి రామకృష్ణ నీవు వికటకవి అయినా కూడా రాజుల చేత గౌరవింపబడగలవు మరియు మంచి పేరు ను కూడా పొందుతావు భయపడకు అని అభయమిచ్చి మాయామయ్యారు.
3. పాలు త్రాగని పిల్లి (Tenali Ramakrishna stories in Telugu)
విజయనగర సామ్రాజ్యంలో నివాసిస్తున్న ప్రజలకు ఒకనాడు ఒక గడ్డు సమస్య వచ్చిపడింది. నగరంలో ఎలుకల బెడద ఎక్కువ అవ్వడం వల్ల ఆ ఎలుకలు ఇండ్లలోని ఆహారపదార్ధలను మరియు ధాన్యం బస్తాలను నాశనం చేయసాగినవి.ఈ సమస్య నుంచి ఎలా అయిన బయటపడాలని ఆలోచించిన ప్రభుత్వం నగరంలోని ప్రజలకు పిల్లులను పెంచమని చెప్పింది. రాయల వారు కూడా తమ ఆస్థానంలోని ఉద్యోగులకు మరియు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్పెను. పిల్లులను పెంచదానికి అవసరమయ్యే పాలు కోసం ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఆవును కూడా ఇచ్చెను. ఇలా ఆస్థానంలో ఉన్న ఉద్యోగులందరికి ఒక పిల్లిని మరియు దాని పోషణ కోసం ఒక ఆవును పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను.
అలా ఆస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు కూడా ఒక్క పిల్లిని మరియు ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపించెను. అందరి కవులతో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక ఆవు మరియు ఒక పిల్లిని పెంచమని అప్పగించెను.
రామకృష్ణుడు పిల్లికి సరిగా పాలు త్రాగించక, తిండి పెట్టక, ఆవు ఇచ్చిన పాలను తమ కుటుంబ అవసరాలకు వినియోగించసాగేను. కొన్నాళ్ళకు సరైన ఆహారం లేక పిల్లి బక్కచిక్కి పోయింది . దాని ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పిల్లి రాత్రంతా మేల్కొని రామకృష్ణుడి ఇంట్లో ఉన్న ఎలుకాలనే కాక అతని ఇంటి చుట్టుపక్కన ఇళ్ళలో ఉన్న ఎలుకలను కూడా తినేస్తూ వచ్చింది. అందు వల్ల రామ కృష్ణుడు ఇంట్లో గాని మరియు రామకృష్ణుడు ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ ఒక్క ఎలుక కూడా కనిపించేది కాదు. కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక్క ఎలుక కూడా కనిపించకుండా పోవడంతో ఆ పిల్లకి తినుటకు ఆహారం లేక బక్కచిక్కి పోయి నడవలేని పరిస్థితుల్లోకి వచ్చింది.
ఒక రోజు కృష్ణదేవరాయలగారు తమ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కవులకు ఇచ్చిన పిల్లులను ఎవరైతే బాగా పెంచారో వారికి తగిన బహుమతి ఇచ్చి సత్కరింపబడును అని ప్రకటించారు. పిల్లులను పెంచుతున్న వారంతా పౌర్ణమి నాటికి తమ పిల్లులను తీసుకొని రాయలవారి ఆస్థానానికి రావలసిందిగా ఆజ్ఞాపించింది ప్రభుత్వం.
ఈ ప్రకటనను విన్న రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు.” ఆవు ఇచ్చిన పాలను నేను నా కుటుంబ సభ్యులు హాయిగా తాగేశాము.ఈ పిల్లకి ఒక్క రోజు కూడా పాలు పోయాలేదు. ఈ పిల్లి ఇప్పుడు ఆకలికి అలమటిస్తూ బక్కచిక్కి పోయి చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగ్గా పెంచలేదని రాయలవారు నన్ను శిక్షించవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు. పౌర్ణమికి ఇంకా వారం ఉన్నది , ఈ లోగా ఈ గండం నుంచి ఎలాగైనా బయట పడాలి అని రామకృష్ణుడు ఆలోచించసాగేను.
చాలాసేపు ఆలోచించగా రామకృష్ణునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన భార్యకు ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకురమ్మని చెప్పను. చెప్పిన విధంగానే ఆమె ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది .రామకృష్ణుడు ఆ పాల గిన్నె ఒక చోట పెట్టి పిల్లిని తీసుకువచ్చి ఆ పాలు తాగించాలి అని ప్రయత్నించ సాగెను. పాలును చూసిన వెంటనే పిల్లి ఎంతో ఆనందంతో తాగడానికి ముందుకు వచ్చింది. పాలు వేడి వేడిగా ఉండడం వలన పిల్లి మూతి కాలిపోయి అక్కడనుంచి అరుస్తూ పారిపోయింది.దానిని మళ్లీ తీసుకువచ్చి పాల దగ్గర విడిచిపెట్టెను ,ఎంత ప్రయత్నించినా ఆ పిల్లి పాలు తాగుటకు ఇష్టపడలేదు .ఆ విధంగా దాని చేత ఆ పాలు త్రాగించుటకు ప్రయత్నించేను. మొత్తానికి ఆ పిల్ల పాలు మాత్రం త్రాగలేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకుని రామకృష్ణుని నుండి తప్పించుకునుటకు ప్రయత్నించింది . ఇదంతా చూసిన రామకృష్ణుడు తన పన్నాగం పనిచేసిందని ఎంతో సంతోషించి, హామయ్య …..!గండం తప్పింది అనుకొని గట్టిగా గాలి పీల్చుకున్నాడు.
రాయలవారు చెప్పినా పౌర్ణమి రోజు రానే వచ్చింది. అందరూ తమ పిల్లులను తీసుకుని సభలో హాజరు అయ్యారు. ఒక పిల్లి కంటే ఇంకొక పిల్లి బాగా బలిసి అడుగు తీసి అడుగు పెట్టే లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎలుక కనబడినా సరే పరుగెత్తి పట్టుకోలేనంత లావుగా ఉన్నాయి. ఆ సమయంలో రామకృష్ణుడి దగ్గర ఉన్న పిల్లి కుంగి కృశించి , బక్కచిక్కి పోయి రేపోమాపో చనిపోయేలా ఉండటాన్ని గమనిస్తారు రాయులవారు.
ఆ పిల్లి ని చూడగానే శ్రీ కృష్ణదేవరాయల కి కోపం వచ్చింది మరియు ఆశ్చర్యం కూడా కలిగింది .రామకృష్ణ కవి ..!మీ పిల్లి ఇంత బలహీన పడిపోవడానికి కారణం ఏమిటి …?ఇది ఇంతగా బక్కచిక్కి పోయి రేపోమాపో చచ్చేలా ఉంది .మేము ఇచ్చిన ఆవుపాలను నీవు దీనికి తాగించలేదా..? అని అడుగగా. రామకృష్ణుడు వినయంగా” మహాప్రభు…! ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు , ఈ పిల్లి అసలు పాలను ముట్టదు,కొంచెం పప్పు అన్నం తింటుంది .ఎప్పుడూ దీని దృష్టి ఎలుకలు మీదే ఉంటుంది. దీని పుణ్యమా అని మా ఇంట్లో మా చుట్టుపక్కల ఒక్క ఎలుక కూడా లేదు కావున మేము అందరం హాయిగా నివసిస్తున్నాము”.
రామకృష్ణుడి మాటలు విని ఆ సభలో ఉన్న మంత్రులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మకుండా ఒక భటుడుని పిలిచి ఒక గిన్నెలో పాలు తెప్పించి ఒక చోట పెట్టి రామకృష్ణుడి పిల్లి తో పాలను తాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకున్న పిల్లిని తీసుకుని వెళ్లి పాల ముందు నిలబెట్టారు. అది పాలు చూడగానే వెనుకకు పరిగెత్తసాగింది . అది చూచి అందరూ ఆశ్చర్య పడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమేనని అంతా నమ్మారు.
కానీ రాయల వారికి మాత్రం ఈ విషయం కొంచెం వింతగానే తోచింది. లోకంలో ఎక్కడైనా పాలు త్రాగని పిల్లి ఉంటుందా..? రామకృష్ణుడు ఏదో కొంటె పని చేసి ఉంటాడు . అందువల్లనే ఈ పిల్లి పాలు తాగడానికి భయపడుతున్నది. అనుకొని ఆ పిల్లిని తన దగ్గరకు తెప్పించుకుని దాని నోరు పరీక్షించగా దాని మూతి కాలిన మచ్చలు కనబడతాయి.అంతేకాక పిల్లి నాలుక చివర వాతలు పడినట్లు కనిపిస్తుంది. వాటిని చూసిన రాయలవారు కోపించి ,”రామకృష్ణ కవి ..! మీరు పిల్లి పాలు తాగకుండా ఏదో చమత్కారం చేసినట్లు గ్రహించాము” . మీరు నిజం చెప్తే క్షమించి విడిచి పెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా .రామకృష్ణుడు జరిగిన విషయం అంతా చెప్తాడు .మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని మాకిస్తిరి, ఈ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాదే కాక మా ఇరుగు పొరుగుల ఇళ్ళ యందు ఎలుకల బాధ కూడా పోయినది. మీకు అనుమానం గా ఉన్నచో మీరు ఎవరినైనా పంపి మా ఇంటిలో కానీ ఇంటి పరిసరాలలో కానీ ఎక్కడైనా ఒక్క ఎలుక కనపడుతుందేమో తెలుసుకొని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టడమే కాక మాకు నిత్యమూ కావాల్సిన పాలు, పెరుగు ,నెయ్యి మొదలగు వాటికి లోటు కలగకుండా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు .నా పిల్లివలె ఇచ్చట ఉన్న ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టి చంపగలదేమో పరీక్ష పెట్టి చూడండీ. కడుపునిండా తిని బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా ..?ఇక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించడమో, రక్షించడమో చేయడు అని చెప్పెను . రామకృష్ణుని మాటలు విని రాయలవారు అధికంగా బలిసిన పిల్లులు తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లలో ఇంకనూ ఎలుకల బాధ పూర్తిగా పోలేదు అని తెలుసుకుంటాడు. రామకృష్ణుని ఇంటి యందు మరియు ఇంటి పరిసరాలులో విచారించగా. తమకు ఎలుకల బెడద ఏమాత్రం లేదని వాళ్ళు తెలియజేస్తారు. ఈ సమాధానం విన్న రాయలవారు రామకృష్ణుడు చేసిన పని మంచిదే అని తలచి రామకృష్ణుని తెలివికి మరియు సమయస్ఫూర్తికి మెచ్చుకుని అతనికి పదివేల వరహాలు బహుమతిగా ఇచ్చి పంపెను.