The seeds of Bengal gram are small, dark, and rough. The beans can be soaked in water and cooked with vegetables in a variety of curries that are delicious with roti, chapattis, puri, rice, kulcha, and bread. After soaking, you can sprout it and eat it as a good protein and enzyme source.
Senagapappu in English
Bengal gram or chana dal: These are yellow-colored raw split beans, which are used to prepare delicious curries.
Chickpeas, Egyptian pea, or garbanzo: these are whole beans without removing the brown outer shell. These beans are used in sprouting and soaking in water before being taken as food.
Roasted Chana Dal: These are half beans, which are split into two parts and soaked before roasting in the pan.
Uses of senagapappu in English
- It provides energy.
- Improves digestion and gives essential nutrients.
- It improves bone health as it is rich in calcium.
- It reduces the adverse effects of anemia.
- It prevents diabetes by lowering blood glucose levels.
Sengapappu in Telugu
నా చిన్నతనంలో నేను కిరాణా షాప్ కి సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా సరుకులు తీసుకున్నందుకు గానూ ఆ కిరానా షాపతను నాకు సెనగలు బెల్లం కలిపిన పొట్లము తాయిలం గా ఇచ్చేవాడు. ఇలా నా బాల్యంలో శనగలకి ప్రత్యేక స్థానం ఉంది. అదేవిధంగా విజయదశమి వచ్చినప్పుడు ఆయుధాల పండుగ రోజు కూడా సెనగలు, బెల్లం, బొరుగులు కలిపి నైవేద్యంగా పెట్టి పిల్లలకు పంచిపెట్టేవారు. శ్రీరామనవమినాడు కూడా తాలింపు వేసిన నల్ల గుగ్గిళ్ళ మరియు వడపప్పు బెల్లంతో చేసిన పానకంను ప్రసాదంగా పంచిపెట్టేవారు. ఈ గుగ్గిళ్ళు అంటే శ్రీరామునికి ఎంతో ప్రీతి అని మా నానమ్మ చెప్తూ ఉండేది. మనం చిన్నప్పుడు చదివినా పాఠాలలో కూడా వినే ఉంటాం సెనగలు తినడం ఆరోగ్యానికి మంచిదని. శనగలను ఇంగ్లీషులో chickpeas అని అంటారు. పొట్టు తీసి వేయించిన శనగలను శనగపప్పు లేదా సాయి పప్పు అని, పొట్టుతీయని ముడి శనగలను గుగ్గిళ్లు అని పొట్టు తీసి బ్రద్దలు కొట్టిన శనగలను పచ్చనగ పప్పుఅని అంటారు. శనగలతో అనేకరకాలైన పిండి వంటలు, స్నాక్స్ తయారు చేస్తారు. ఉత్తర భారతదేశంలో లావుపాటి తెల్ల గుగ్గిళ్ళ తో చేసిన కూర ను చోలే అని అంటారు.
ఒక రోజులో మన కి అవసరమయ్యే ప్రోటీన్ మొత్తంలో 1/3 వంతు ప్రోటీన్లు కేవలం సెనగల నుంచే దొరుకుతుంది.
శనగలలో ఫ్రీ రాడికల్స్ ని నియంత్రించే ఒక ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ మన జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతుంది.
శనగల లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు చాలా మెండుగా ఉంటాయి. అందువలన శనగలు ఎముకలు ఆరోగ్యంగా ఉంచి గట్టి పడడానికిడానికి ఎంతో తోడ్పడతాయి.
ఇప్పుడు సెనగలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి తెలుసుకుందాం.
శనగలను మనలో చాలా మంది అనేక విధాలుగా తింటారు. చాలామంది మొలకెత్తిన, పచ్చిశనగలను మరియు ఉడకబెట్టిన శెనగలను గుగ్గిళ్ళ రూపంలో మరియు కూరల రూపంలో కూడా తింటారు.
శాఖాహార ఆరోగ్య విధానం అవలంబించేవారు అధిక మోతాదులో శనగలనును రోజువారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మాంసాహారం నుంచి ఎంత మోతాదులో అయితే మనకు ప్రొటీన్లు లభిస్తాయో అంతకు మించిన ప్రోటీన్లు మనకు శనగలలో దొరుకుతాయి.
డ్రై ఫ్రూట్స్, బాద, జీడిపప్పు వంటి ఖరీదైన పదార్థాలను కొనలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా శనగలు తీసుకోవచ్చును. అందుకే సెనగలును పేదవాడి బాదంపప్పు అని కూడా పిలుస్తారు.
