Yaksha Prashnalu అంటె ఏమిటి, ఎందుకు, ఎలా వచ్చాయి, అవి ఎన్ని అనేది ఇప్పుడు ఈ పోస్ట్ లో చూద్దాం……
మహాభారత అరణ్య పర్వం లో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన పై పంచె ఒక జింక కొమ్మలలో ఇరుక్కొని పోయిందని, ఆ జింక చేతికి చిక్కకుండా అడవిలోకి తప్పించుకొని పోయిందని చెప్పి తన పై పంచెను తనకు తెచ్చివ్వవలసిందిగా పాండవులను కోరుతాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు పాండవులలో పెద్దవాడైనా ధర్మరాజు బ్రాహ్మణునికి సాయం చేయాలని తలచి, తన తమ్ములతో కలసి జింకను వెతకడానికి అడవిలోకి బయలుదేరుతాడు.
చాలాసేపు ఆ అడవిలో వెతికినా జింక ఎంతకీ కనిపించక పోయేసరికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని పోతారు ఐదుగురు అన్నదమ్ములు. ఇంతలో ధర్మరాజు కి చాలా దాహం వేస్తుంది , తన తమ్ముడైన నకులడను నీళ్లు తీసుకొని రావాల్సిందిగా చెప్పి పంపుతాడు. నకులుడు ఎంతకీ రాక పోయే సరికి సహదేవుని పంపుతాడు, అదేవిధంగా అర్జునుడు భీముడు ను కూడా పంపుతాడు. కానీ ఎంత సేపు చూసినా తమ్ములు తిరిగి రారు. చివరకు ధర్మరాజు అడవిలోకి బయలుదేరి నీళ్లు ఉన్న ఆ కొలను వద్దకు చేరుకుంటాడు. అక్కడ ఆ కొలను పక్కనే సొమ్మసిల్లి పడిపోయిన తన తమ్ములని చూసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక అదృశ్య ఆకాశవాణి తనని పిలుస్తుంది,”ధర్మనందనా నేను యక్షుడను ఈ నీళ్ల కొలను నా ఆధీనంలో ఉంది”, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీ తమ్ములు అహంభావంతో నా అనుమతి లేకుండా నీళ్లు త్రాగబోయారు, అందుకే వారికి ఈ దుస్థితి పట్టింది. నీవైన నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకుని నీ తమ్ములను రక్షించుకుకో అని అంటాడు యక్షుడు ధర్మరాజు తో. అప్పుడు ధర్మరాజు సరే అని ఒప్పుకుంటాడు. ఆప్పుడు ధర్మరాజుని యక్షుడు 72 చిక్కు ప్రశ్నలు (Yaksha Prashnalu) వేయగా, ధర్మరాజు వాటికి ఈ విధంగా జవాబులు ఇస్తాడు.
Get this Book Online (ఈ పూర్తి పుస్తకాన్ని ఆన్లైన్ లో పొందండి)
72 Yaksha Prashnalu (Dharmaraju answers in Telugu)
1. తృణం కంటే దట్టమైనది ఏది
జవాబు: చింత
2. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది
జవాబు: చేప
3. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందును
జవాబు: అస్త్రవిద్య తో
4. రాజ్యాధినేత కు సజ్జనత్వం ఎలా కలుగుతుంది
జవాబు: యజ్ఞయాగాదులు చేయడం వలన
5. జన్మించినా కూడా ప్రాణం లేనిది ఏది
జవాబు: గుడ్డు
6. రూపం ఉన్న హృదయం లేనిది ఏది
జవాబు: రాయి
7. మానవునికి దుర్జనత్వం ఎలా వస్తుంది
జవాబు: శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన
8. ఎల్లప్పుడూ వేగం కలిగిన ది ఏది
జవాబు: నది
9. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును
జవాబు: వేదం
10. మానవుడికి సహాయపడేది ఏది
జవాబు: ధైర్యం
11. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగుతాడు
జవాబు: పెద్దలను సేవించుటవలన
12. మానవుడు మానవత్వము ఎప్పుడు పొందుతాడు?
జవాబు: అధ్యయనము వలన
13. మానవునికి సాధుత్వాలు ఎట్లా సంభవిస్తాయి?
జవాబు: తపస్సువలన సాధు భావం శిష్టాచార బ్రస్టత్వం వల్ల అసాధుభావము సంభవించును
14. మానవుడు మనస్సు ఎట్లా అవుతాడు?
జవాబు: మృత్యు భయం వలన
15. మానవుని జీవన్స్మృతులు ఎవరు?
జవాబు: దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, సేవకులకు, పెట్టకుండా తినేవాడు
16. భూమికంటె భారమైనది ఏది?
జవాబు: జనని
17. సూర్యుణ్ణి ఉదయింప చేయగల శక్తి ఎవరికి ఉంది?
జవాబు: బ్రహ్మం
18. సూర్యుని చుట్టూ తిరిగే వారెవరు?
జవాబు: దేవతలు
19. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
జవాబు: ధర్మం
20. సూర్యుడు దేని ఆధారంగా నిలుస్తున్నాడు
జవాబు: సత్యం
21. మానవుడు దేనివలన మహత్తును పొందును
జవాబు: తపస్సు
22. ఆకాశం కంటే విశాలమైనది ఎవరు?
జవాబు: తండ్రి
23. గాలి కంటే వేగవంతమైనది ఏది?
జవాబు: మనసు
24. మానవునికి సజ్జనత్వం ఎలా సంతరించుకుంటుంది
జవాబు: ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే ఏ మాటలు మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.
25. రైతు కి ఏది ముఖ్యం
జవాబు: వాన
26. బాటసారికి రోగికి గృహస్థులకు చనిపోయిన వారికి బంధువులు ఎవరు
జవాబు: సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు.
27. ధర్మానికి ఆధారమేది
జవాబు: దయ దాక్షిణ్యం
28. కీర్తికీ ఆశ్రయమేది
జవాబు: దానం
29. దేవలోకానికి దారి ఏది
జవాబు: సత్యం
30. సుఖానికి ఆధారం ఏది
జవాబు: శీలం
31. మనిషికి దైవిక బంధువులు ఎవరు
జవాబు: భార్య/ భర్త
32. మనిషికి ఆత్మ ఎవరు
జవాబు: కుమారుడు
33. మానవునికి జీవనాధారం ఏది
జవాబు: మేఘం
34. మనిషి దేనివలన సంతోష పడతాడు
జవాబు: దానం
35. లాభాల్లో గొప్పది ఏది
జవాబు: ఆరోగ్యం
36. సుఖాల్లో గొప్పది ఏది
జవాబు: సంతోషం
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది
జవాబు: అహింస
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది
జవాబు: మనసును
39. ఆర్జవము అంటే ఏమిటి
జవాబు: సదా సమ భావం కలిగి ఉండటం.
40. సోమరితనం అంటే ఏమిటి
జవాబు: ధర్మకర్యాలు చేయకపోవడం
41. దుఃఖం అంటే ఏమిటి
జవాబు: అజ్ఞానం కలిగి ఉండటం
42. ధైర్యం అంటే ఏమిటి
జవాబు: ఇంద్రియ నిగ్రహం
43. ఎవరితో సంధి చెడిపోదు
జవాబు: మంచివారితో
44. ఎల్లప్పుడూ తృప్తిగా యుండునదేది
జవాబు: యాగకర్మ
45. లోకానికి దిక్కు ఎవరు
జవాబు: సత్పురుషులు
46. అన్నోదకాలు దేనియందు ఉద్భవిస్తాయి
జవాబు: భూమి, ఆకాశము నందు
47. లోకాన్ని కప్పివున్నది ఏది
జవాబు: అజ్ఞానం
48. శ్రాద్ధ విధికి సమయం ఏది
జవాబు: బ్రాహ్మణులు వచ్చినప్పుడు
49. మనిషి దేనిని విడచినచో జనాధరణనీయుడు, శోక రహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అవుతాడు.
