మోదుగ చెట్టు మన భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో ప్రాచుర్యం పొందినది. ఈ చెట్టు ఆకులను, పువ్వులను మరియు బెరడును కూడా రకరకాల ఔషధాల తయరీలో మన పూర్వీకులు ఉపయోగించేవారు ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. మోదుగ అందమైన ఎర్రని ఆకర్షణీయమైన పూలను కలిగి ఉంటుంది.
ఈ మోదుగ పువ్వులను అగ్నిపూలు అని కూడా పిలుస్తారు. ఇది Fabaceae పూల చెట్ల జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం Butea monosperma. ఎర్రని అందమైన పూల గుత్తులతో ఈ చెట్టు చూడటానికి ఏంతో అందంగా ఉంటుంది.
మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు.
Moduga chettu names in different languages
భారతదేశంలో ఆయా ప్రాంతాల భాషల్ని బట్టి రకరకాల ఈ వృక్షాన్ని అనేక పేర్లతో పిలుస్తున్నారు. సంస్కృతంలో ఈ చెట్టుని పలాస అని మరియు హిందీలో పలాస్ అని, తెలుగులో మోదుగా అని, తమిళంలో పారోసం, కన్నడలో మధుగా మరియు కత్తుమురక అని, మలయాళంలో మురికు , శమత మరియు బ్రీమవృక్షం అని, హర్యానాలో కాకాక్ అని, పంజాబీ భాషలో బ్రహ్మ వృక్ష అని, ఒరియాలో కింజుకో మరియు పొరసు అని పిలుస్తున్నారు. ఈ విధంగా భారత దేశ వ్యాప్తంగా ఈ చెట్టుకు అనేక పేర్లు ఉన్నవి.
మోదుగ చెట్టు సరాసరి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ మోదుగ వృక్షం యొక్క పువ్వులు చిలక ముక్కులాగా కొక్కెం లా ఉండి నారింజ వర్ణంలో చాలా అందంగా ఉండి చూపరులను కనువిందు చేస్తాయి.
Moduga Chettu Uses in Telugu
ఈ మోదుగపూల పుప్పొడిని వినియోగించి abir అనే హోలీ రంగులలో కలిపే పదార్ధాన్ని తయారు చేస్తున్నారు. ఈ మోదుగ పూలను ఆకులను అనేక పూజా కార్యక్రమాలలో వినియోగిస్తున్నారు. ఈ పువ్వులు పరమ శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనవిగా మన పూర్వీకులు చెప్పుకొనేవారు.
ఈ చెట్టు యొక్క బెరడు ను ఎండబెట్టి దానిని హోమాలలో ఉపయోగించేవారు. ఈ బెరడు ని కాల్చి ఇంట్లో ఉంచడం ద్వారా చెడు వాసన మరియు దుర్గంధము పోగొట్టవచ్చు. చెట్టు యొక్క కలపను ప్యాకేజీ బాక్సుల తయారీలలో కూడా వినియోగిస్తున్నారు.
ఈ చెట్టు యొక్క ఆకులను పువ్వులను మరియు బెరడును నీళ్ల విరేచనాలకు, మొలలకు, ఉబ్బసంకు, మధుమేహానికి, కడుపులోని నులిపురుగులకు, ఔషదంగా కూడా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ చెట్టు గురించి దీని ఔషధ గుణాల గురించి మనలో చాలా మందికి తెలియక పోవడం గమనార్హం.
చెట్ల వలన మానవులుకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే మన పూర్వీకులు వృక్షో రక్షత రక్షితః అని అన్నారు. దీని అర్థం మనం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని ఈ విధంగా కాపాడతాయని. చివరిగా ఒక మాట ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం పది చెట్లను నాటాలి మరియు మీ పిల్లల చేత కూడా చెట్లను నాటించి వారికి చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను.
Similar Topics: