1. మానవత్వమా లేక మోసమా?
బెంగళూర్ కి చెందిన రవి అనే వ్యక్తి తన ఇంటి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటాడు.
అతను ప్రతి రోజూ ఆఫీస్ కి వెళ్లాలన్నా ఇంటికి తిరిగి రావాలన్నా రెండు బస్సులు మారాల్సి ఉంటుంది. ఒకరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి మొదటి బస్సు ఎక్కుతాడు. కొంత సమయంలో మరో బస్ ఎక్కే స్టాప్ రావడంతో అక్కడ దిగుతాడు.
మరో బస్సు రానే వస్తుందుంది. ఆ బస్సు కోసం చాలా మంది అక్కడ ఎదురు చూస్తూ ఉండటం తో అతను బస్ ఎక్కడానికి చాలా కష్టపడుతాడు. ఎలానో ఎక్కి కూర్చున్న తరువాత టికెట్ కోసం కండక్టర్ రావడంతో తన ఫోన్ వెనక దాచుకున్నా బస్ పాస్ ఐడెంటిటి కార్డును చూపిస్తాడు. అలా 15 నిమిషాలు గడిచిన తర్వాత అతనికి ఒక నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది.
ఆ ఫోన్ లోని వ్యక్తి, సార్ మీ పర్సు నా దగ్గర ఉంది మీరు బస్టాప్ లో పడేసుకొన్నారు, ఆ పర్స్ నేను ఎత్తుకుని మిమ్మల్ని పిలుస్తుండగా బస్ వెళ్ళిపోయింది. పర్స్‌లో మీ నెంబర్ చూసి ఫోన్ చేశాను. మీరు ఇక్కడికి రాగలరా లేదంటే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేనే వస్తాను అని అడుగాడు. దానికి రవి, నేను ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లేదారిలో శాంతినగర్ బస్టాప్ ఉంది కదా దానికి దగ్గరలో ఉన్నాను అంటాడు. సార్ మీరు అక్కడే దిగెయ్యండి నేను కూడా ఎలక్ట్రానిక్ సిటీ కి రావడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఆ వ్యక్తి అంటాడు.
30 నిమిషాల తర్వాత అతను అక్కడికి వచ్చి పర్స్ ఇస్తాడు. రవి పర్స్ చూసుకోగా అందులో ఉండవలసిన 2000 రూపాయలు నోటు లేకపోవడంతో అతన్ని సార్ ఇందులో 2000 నోటు ఉండాలి మీరు ఏమైనా చూసారా అని అడగగా అతను సార్ నాకు ఏమీ తెలియదు అందులో పది రూపాయలు మాత్రమే ఉండింది, అంటాడు. అప్పుడు రవి, పర్స్ లో ఉన్న విలువైన ఐడి కార్డ్స్ చూసి ఎలాగో ఇవైనా దొరికాయని సంతోషించి, అతనికి ధన్యవాదాలు చెప్పి వచ్చేస్తాడు.
ఇక్కడ మనము ఆలోచించవలసినది ఏమిటంటే రవి పర్స్ దొరికిన వ్యక్తి అందులోని 2000 రూపాయలనోటుని తీసుకుని పర్స్‌ని పడేసి ఉండవచ్చు కానీ అందులో ఉన్న ఐడీ కార్డ్స్ చూసి ఇవ్వలనిపించిందేమో మరి. విచిత్రం ఏమిటంటే అందులో 2000 రూపాయలనోటు తో పాటు ఉన్న పది రూపాయల నోటుని తీసుకొకపోవడం, తీసుకుని సార్, మీ పర్స్ ప్లాట్ ఫారం మీద దొరికింది అని చెప్పకపోవడం.
Buy Chandamama Kathalu story book in Telugu Language
మామూలుగా అతను 2000 తీసుకోవడం తప్పు, కానీ దొరికింది తెచ్చివ్వడం మానవత్వం. ఇక్కడ ఆశ్చ్యర్యాన్ని కలిగించేది ఏమిటంటే అతను 2000 రూపాయల నోటు తీసుకున్నా కూడా ధైర్యం గా పర్స్ తెచ్చి ఇవ్వడం.
ఇక్కడ రవి చేసింది ఏమిటి ?… మనుషుల్లో కొంచెమైనా మానవత్వం మిగిలివుంది పోనీలే 2000 పోతే పొయ్యింది, ఇప్పుడు ఇతనిపై పోలీస్ కేస్ పెడితే ఉన్న ఈ కొంచెం మానవత్వం కూడా పోతుందని ఆలోచించి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోవడం.
ఫ్రెండ్స్.. మీరైతే ఏమి చేస్తారు, 2000 రూపాయలనోటు తీసుకున్న అతనిపై కేస్ పెడతారా, లేక మనుషుల్లో కొంచెమైనా మానవత్వం ఉంది, దాన్ని కాపాడుకోవాలని అతన్ని రవి లాగా వదిలేస్తారా. కామెంట్స్ లో చెప్పండి.
@Read more good stories in Telugu using this link.