పక్షం అంటే తెలుగు నెలలోని ఒక సగాన్ని ఒక పక్షం అంటారు. ఇంగ్లీష్ నెలలులా కాకుండా తెలుగు నెలలులో ప్రతి నెల 30 రోజులతో ముగుస్తుంది, అంటే తెలుగు నెలలోని పదిహేను రోజులను కలిపి ఒక పక్షం మరియు మరొక పదిహేను రోజులని కలిపి మరో పక్షం అంటారు.
మరొక విధంగా చెప్పాలంటే, మనకు మొత్తము పదిహేను తిధులు ఉన్నాయి, ఈ పదిహేను తిథుల లో పోర్ణమి మరియు అమావాస్య తప్ప ప్రతి తిథి మన తెలుగు నెలలో రెండుసార్లు కనిపిస్తుంది (పూర్తి అవగాహన కోసం క్రింది ఉన్న ఫోటోని చూడండి). ఇలా మొదటి పదిహేను తిధుల భాగాన్ని ఒక పక్షము అని, దాని తరవాత ప్రారంభమయ్యే పదిహేను తిథులను కలిపి మరొక పక్షమని పిలుస్తారు.
దీనిని బట్టి పక్షాలు రెండు అని మనకు అర్థమయింది కదా……..
ఇప్పుడు అవి ఏమిటి అనేది చూద్దాం.
1. శుక్లపక్షం
2.కృష్ణపక్షం
1. శుక్లపక్షం: దీనిని శుద్ధ పక్షం అని కూడా అంటారు. మన తెలుగు నెలలో శుక్లపక్షం మొదటి తిథి అయిన పాడ్యమి తో ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది (ఫోటోలోని ఆకుపచ్చ భాగం).
శుక్లపక్షం ప్రారంభమైన మొదటి రోజు (పాడ్యమి) నుంచి 15 వ రోజు వరకు క్రమేణా చంద్రుని ఆకారంలో మరియు వెన్నెలలో పెరుగుదల రావడం వల్ల రాత్రిళ్లు క్రమేణా కాంతివంతంగా మారుతాయి. ఇలా పూర్తి నలుపు (చీకటి) నుంచి తెలుపు (వెన్నెల) వైపుకు రాత్రిళ్ళు గడిచే నెల బాగాన్ని శుక్లపక్షము అంటారు. శుక్లము అంటే తెలుపు అని అర్థము.
2. కృష్ణ పక్షం: దీనిని బహుళ పక్షం అని కూడా పిలుస్తారు. కృష్ణపక్షం అనేది శుక్ల పక్షానికి భిన్నంగా ఉంటుంది. ఈ కృష్ణపక్షం అనేది శుక్లపక్షం ముగియగానే ప్రారంభమవుతుంది. ఈ కృష్ణపక్షంలో మొదటి రోజు రాత్రి అంటే పౌర్ణమి రోజు తర్వాత వచ్చే తిథి పాడ్యమి (వెన్నెల) నుంచి పదిహేనవ రోజు రాత్రి వచ్చే తిథి అమావాస్య (చీకటి) వరకు వెన్నెల క్రమేణా తగ్గుముఖం పట్టి పూర్తి చీకటితో ముగిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే, కృష్ణపక్షం లో చంద్రుని ఆకారం తో పాటు వెన్నెల తగ్గుముఖం పట్టి చివరకు రాత్రిళ్ళు చీకటితో నిండిపోతాయి. కృష్ణ అంటే నలుపు అని అర్థం.
గుర్తుంచుకోవాల్సింది: తెలుగు నెలలో ఒక్కొక్క తిథి (రోజు లేదా ధినం) దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.
మన భారతదేశంలో మనం హిందూ ధర్మం లోని కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకుందాం.
పక్షాలు (రెండు)
దిక్కులు నాలుగు (నలుదిక్కులు)
మూలలు – నాలుగు (నలుమూలలు)
వేదాలు – నాలుగు
భూతాలు – ఐదు (పంచభూతాలు)
పంచేంద్రియాలు – ఐదు (పంచేంద్రియాలు)
లలిత కళలు – ఐదు
గంగలు – ఐదు (పంచ గంగలు)
దేవతా వృక్షాలు – ఐదు
ఉపచారం – ఐదు (పంచోపచారాలు)
అమృతాలు – ఐదు (పంచామృతాలు)
లోహాలు – ఐదు (పంచలోహాలు)-( ఇక్కడ చదవండి)
పంచరామాలు – ఐదు
రుచులు – ఆరు (షడ్రుచులు)
అరిషడ్వర్గాలు – ఆరు
గుణాలు – ఆరు (షడ్గుణాలు)
ఋతువులు – ఆరు (షడృతువులు)
ఋషులు – ఏడు (సప్త ఋషులు)
తిరుపతి కొండలు – ఏడు (సప్తగిరులు)
సప్త వ్యసనాలు – ఏడు (సప్త వ్యసనాలు)
నదులు – ఏడు (సప్త నదులు)
తెలుగు వారాలు – ఏడు (ఏడు వారాలు)
ధాన్యాలు – తొమ్మిది (నవధాన్యాలు)
రత్నాలు – తొమ్మిది (నవరత్నాలు)
ధాతువుల – తొమ్మిది
రసాలు – తొమ్మిది (నవరసాలు)
దుర్గలు – తొమ్మిది (నవదుర్గలు)
గ్రహాలు – తొమ్మిది (నవగ్రహాలు)
సంస్కారాలు – పది
అవతారాలు – పది (దశావతారాలు)
జ్యోతిర్లింగాలు – పన్నెండు
తెలుగు నెలలు – పన్నెండు ( ఇక్కడ చదవండి)
తెలుగు రాశులు – పన్నెండు
తెలుగు తిథులు – పదిహేను
తెలుగు నక్షత్రాలు – ఇరవై ఏడు
ఈ తరం పిల్లలకు ఇవన్నీ చదివించండి మరియు ఎప్పటికి గుర్తుండేలా నేర్పించండి.
This is Vishnu Prasanth from Vijayawada, Andhra Pradesh. I too read books very well. The information that you delivered me is very informative and reliable, and can be found at a single place without any human effort.