Home » General Topics » Dondakaya in English: Other Names, Benefits, Facts, Curries, Farming

Dondakaya in English: Other Names, Benefits, Facts, Curries, Farming

Our ancestors grew only a few basic types of vegetables back then compared to what we have today. One of those is Dondakaya. It’s interesting to note that because this plant was more prevalent in wet fields or agricultural fields, farmers regarded it as a weed. Hence, our ancestors used to obtain this vegetable without cultivating it in their fields. Additionally, it has medicinal properties and health benefits, particularly the plant’s leaves, which have been used to treat wounds. Here you can find the English word for Dondakaya vegetable and interesting facts about Dondakaya in English, which you can rarely learn elsewhere.

Dondakaya English names

Dondakaya in English

This plant has glabrous leaves and single tendrils, and it is a perennial climber. The leaves measure 6–8.5 cm in length and 6–8 cm in width, and they have five lobes.

దొండకాయను ఇంగ్లీషులో ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేరులతో పిలుస్తారు. కానీ దీని యొక్క సాధారణ ఇంగ్లీష్ పేరు ఇవి గార్డ్ (Ivy gourd), దీని యొక్క మిగతా పేర్లను ఈ క్రింది ఇచ్చిన లిస్టులో గమనించగలరు. తెలుగులో దీనిని బుడంకాయ (budamkaya) అని కూడా పిలుస్తారు

The English names for this fruit or vegetable include…..

  1. Ivy gourd
  2. Rashmato vegetable (American name)
  3. Kundru vegetable
  4. Scarlet gourd
  5. Pointed gourd
  6. Little gourd
  7. Small gourd
  8. Coccinia
  9. Baby watermelon
  10. Kovakkai
  11. Tindora
  12. Kowai fruit
  13. Pak Tamlueng

డొంకాయ యొక్క ఉపయోగాలు తెలుగు భాషలో ఈ పోస్ట్ చివరిలో ఇవ్వబడ్డాయి.

English names of dhondakayi or donda
Dondakaya in English

Get Tasty Dondakaya Pickle Online

Dondakaya (Ivy gourd) Sceintific Name

Coccinia grandis is the scientific or botanical name of the Ivy gourd.

Order: Cucurbitales
Family: Cucurbitaceae
Genus: Coccinia

Dondakaya Names in Other Languages

  1. Bimbika in Sanskrit
  2. Tendli in Hindi
  3. Tonde Kayi in Kannada
  4. Tondli in Marathi
  5. Toruni in Bengali
  6. Kovakka in Malayalam
  7. Barela in Nepali
  8. Manoli in Tulu
  9. Phak khaep in Thailand)
  10. Telakucha in Bangladesh
  11. Pepasan in Malaysia
  12. Hong gua in China
  13. Pepino cimarrón in Spanish

Uses of Dondakaya in English

Uses of Ivy gourd for health
  • Raw ivy gourd leaves provide the best health benefits.
  • Studies show that ivy gourd can be used to treat kidney stones.
  • It improves overall immunity to fight against different pathogenic agents.
  • Reduces the risk of metabolic diseases developed by obesity.
  • It lowers blood glucose levels in diabetic patients.
  • It helps in decreasing serum uric acid levels, thereby improving kidney health and functions.
  • Reduces the severity of coughs and colds according to recent studies.
  • Ivy gourd is also excellent for the nervous and cardiovascular systems.
  • The entire plant can regulate high blood pressure in humans. 
  • It helps us overcome issues brought on by fatigue. 
  • It has the ability to treat skin-related infections and diseases.
  • Juice from ivy gourd leaves or fruits is effective in treating diabetes and its associated problems.
  • Some respiratory conditions, such as asthma, are treated by consuming ivy gourd plant products. 
  • The entire plant contains a significant amount of beta-carotene, which helps the heart function better.
  • This plant’s fruit treats skin conditions by eradicating bacteria and repairing skin tissue. 
  • Constipation and other digestive issues are relieved by consuming foods prepared with ivy gourd.  
  • Inflammation is regulated by the extract obtained from this plant’s leaves.
  • Kidney stone formation is avoided by dondakaya fruit. 
  • Ivy gourd aids in cancer prevention in long-term consumption.
  • Eating ivy-gourd curry regularly increases metabolism.

