పర్యాయపదాలు అంటే మరొక పదానికి సమానమైన లేదా దాదాపు ఒకే విధమైన అర్థాన్ని కలిగి ఉండే పదాలు. మరొక విధంగా చెప్పాలంటే ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలు అంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.
కొన్ని విరివిగా మనం వినే మరియు పరీక్షలలో వచ్చే కొన్ని తెలుగు పదాలకు పర్యాయ పదాలు మనము Telugu Paryaya Padalu List అనే ఈ పోస్ట్ లో చూదాం.
మన బాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా పర్యాయ పదాలు చాల సరళం. పర్యాయ పాదాలను ఆంగ్లంలో synonyms అని అంటారు.
Most frequently asked paryaya padalu
- Swargam paryaya padalu: స్వర్గము = అమరలోకము (amara lokam), దేవలోకము (deva lokam), దివము (dhivamu), ఇంద్రలోకం (indhralokam), దేవభూమి (deva boomi), త్రిదశాలయము (thridasalayamu), త్రివిష్టము (thrivishtamu), ఊర్ధ్వలోకము (oordhwa lokamu), అమరపురము (amarapuramu), అవరోహము (avarohamu).
- Samudram paryaya padalu: సముద్రం = సంద్రము (sandhramu), సాగరము (sagaramu), సింధువు (sindhuvu), అంబుధి (Ambudhi), కడలి (Kadali).
- Shatruvu paryaya padalu: శత్రువు = వైరి (vyri), ఆహితుడు (ahithudu), ద్వేషణుడు (dhweshanudu), ద్విషత్తు (dhwipathu), రిపువు (ripuvu), సపత్నుడు (sapathnudu), దుర్హృదుడు (dhurshrudhudu).
- Nakshatram paryaya padalu: నక్షత్రం = చుక్క (chukka), తారకము (tharakamu), తార (thaara), ఉడుపు (udupu).
- Nadi paryaya padalu: నది = తరణి (tharani), తరంగిణి (tharangini), అబ్ధివధువు (abdhivaduvu), స్రవంతి (sravanthi), ద్వీపవతి (dhwipavathi), శైవలిని (sailavalini), అధ్వగ (adhwaga), కూలంకుష (kulamkusha), సాగరగామిని (saagaragaamini).
- Kuthuru paryaya padalu: కూతురు = పుత్రిక (puthrika), కుమార్తె (kumarthe), తనయ (thanaya), దుహిత (dhuhitha), సుత (sutha), సూన (suna), ఆత్మజ (aathmaja), కన్య (kanya), పుత్రి (puthri).
- Gurram paryaya padalu: గుర్రం = అశ్వము (aswamu), కుదరము (kudhuram), కింకరము (kinkaramu), తురగము (thuragamu).
- Pilli paryaya padalu: పిల్లి = బిడాలము (bidaalamu), మార్జాలము (maarjalamu), ఓతువు (oothuvu), చీలి (cheeli), పృషదంశకము (prushadamsakamu).
Buy Telugu Story Book for Kids Online
Telugu Paryaya Padalu for Panchabuthalu
పంచభూతాలు = పృథివ్యప్తేజోవాయురాకాశాలే (పంచభూతాలు: నేల, నిప్పు, గాలి, ఆకాశం, నీరు)
- నేల (earth) యొక్క తెలుగు పర్యాయ పదాలు
- నేల = భూమి, ధరణి, ధాత్రి, పృథ్వి, పుడమి, జగతి, ఇల (Nela = bhumi, dharani, dhathri, phrudhwi, pudami, jagathi, ila).
- నిప్పు (fire) యొక్క తెలుగు పర్యాయ పదాలు
- నిప్పు = మంట, అగ్ని, అగ్గి (Nippu = manta, agni, aggi).
- గాలి (air) యొక్క తెలుగు పర్యాయ పదాలు
- గాలి = వాయు, పవనం (Gaali = vayuvu, pavanamu).
- ఆకాశం (sky) యొక్క తెలుగు పర్యాయ పదాలు
- ఆకాశం = భువనము, మిన్ను, అంబరము, ఆకసము, ధ్రువము, దివి, గగనం, అంతరిక్షం, విభువు, చరాచరము (Aakasamu = bhuvanamu, minnu, ambharamu, akasamu, dhruvamu, dhivi, gaganamu, antharikshamu, vibhuvu, charaachamu).