మనకు మార్కెట్లో సెనగలు అనేక రూపాలలో నల్ల శనగలు మొలకెత్తినవి మరియు వేయించిన శనగలు, ఉప్పు సెనగలు అని రకరకాలుగా దొరుకుతాయి.
రక్తహీనత వున్నవారు (for anemia):
అదేవిధంగా శనగలను రోజు తినడం ద్వారా మన శరీరానికి ఐరన్ను గ్రహించే శక్తి మెరుగుపడుతుంది. ఇందువలన అనీమియా రక్తహీనత వంటి జబ్బులతో బాధపడేవారు, సంఘాలు తిండడం ద్వారా ఎంతో ఉపశమనం పొందగలరు.
రోజు ఒక గుప్పెడు నిండా శనగలు తినడం ద్వారా మనం ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
షుగర్ వ్యాధి నివారణకు (for diabetic people):
మొలకెత్తిన శనగలు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం కోవడం ద్వారా శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకుని షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
ఊబకాయం నివారించుటకు (for obesity):
సెనగలు వలన కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండి ఊబకాయం వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
ఎముకలు గట్టిపడటానికి (for bone development):
శనగలలో కాల్షియం ఎక్కువ మోతాదులో ఉన్నందువలన పాల పదార్థాలతో అలర్జీ లాక్టోజ్ ఇంటోలరెన్స్ సమస్య ఉన్నవారు, పాలకు ప్రత్యామ్నాయంగా శనగలను తినవచ్చు. కాబట్టి తరచుగా శనగలను తినడం ద్వారా ఎముకలు గట్టి పడి స్ట్రాంగ్ గా తయారవుతాయి.
డైటింగ్ చేసే వారికి (for weight loss):
డైటింగ్ చేసేవారు ప్రతిరోజు శనగలను తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
పిల్లలకు స్నాక్స్ గా (as snaks):
చిన్నపిల్లలకి సెనగలు బెల్లం కలిపి తినిపించడం వలన వారి శరీరం ఎముకలు గట్టి పడి మెరుగ్గా తయారవుతారు.
శక్తిని పెంచడం (for energy):
శనగలనులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడూ ఉత్తేజంగా శక్తిమంతంగా చేస్తాయి శనగలు లో ఉండే ఐరన్ ప్రోటీన్ మన శరీర శక్తి స్థాయిలను ఎల్లప్పుడూ మెరుగుపరుస్తూ ఉంటాయి.
కిడ్నీ పనితీరు కి (for better kidney function):
సెనగపప్పులో ఎక్కువగా అంటి ఆక్సిడెంట్స్ మరియు క్లీనినెస్ గుణము ఉండటం వలన మన శరీరంలో ఏర్పడే అధిక ఉప్పు ను బయటకు పంపించి వేస్తుంది, దీని మూలంగా కిడ్నీలపై అధిక ఒత్తిడిని తొలగించడం ద్వారా కిడ్నీ సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. అందువలన కిడ్నీ సమస్యలు ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో సెనగపప్పు ను చేర్చుకోవడం మంచిది.
కామెర్లకు (to cure jaundice):
లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరియు లివర్ లో కొవ్వు వంటి వ్యాధులు ఉన్నవారు సెనగలు తీసుకోవడం చాలా మంచిది.
సంతానలేమి సమస్యలకు (for sperm count):
పిల్లలు పుట్టని వారు మరియు సంతానలేమి సమస్యలు ఎదుర్కొనే వారు శనగలను తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా సంతానలేమి సమస్యలు ఉన్న మగవారిలో వీర్యకణాలు వృద్ధి తక్కువగా ఉండటం వలన సంతానోత్పత్తి లో సమస్యలు తలెత్తుతాయి అలాంటివారు గుప్పెడు సనగలు ఉడకబెట్టి వాటిని ఆవు నేతితో కలిపి ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు ద్వారా తీసుకొని వీర్యకణాల వృద్ధి చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల సంతానలేమి సమస్యలు దూరమవుతాయి.
చివరిగా :
శనగలను తినడం ఆరోగ్యానికి మంచిదే అయినా ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం నొప్పి కలిగే ప్రమాదం ఉంది కావున తగిన మోతాదులో శనగలను తీసుకోవడం చాలా మంచిది.