జవాబు: గర్వం, క్రోధం, లోభం, త్రుష్ణ విడిచినచో
50. తపస్సు అంటే ఏమిటి
జవాబు: తన వృత్తిని మరియు కుల ధర్మాన్ని ఆచరించడం
51. క్షమ అంటే
జవాబు: ద్వంద్వా లు సహించడం
52. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు
జవాబు: అందరి ప్రశంసలు పొంది గొప్పవాడు అవుతాడు
53. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు
జవాబు: సుఖపడతాడు
54. ఎవడు సంతోషంగా ఉంటాడు
జవాబు: అప్పు లేని వాడు తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు
55. సిగ్గు అంటే ఏమిటి
జవాబు: చేయరాని పనులంటే జడవడం
56. సర్వథని అని ఎవరిని అంటారు
జవాబు: ప్రియా ప్రియాల సుఖ దుఃఖాలను సమానంగా ఎంచువడు
57. జ్ఞానం అంటే ఏమిటి
జవాబు: మంచి చెడులను గుర్తించగలడం
58. దయ అంటే ఏమిటి
జవాబు: ప్రాణులన్నింటి సుఖమును కోరడం
59. స్నానం అంటే ఏమిటి
జవాబు: మనసును మాలిన్యం లేకుండా చేసుకోవడం
60. దానం అంటే ఏమిటి
జవాబు: సమస్త ప్రాణుల్ని రక్షించడం
61. పండితుడు అంటే ఎవరు
జవాబు: ధర్మం తెలిసినవాడు
62. మూర్ఖుడు ఎవరు
జవాబు: ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు
63. కాయం అనగా ఏమి
జవాబు: సంసారానికి కారణం అయింది
64. అహంకారం అంటే ఏమిటి
జవాబు: అజ్ఞానం
65. డంభం అంటే ఏమిటి
జవాబు: తన గొప్ప తానే చెప్పుకోవడం
66. ధర్మం అర్ధం కామం ఎక్కడ కలియును
జవాబు: తన భార్యలో /తన భర్తలో
67. నరకం అనుభవించే వారెవరు
జవాబు: ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మశాస్త్రాలను, పితృ దేవతల్ని ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు.
68. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది
జవాబు: ప్రవర్తన
69. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది
జవాబు: మైత్రి
70. ఏది ఆశ్చర్యం
జవాబు: ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు
జవాబు: ప్రియం అప్రియం, సుఖము మొదలైన వాటిని సమానంగా చూసేవాడు.
72. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు
జవాబు: నిండాస్థులందూ, కలిమిలేములు నందు, సుఖదుఃఖాల యందు, సముడై, లభించిన దానితో సరిపెట్టుకున్న అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి, స్థిర బుది కలవాడై ఎవరైతే ఉంటాడో వాణిని స్థితప్రజ్ఞుడు అంటారు.
అప్పుడు యక్షుడు ” ధర్మనందనా నీ జవాబులు నన్ను ఆనందపరిచినవి నీ తమ్ములలో ఒకరిని బ్రతికించెదను, నీవు ఎవరిని బతికించాలి అని కోరుకుంటునావో చెప్పు
అప్పుడు ధర్మరాజు నకులుని బ్రతికించమని కోరుకుంటాడు
యక్షుడు” భీమార్జునులను వదిలి ఈ నకులుడను బ్రతికించమని ఎందుకు కోరుకుంటున్నావ” అని ధర్మరాజుని అడుగుతాడు.
అప్పుడు ధర్మరాజు ఇలా సమాధానం ఇస్తాడు. కుంతి , మాద్రి అని ఇద్దరు తల్లులు మాకు. కుంతీ కొడుకులలో పేదవాడైన నేను బ్రతికి ఉన్నాను, కావున మాద్రి కొడుకులు పెద్దవాడైన నకులుడు కూడా బతికుండగావళ్ళను కదా .
అప్పుడు యక్షుడు” ధర్మరాజా అర్థ కామములు కంటేను కూడా దయ ధర్మం లకే ప్రాముఖ్యత నిచ్చావు కనుక నీ తమ్ములు నలుగురిని బ్రతికించుచున్నాను అన్నాడు యక్షుని రూపంలో ఉన్న యమధర్మరాజు “ఆ మాటలకు ధర్మరాజు ఎంతో సంతోషిస్థాడు.
Other Telugu Posts