- నీరు (water) యొక్క తెలుగు పర్యాయ పదాలు
- నీరు = ఉదకం, జలం (Neeru = udhakamu, jalamu).
Buy Telugu-English 1000 Useful Words Book Online
Few animals’ Paryaya Padalu In Telugu
కొన్ని జంతువులు వాటి పర్యాయ పదాలు
- పిల్లి (cat) యొక్క పర్యాయ పదాలు
- పిల్లి = బిడాలము, మార్జాలము (Pilli = bhidalamu, maarjalamu).
- కోతి (monkey) యొక్క పర్యాయ పదాలు
- కోతి = మర్కటము, కపి, వానరము (Kothi = markatamu, Kapi, vanaramu).
- గుర్రం (horse) యొక్క పర్యాయ పదాలు
- గుర్రం = అశ్వము, కుదరము, కింకరము, తురగము (Gurram = ashwamu, kudhuramu, kinkaramu, thuragamu).
- కుక్క (dog) యొక్క పర్యాయ పదాలు
- కుక్క = శునకము, కుర్కురము (Kukka = sunakamu, kukkuramu).
- పంది (pig) యొక్క పర్యాయ పదాలు
- పంది = సూకరం, వరాహం (Pandi = sukamu, varahamu).
- ఆవు (cow) యొక్క పర్యాయ పదాలు
- ఆవు = గోవు, పైరము, ధేనువు, పయిరము, పెయ్య (Aavu = govu, pyramu, dhenuvu, payiramu, peyyi).
- నెమలి (peacock) యొక్క పర్యాయ పదాలు
- నెమలి = మయూరము, బర్హిరము, హరి, మేఘనాదాలాపి, నట్టువపులుగు, నమ్మి, భుజంగభుక్కు, సారంగము, బర్హి, నీలకఓఠము, శిఖావలము, శిఖికేకి, నెమ్మి. (Nemali = mayuramu, barhiramu, hari, meghanaadhaalaapi, nattuvaoulugu, nammi, bhujamgabukku, saaramgamu, bharshi, neelakantamu, sikhaavalamu, sikhikeki, nemmi).
- మొసలి (Crocodile) యొక్క పర్యాయ పదాలు
- మొసలి = హాదగ్రహము, కడలిరాతత్తడి, మరునిడాలు, కంటకము, క్షీరశుక్లము, కుంభీరము, జలసూచి, ఝషము, ఝషాశనము, నక్రము, మకరము, గిలగ్రాహము, గ్రాహము, జలకంటకము, జలకపి, జిలజిహ్వము, జలనూకరము, అంబుగజము, అన్బుమర్కటము, అసిదంష్ట్రము, కుంభి. (Mosali = hudhagrahamu, kadalirathathadi, marunidalu, kantakamu, kshirasuklamu, kumbeeramu, jalasuchi, ghashamu, ghashasanamu, nakramu, makaramu, gilagrahamu, grahamu, jala kantakamu, jalakapi, jila jihvamu, jalanukaramu, ambhugajamu, anbumarkatamu, asindhrashtamu, kumbi)
Telugu Paryaya padalu list for other natural resources
- నక్షత్రం (star) యొక్క పర్యాయ పదాలు
- నక్షత్రం = చుక్క, తారకము, తార, ఉడుపు (Nakshathramu = chukka, tharakamu, thara, udupu).
- బంగారం (gold) యొక్క పర్యాయ పదాలు
- బంగారం = పసిడి, పుత్తడి, కాంచనము, వర్ణము, సువర్ణము, పైడి, భూరి, కనకము, స్వర్ణము, భృంగారము, కుసుంభము. (Bangaramu = pasidi, puthadi, kamchamu, varnamu, suvarnamu, pydi, bhoori, kanakamu, swaramu, brhumgaramu, kusumbhamu).
- సూర్యుడు (sun) యొక్క పర్యాయ పదాలు
- సూర్యుడు = రవి, భాస్కరుడు, భానుడు, అంబరీషుడు, ఉష్ణుడు, దినకరుడు, దివాకరుడు, ఖచరుడు, ప్రభాకరుడు, పద్మాసనుడు (Suryudu = ravi, Bhaskarudu, bhanudu, ambarishudu, ushnudu, dhinakarudu, dhivaakarudu, khacharudu, prabhakarudu, padhmasanudu).
- సముద్రం (sea) యొక్క పర్యాయ పదాలు
- సముద్రం = సంద్రము, సాగరము, సింధువు, అంబుధి, కడలి (Samudhramu = samdhramu, saagaramu, simdhuvu, ambhudi, kadali).
- చెట్టు (plant) యొక్క పర్యాయ పదాలు
- చెట్టు = వృక్షము, తరువు, మాను, మ్రాను, విటపము, భూరుహము, మహీరుహము (Chettu = vrukshamu, tharuvu, maanu, mraanu, vipatamu, bhuroohamu, maheeramu).
Buy Chandhamama Kathalu Online
Telugu paryaya padalu list of other words
- శివుడు యొక్క పర్యాయ పదాలు
- శివుడు = ఈశ్వర, కేశవా, శివ, ముక్కంటి, త్రినేత్రుడు, మహేశ్వర (Shivudu = eeshwara, keshava, shiva, mukkanti, thrinethrudu, maheshwarudu).
- పార్వతీదేవి యొక్క పర్యాయ పదాలు
- పార్వతీదేవి = ఉమ, కాత్యాయిని, గౌరీ,కాళీ, నారాయణి, అంబిక, ఆర్య, దాక్షాయణి, గిరిజ,మేనకాత్మజ, ధేనుక, భార్గవి, శారద, జయ, ముక్కంటివెలది, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గ, చండిక, భైరవి, శాంభవి, శివాణి, కాళి, శ్యామ, లలిత, అమ్మ, భగమాలిని, మాతంగి, మాణిక్యాంబ, శతాక్షి, శాకంభరి, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మ, సురారుల కడుపారడి బుచ్చినయమ్మ. (Parvathi devi = uma, kaathyaini, gouri, khali, narayani, ambhika, aarya, dhakshyayani, girija, menakathmaja, dhenuka, bhargavi, sharadha, jaya, mukkantiveladhi, hemavathi, eeshwari, shiva, bhavani, rudhrani, sharvani, sarvamangala, aparna, parvathi, dhurga, chandika, bhyravi, shambavi, shivani, shyama, lalitha, amma, bhagamaalini, maathangi, manikyamba, sathaakshi, sakhambari, amala gannayamma, muggurammala mulaputamma, pedhamma, suraarula kaduparadi bhuchinayamma)
- విగ్రహము (Statue) యొక్క పర్యాయ పదాలు.
- విగ్రహము = ప్రతిమ, ప్రతిమానము, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబము, ప్రతికృతి, అర్చ, ప్రతినిధి, ప్రతియాతనము. (Vigrahamu = prathima, prathimanamu, prathichaya, prathibimbhamu, prakruthi, archa, prathinidhi, prathiyathanamu).
- మానుషుడు (human being) యొక్క పర్యాయ పదాలు.
- మానుషుడు = మనుష్యుడు, జనుడు, మర్త్యుడు, మనుజుడు, మానవుడు, నరుడు, పంచజనుడు. (Maanavudu = manushyudu, janudu, marthyudu, manujudu, maanavudu, narudu, panchajanudu).
- యముడు (God of Death) యొక్క పర్యాయ పదాలు.
- యముడు = కొమరుడు, కాలుడు, దక్కిణఓపుసామి, ధర్మరాజు, పితృపతి, యమరాట్టు, దండధరుడు, శ్రాద్ధదేవుడు, సమవర్తి, పరేతరాట్టు, కృతాంతుడు, యమునాభ్రాత, గుడెతాల్పు, శమనుడు, వైవస్వంతుడు, జమునసయిదోడు,పెతరులసామి, జముడు. (Yamudu = komarudu, kaludu, dhakshinaopuswami, dharma raju, pithrupathi, yamaraattu, dhandadharudu, sradhadevudu, samavarthi, paretharaattu, krunthaathudu, yamunaabratha, gudethaalpu, samanudu, vyvaswanthudu, jamunasaidhodu, petharulasaami, jamudu).
- నిజము (truth) యొక్క పర్యాయ పదాలు
- నిజము = సత్యము, నిక్కము, వాస్తవం (Nijamu = sathyamu, nikkamu, vasthavamu).
- శ్రమ (exertion) యొక్క పర్యాయ పదాలు
- శ్రమ : అలసట, అలుపు, బడలిక (Srama = alasata, alupu, badalika).
- హనుమంతుడు (Hanuman) యొక్క పర్యాయ పదాలు
- హనుమంతుడు = పవనసుతుడు, ఆంజనేయుడు, మారుతి (Hanumanthudu = pavanasuthudu, anjaneyudu, maaruti).
- శ్రీ వేంకటేశ్వరుడు యొక్క పర్యాయ పదాలు
- శ్రీ వేంకటేశ్వరుడు = బాలాజీ, ఏడుకొండలు, వెంకన్న, వెంకటరమణ. (shri venkateshwarudu = balaji, yedukondalu, venkanna, venkataramana).
- స్త్రీ (she) యొక్క పర్యాయ పదాలు
- స్త్రీ = వనిత, మహిళ, పడతి, ఇంతి, అబల, హోమలి, ఆడది. (sthri = vanitha, mahila, padathi, inthi, abhala, homali, aadadhi).
- జైలు (Jail) యొక్క పర్యాయ పదాలు
- జైలు = బందీఖాన, కారాగారము (Jailu = bandheekana, kaaraagaaramu).
- మరణము (Death) యొక్క పర్యాయ పదాలు
- మరణము = చావు, కాలధర్మము, ప్రళయము, అంతము, నాశము, హింస, ప్రమీలనము, కాలము చెల్లు, మృత్యువు, త్యజము, నిధనము, దీర్ఘనిద్ర. ( Maranamu = chavu, kaaladharmamu, pralayamu, anthamu, nasanamu, himsa, prameelanamu, kaalamu chellu, mrythyuvu, thwajyamu, nidhanamu, dheerganidhra).
- సామెత (Proverb) యొక్క పర్యాయ పదాలు
- సామెత : లోకోక్తి, నానుడి, పురాణోక్తి (Saametha = lokokthi, naanudi, puraanokthi).
- తల (head) యొక్క పర్యాయ పదాలు
- తల = శిరస్సు, మస్తకము, మూర్ధము, తలకాయ (Thala = sirassu, masthakamu, maardhamu, thalakaya).
- తనయుడు (son) యొక్క పర్యాయ పదాలు
- తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు, కుమారుడు, వారసుడు, వంశోధరకుడు, కొమరుడు (Thanayudu = koduku, puthrudu, suthudu, kumaarudu, vaarasudu, vamsodharakudu, komarudu).
- జలధి (sea) యొక్క పర్యాయ పదాలు
- జలధి = కడలి, అర్ణవము (Jaladhi = kadali, arnavamu).
- వెఱ్ఱివాడు (lunatic) యొక్క పర్యాయ పదాలు
- వెఱ్ఱివాడు = అపస్మారి, అమాయకుడు, మందబుద్ధి, ఉన్మత్తుడు, వెడగు, వీఱిడి, వేదుఱు, తిక్క, వెంగలి, వెంబరివిత్తు, వెకలి, బుద్ధిహీనుడు.
- మజ్జిగ (butter milk) యొక్క పర్యాయ పదాలు
- మజ్జిగ = మార్జిక, మోరి, మోరు, తక్రము, చల్ల, మోరట, కాలశేయము, గోరసము, ఘనరసము,ఘోలము, దండాహతము, మధితము, కచ్చరము, కటురము, స్తన్యజము. (Majjiga = marjiga, mori, moru, thakramu, challa, moorata, kaalaseyamu, gorasamu, ghanarasamu, gholamu, dhandahathamu, madhithamu, kacharamu, katuramu, sthanyajamu).
- పండుగ (festival) యొక్క పర్యాయ పదాలు
- పండుగ = పబ్బం, వేడుక, పర్వం (Panduga = pabbam, veduka, parvam).
- శత్రువు (enemy) యొక్క పర్యాయ పదాలు
- శత్రువు = విరోధి, వైరి, రిపు, ప్రత్యర్థి (Sathruvu = virodhi, vyri, ripu, prathyardhi).
- ముఖము (face) యొక్క పర్యాయ పదాలు
- ముఖము = మోము, అరవిందము, మొహము (Mukamu = momu, aravindhamu, mohamu).
- గుండె (heart) యొక్క పర్యాయ పదాలు
- గుండె = హృదయం, మనసు, మది, ఎద (Gunde = hrudhayamu, manasu, madhi, yedha).
- సోదరుడు (brother) యొక్క పర్యాయ పదాలు
- సోదరుడు = తమ్ముడు, అన్న, తోబుట్టువు ( Sodharudu = thammudu, anna, thobuttuvu).
- మొద్దు (Stupid) యొక్క పర్యాయ పదాలు
- మొద్దు = ధ్రువము, మొరడు, మోటు, మోడు, మ్రోడు, శంకువు, స్దాణువు. (Modhu = dhruvamu, moradu, motu, modu, mrodu, sankuvu, sthanuvu)
- స్నేహం (friendship) యొక్క పర్యాయ పదాలు
- స్నేహం = చెలిమి, సావాసం, మిత్రుడు, మైత్రి (Snehamu = chelimi, saahasamu, mithrudu, mythri).
- భార్య (wife) యొక్క పర్యాయ పదాలు
- భార్య = ఇల్లాలు, ఇంతి, పత్ని, సతి, అర్ధాంగి, ఆలి, సహధర్మచారిణి, పెండ్లాము (Bharya = illaalu, inthi, pathni, sathi, ardhangi, aali, sahadharma charini, pendlaamu).
- భర్త (husband) యొక్క పర్యాయ పదాలు
- భర్త = మొగుడు, పతి, మగడు, పెనిమిటి, ఇంటాయన (Bhartha = mogudu, pathi, magadu, penimiti, intaayana).
- రక్తము (blood) యొక్క పర్యాయ పదాలు
- రక్తము = నెత్రు, ఎఱ్ఱ, నల్ల, అంగజము, నెత్తురు, రుధిరము, అసృక్కు, హితము, శోణితము, అస్రము, అసృవు, కింకర, కీలాలము, క్షతజము. (Rakthamu = netrhu, yerra, nalla, angajamu, nethuru, rudhiramu, ashrukku, hithamu, sonithamu, asramu, ashruvu, kinkara, kilaalamu, kshithajamu)
- నిచ్చెన (ladder) యొక్క పర్యాయ పదాలు
- నిచ్చెన = తాప, అధిరోహిణి, నిశ్శ్రేణి, ఆరోహణము (Nichena = thapa, adhirohini, nishreni, aarohanamu).
- నింద (blame) యొక్క పర్యాయ పదాలు
- నింద = నిందనము, పరీవాదము, అపవాదము, దూఱు, సెగ్గింపు, అపదూఱు, అధిక్షేపము, ఉపక్రోశము, ఆక్షేపము, నిర్వౌదము, గర్హణము. (Nindha = nindhanamu, pareedhamu, apavaadamu, dhoorhu, seggimpu, apadhoorhu, adhikshepamu, upakrosamu, aakshepamu, nirvoudamu, garshanamu).
- మంత్రి (minister) యొక్క పర్యాయ పదాలు
- మంత్రి = నియోగి, అమాత్యుడు, ప్రెగడ, ప్రెగ్గడ. (Manthri = niyogi, amaathyudu, pregada, preggada)
- పాపము (sin) యొక్క పర్యాయ పదాలు
- పాపము = కల్మషము, పంకము, దోషము, దోసము, పాప్మము, ఏనస్సు, అంకము, ఆగము, కలుషము, వృజినము, అఘము, దురితము, దుష్కృతము, కిల్బిషము, ఓఘము. (Papamu, kalmashamu, pankamu, dhoshamu, dhosamu, paapmamu, yenassu, ankamu, aagamu, kalushamu, vrujinamu, aghamu, dhurithamu, dhrushruthamu, kilbhishamu, ooghamu).
- వెండ్రుకలు (hair) యొక్క పర్యాయ పదాలు
- వెండ్రుకలు = కేశములు, కురులు, శిరోరుహములు, చపలములు, చికురములు, నెఱకలు, నెఱులు, కుంతలములు, వాలములు, అంగజములు, అలకములు, కచములు. (Vendrukalu = kesamulu, kurulu, siroruhamulu, chapalamulu, chikuramulu, nerrakalu, nerralu, kunthalamulu, vaalamulu, angajamulu, alakamulu, kachamulu)
- వెన్న (butter) యొక్క పర్యాయ పదాలు
- వెన్న= మంధసారము,హైయంగవీనము, మంధజము, గవీనము, దధిజము, నవనీతము. (Venna = mandasaaramu, haiyamgaveenam, mandajamu, gaveenamu, dadhijamu, navaneethamu)
- వైద్యుడు (doctor) యొక్క పర్యాయ పదాలు
- వైద్యుడు = జైవాతృకుడు, వెజ్జు, మందరి, అగదంకారుడు, భిషక్కు, భిషజుడు, రోగహారి, చికిత్సకుడు, జీవదుడు, జైవాతృకుడు, దోషజ్ఞుడు, ప్రాణదుడు. (vydhydu = jaivaathrukudu, vejju, mandari, agadamkarudu, bhishakku, bhishajudu, rogahari, chikithsakudu, jeevadhudu, jaithrukudu, dhoshagnudu, pranadhudu).
- శనగలు (Chickpeas) యొక్క పర్యాయ పదాలు
- శనగలు = సెనగలు, సతీనము, హరేణువు, చణకము, త్రిపుటము. (Sanagalu = senagalu, satheenamu, harenuvu, chanakamu, thriputamu).
- శవము (dead body/Corpse) యొక్క పర్యాయ పదాలు
- శవము = పీనుగు, కళేబరము, బడుగు, సబము, కటము, కుణపము, క్షితివర్ధనము, పూయము, సబరము (sevamu = peenugu, kalebharamu, badugu, sabamu, katamu, kunapamu, kshithivardhanamu, puyamu, sabaramu).
- శరీరము (body) యొక్క పర్యాయ పదాలు
- శరీరము = కళేబరము, దేహము, మెయి, మేను, ఒడలు, సంహవనము, గాత్రము, వపుస్సు, వర్ష్మ, విగ్రహము, కాయము, మూర్తి, తనువు. (sareeramu = kalebharamu, dhehamu, meyi, menu, odalu, samhavanamu, gathramu, vapussu, varpma, vigrahamu, kayamu, moorthi, thanuvu).
- శపధము (oath) యొక్క పర్యాయ పదాలు
- శపధము = ప్రతిజ్ఞ, ప్రమాణము, ఆన, ఒట్టు, బాస, ప్రతిన, ప్రత్యయము, సంగరము, బాఢము, సంధ్య సత్యము, శపనము, పణము, పరిగ్రహము. (sepadhamu = prathigna, pramanamu, aana, ottu, basa, prathina, prathyamu, samgaramu, baadamu, samdhya, sathyamu, sapanamu, panamu, parigrahamu).
- బంతి (Ball) యొక్క పర్యాయ పదాలు
- బంతి = చెండు, గేందుకము, గేందువు, కందుకము, గుడము, గేండుకము. (banthi = chendu, gendhukamu, gendhuvu, kandhukamu, gudamu, gendukamu).
- బంధువులు (Relatives) యొక్క పర్యాయ పదాలు
- బంధువులు = బందువు, చుట్టలు, చుట్టాలు, చుట్టములు, విందులు, బందుగులు. (Bandhuvulu = bandhuvu, chuttalu, chuttaalu, chuttamulu, vindhulu, bandhugulu).
- పొగ (Smoke) యొక్క పర్యాయ పదాలు
- పొగ = అగ్నివాహము, ఆవిరి, మేచకము, మరుద్వాహము, , కచమాలము, ఖతమాలము, ధూమము, మేఘయోని, ధూపము, పోన, వ్యామము, శిఖిధ్వజము. (Poga = agnivahamu, aaviri, mechakamu, marudhwahamu, kachamaalamu, khathamaalamu, dhumamu, meghayoni, dhupamu, pona, vyamamu, sikhidhwajamu).
- పౌరుషము (Masculinity) యొక్క పర్యాయ పదాలు
- పౌరుషము = మగతనము, విక్రమము, మగటిమి, కడిమి, గండు, బీరము. (pourushamu = magathanamu, vikramamu, magatimi, kadimi, gundu, bheeramu).
- ప్రేమ (Love) యొక్క పర్యాయ పదాలు
- ప్రేమ = అభిమానము, ఆబంధము, అనురక్తి, రాగము, అనురాగము, ప్రణయము, అభిమతి, అనుగు, అనురతి, మురిపెము, మక్కువ, ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి. (Prema = abhimanamu, aabandhamu, anurakthi, ragamu, anuragamu, pranayamu, abhimathi, anugu, anurathi, muripemu, makkuva, priyathwamu, priyathanamu, preethi).
- ప్రయాణము (Journey) యొక్క పర్యాయ పదాలు
- ప్రయాణము = గమనము, యాత్ర, వ్రజ్య, గమము, ప్రస్ధానము. (Prayanamu = gamanamu, yathra, vajya, gamanamu, prasthanamu).
- పేగు (Intestine) యొక్క పర్యాయ పదాలు
- పేగు = ఆంత్రము, ఇడ, ధమని, పురీతత్తు, సిర. (Pegu = aanthramu, ida, dhamani, purithathu, sira).
- యవ్వనము (Youth/Young) యొక్క పర్యాయ పదాలు
- యవ్వనము = యౌవనము, పరువము, పాయము, ప్రాయము, జవ్వనము, యక్తవయసు. (Yuvvanamu = yovanamu, paruvamu, paayamu, prayamu, javvanamu, yukthavayasu).
- యుద్ధము (War) యొక్క పర్యాయ పదాలు
- యుద్ధము = పోట్లాట, వివాదము, గొడవ, పోరాటం, కలహము, తలపడు, సమరము, దురము, పోరు, అభ్యామర్దము, చివ్వ, రణము, ఆస్కందనము, ప్రధనము, ప్రవిదారణము, సంస్ఫోటము. (Yudhamu = potlatu, vivadhamu, godava, poratamu, kalahamu, thalapadu, samaramu, dhuramu, poru, abhyarthamu, chivva, ranamu, askandhamu, pradanamu, pravidharanamu, samspotamu).
- యజ్ఞము (Yajna) యొక్క పర్యాయ పదాలు
- యజ్ఞము = సవము, సవనము, హవము, ముఖము, క్రతువు, మన్యువు, అధ్వరము, యాగము, సప్తతంతువు. (Yagnamu = savamu, savanamu, havamu, mukhamu, krathuvu, manyuvu, adhwaramu, yogamu, sapthathanthuvu).
- మొలక (Sprout) యొక్క పర్యాయ పదాలు
- మొలక = మోము, మొక్క, మోటిక, మోసు, అంకురము, నిసువు. (Molaka = momu, mokka, motika, mosu, ankuramu, nisuvu).
- వాన (Rain) యొక్క పర్యాయ పదాలు
- వాన = వర్షము, చిత్తడి, అంబరీషము, వృష్టి, ఆసారము, జడి, జల్లి, జల్లు, తొలకరి, దల్లు, ముసురు, సోవ, మేఘపుష్పము. (Vana = varshamu, chithadi, ambharishamu, vrushti, aasaaramu, jadi, jalli, jallu, tholakari, dhallu, musuru, sova, meghavarshamu).
- వాయుదేవుడు (God of the air) యొక్క పర్యాయ పదాలు
- వాయుదేవుడు = కరువలి, తెమ్మెర, ఈద, గంధవాహుడు, అనిలుడు, ఆశుగుడు, సమీరుడు, నభస్వంతుడు, మారుతుడు, వలి, మరుతేరు శ్వసనుడు, స్పర్షనుడు, మాతరిశ్వుడు, పృషదస్వుడు, గంధవహుడు, మరుత్తు, జగత్ప్రాణుడు, సమీరణుడు, వాతుడు, పవమానుడు, ప్రభంజనుడు, ప్రకంపనుడు, అతిబలుడు. (Vayudhevudu = karuvali, themmara, eedha, gandhavahudu, aniludu, aasugudu, sameerudu, nabhaswanthudu, maruthudu, vali, marutheruswarudu, sparshanudu, matharishudu, prushadhasvudu, gandhavahudu, maruthu, jagathpranudu, sameeranudu, vaathudu, pavamaanudu, prajamjanudu, prakampanudu, athibaludu).
మరికొన్ని పర్యాయ పదాలను మేము ఇక్కడ మీ కొరకు జతపరచడానికి ప్రయత్నిస్తున్నాము……………………….
Other Posts