పూర్వం ఏడువారాల నగలకు ఎంతో ప్రత్యేకత ఉండేది. ఏడువారాల నగలు గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈనాడు కూడా వాటి గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. మన పూర్వీకులు గ్రహాల అనుగ్రహం కోసం, ఆరోగ్యరీత్యా స్త్రీ పురుషులు బంగారు నగలను ధరించేవారు.
వారం రోజులు అనగా ఆదివారం మొదలు శనివారం వరకు ఒకొక్క రోజు కొన్ని రకాల బంగారు ఆభరణాలు ధరించేవారు వీటినే ఏడు వారాల నగలు అంటారు. గ్రహాలకు
అనుకూలముగా హారాలు, గాజులు, కమ్మలు, ముక్కుకు ముక్కెర, పాపిట బిళ్ళ, చంద్రవంక, నాగారం, ఉంగరాలు మొదలగు ఆభరణాలను ధరించేవారు.

ఇప్పుడు ఏ ఏ నగలు ఏ ఏ రోజుల్లో ధరించాలో తెలుసుకుందాం (7 varala nagalu list).
1. ఆదివారము: ఆదివారం రోజున సూర్యభగవానునికి కోసం కెంపుల తో తయారుచేయబడిన ఆభరణాలు అనగా కెంపులతో తయారు చేసిన కమ్మలు , కెంపులతోతయారు చేసిన గాజులు మొదలగునవి ధరించేవారు.
2. సోమవారము: సోమవారం నాడు చంద్రుని కోసం ముత్యాల తో తయారు చేయబడిన హారాలు ముత్యాల గాజులు మొదలగునవి ధరించేవారు.
3. మంగళవారం: మంగళవారం నాడు కుజుని కోసం పగడాల దండలు ,పగడాల ఉంగరాలు మొదలగునవి ధరించేవారు.
4. బుధవారం: బుధవారం నాడు బుధుని కోసం పచ్చల పతకాలు , పచ్చల గాజులు మొదలగునవి ధరించేవారు.
5. గురువారం: గురువారం నాడు బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, పుష్యరాగం ఉంగరాలు మొదలగునవి ధరించాలి.
6. శుక్రవారము: శుక్రవారం నాడు శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడకలు మొదలగునవి ధరించేవారు.
7. శనివారం: శనివారం నాడు నీలమణి హారాలు మొదలగునవి శని కోసం ధరించేవారు.