Dondakaya Uses in Telugu

  1. పచ్చి దొండకాయ ఆకులు మనకు ఉత్తమ ప్రయోజనాలను అందిస్తాయి.
  2. కిడ్నీలో రాళ్లను నయం చేసేందుకు దొండకాయను ఉపయోగించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
  3. దొండకాయ చెట్టు ఆకులు, వేర్లు మరియు పండ్లు కూడా నాడీ మరియు హృదయనాళ వ్యవస్థలను మెరుగుపరుచుటకు అద్భుతమైనవి.
  4. దొండకాయ మొత్తం మొక్క మానవులలో అధిక రక్తపోటును నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
  5. అలసట వల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికి దొండకాయ మనకు సహాయపడుతుంది.
  6. దొండకాయ చెట్టు ఆకులు లేదా పండ్ల నుండి తీసిన రసం మధుమేహం మరియు దాని సంబంధిత సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  7. ఉబ్బసం వంటి కొన్ని శ్వాసకోశ పరిస్థితులు దొండకాయ మొక్కల నుంచి తాయారు చేసిన పదార్ధాలను తీసుకోవడం ద్వారా కొంతవరకు నయమవుతాయి.
  8. ఈ మొక్కలో బీటా కెరోటిన్ పదార్థం ఎక్కువ మొత్తంలో లభిస్తుంది, ఇది గుండె మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
  9. ఈ మొక్క యొక్క పండు బ్యాక్టీరియాను నిర్మూలించడం లో మరియు చర్మ కణజాలాన్ని సరిచేయడం ఆరోగ్యం గా ఉంచుటలో చాల దోహద పడుతుంది.
  10. మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలు దొండకాయ తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందుతాయి.
  11. ఈ మొక్క ఆకుల ద్వారా శరీరంఫై ఏదయినా వాపు ఉంటె ఆ వాపును తగ్గించవచ్చు.
  12. ఊబకాయం, కిడ్నీలో రాళ్లను దొండకాయ పండు నివారిస్తుంది.
  13. దొండకాయ క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
  14. దొండకాయతో తయారీ చేసిన కూరలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీవక్రియను మెరుగు పరచవచ్చు.

Dondakaya curries types

Dondakaya fry recipe
Bendakaya Fry
  • Dondakaya masala fry
  • Andhra dondakaya and Onian mixed gravy
  • Dondakaya Tomato Kura
  • Dondakaya ulli karam 
  • Gutti Dondakaya Masala Kura
  • Dondakaya thiyya kura
  • Dondakaya barada
  • Tindora ulli pakora recipe.
  • Dondakaya pachadi
  • Dondakaya pakoda
  • Dondakaya bajji
  • Dondakaya pulusu
  • Dondakaya vepudu
  • Dondakaya masala kura.
  • Dondakaya kobbari fry
  • Dondakaya verusanaga vepudu recipe
Facts about Ivy Gourd
Some Facts about Ivy gourd

Some Facts about Ivy gourd (Dondakaya)

  • Ivy gourd is widely distributed throughout Asia, Africa, and the Pacific Islands because it is a tropical plant, meaning it thrives in warm, humid environments.
  • It bears fruit all year long and is a climbing vine with tuberous roots.
  • In Ayurveda medicine, all parts of the plant have been considered a good source of life-saving products.
  • In India, the leaves and roots are used as a common form of treatment for diabetes mellitus, constipation, and gonorrhea.
  • In some regions of the world, the herb’s various parts, such as the leaves, stems, and roots, have historically been used to treat a variety of ailments, including jaundice, allergies, burns, syphilis, fever, bronchitis, insect bites, eye infections, gonorrhea, and skin eruptions.
  • Nevertheless, it is still unknown what molecular processes underlie this plant’s ability to lower blood sugar levels.
  • The root component has also reportedly been shown to have weight-loss capabilities in addition to anti-diabetic properties.
  • Ancient Thai medicine also discovered its own health-beneficial properties, which are very similar to those discovered by Indian ayurvedic medicine.
  • Some studies stated that fruits from this plant show antimicrobial, antioxidant, and cell proliferative properties at moderate levels.
  • It can also contain other beneficial phytomolecules such as Terpenoids, Steroids, Flavonoids, Saponins, Tannins, Cardiac Glycosides, Alkaloids, Phlobatannins, and Resins in addition to naturally occurring carbohydrates, proteins, and vitamins.
  • Overall, few scientific studies recommended using this plant to develop natural drugs for the prevention and management of diabetes mellitus and its associated diseases.

Dondakaya Plant Farming Tips

Warm climates are ideal for the large propagation of the Dondakaya plants. A humid environment is advantageous for its overall growth. So, always consider the humid environment to successfully establish this plant.

However, extreme weather conditions, such as frequently heavy rain, extremely cold temperatures, and frost, will, however, make it impossible for it to survive.

It’s interesting to note that once it is well established in favorable soil or conditions, it may exploit them and grow like a weed for a longer period of time.

Ivy gourds can be propagated from both seeds and cuttings (i.e. vegetative propagation), which are the two methods available.
In a cool climate, you should plant ivy gourd seeds in the spring and summer when it’s warm outside.
The optimum germination temperature for Ivy gourd seed germination ranges from 20 to 30 degrees centigrade.

Vegetative propagation is incredibly simple and guarantees that your ivy gourd will bear fruit. As a result, this propagation has gained more popularity, especially, in agricultural propagations.

All you have to do is take a healthy, six to eight-inch-long semi-hardwood cutting from the self-fertile plant’s stem.

The plant cuttings you select should be strong and well-trimmed. The cutting should then be planted in soil that has been fertilized with some cow dung or vermicompost.

Ivy gourds prefer moist soil over dry soil, so water it frequently. When it’s hot or windy outside or when the plant is young, keep the soil evenly moist.

If you don’t put up a climbing stake, frame, or pole right away after planting, the plant will find its way there on its own and trample one of your favorite shrubs or cover the nearby plants, and eventually, it will make you feel like it is a weed. Moreover, if you don’t trim the vine if it gets more length, it can become extremely tall in fact, enormous.

The ivy gourd is typically a resilient climbing vegetable that is unaffected by any harmful pests or diseases.

But always observe the presence of common garden pests like aphids, whiteflies, mites, and thrips, because they are opportunistic pests. If they get adverse conditions, they infect any type of plant.

Moreover, you can try using pesticides or some natural remedies to get rid of the pests if the infestation is severe enough.

Nutritional Value of Dondakaya Vegetable

మనం వంటల తయారీలో ఉపయోగించే ఈ దొండకాయకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో చేసిన వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి దీనికి కారణం ఇందులో అధికమవుతాదులో పోషక పదార్థాలు ఇమిడి ఉండడం వలన.

దొండకాయలో 15% వరకు మన శరీర పెరుగుదలకు కావలసిన మాంసకృతులు లభిస్తాయి. తగిన మోతాదులో (4%) ఆరోగ్యానికి అవసరమైన మంచి కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు 15% వరకు ఉంటాయి. వీటితో పాటుగా మంచి మోతాదులో పీచు పదార్థం కూడా ఇందులో ఉంటుంది. అన్నిటికంటే మన శరీరం బరువు పెరుగుదలకు కారణమయ్యే కేలరీస్ చాలా తక్కువ మోతాదులో వీటిలో ఉంటాయి.

Ivy Gourd Nutritional Value per 100 grams.

వీటిలో ఉన్నటువంటి లవణాలు మరియు విటమిన్ ల గురించి చర్చించినట్లయితే….. మన శరీర జీవ క్రియకు అవసరమయ్యే లవణాలు ఇందులో ముఖ్యంగా క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మరియు ఫినాలేక్ కాంపౌండ్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. నాలుగు నుంచి ఐదు శాతం వరకు మనకు అవసరమయ్యే విటమిన్స్ కూడా విస్తృతంగానే ఇందులో లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ల తయారీకి ఉపయోగపడే బీటా కెరోటిన్ అధికమవుతాదిలో మనకు దొండకాయలలో లభిస్తుంది. ఈ బీటా కెరోటిన్ అనేది పండిన దొండకాయల కంటే పచ్చిగా ఉన్న దొండకాయలలో అధికమవుతాదిలో ఉంటుంది.

Vitamins and minerals in 100 grams of Ivy gourd vegetable

దొండకాయలలో మనం పైన చర్చించిన అన్ని విధాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీని…. కొంతమందికి ఇది ఆహారంగా తీసుకున్నప్పుడు వారిలో కొన్ని రకాల అలర్జీలకు కారణం అవ్వచ్చు. కనుక దొండకాయను తమ వంటకాలలో ఉపయోగించే ముందు…. అది వారికి అనుకూలమైన ఆహారమేనా…. లేదా… అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. చాలామంది దీనిని ఆహారంగా తీసుకుంటే జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని భ్రమ పడుతూ ఉంటారు. కానీ పరిశోధనల ప్రకారం ఇది ఖండించబడింది, అంతేకాకుండా కొన్ని రకాల పరిశోధనలలో దీనికి మెదడు పనితీరుని మరియు సామర్ధ్యాన్ని పెంచగలిగే శక్తి ఉందని గమనించడం గమనార్హం.

దొండకాయను కొన్ని ప్రాంతాలలో చిన్నపాటి పుచ్చకాయ అని కూడా పిలుస్తారు. దీనికి కారణం ఇది చూడటానికి పుచ్చకాయ లాగా పచ్చటి చారలు కలిగి ఉండడం. మన ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో దొండ ఆకులను మరియు దొండకాయలను కూడా ఎక్కువగా ఔషధాలు తయారీలో వినియోగిస్తూ ఉన్నారు. దొండకాయ ఆకు రుచిలో చేదుగా… పలుచగా… ఉండి దాని పసరు ఘాటైన సువాసనను వెదజల్లుతుంది.

దొండకాయకు ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిర్వచించడానికి కారణం, దీని కాయలలో ఆల్కలాయిడ్స్, శాపోనియన్స్, ప్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్ మరియు ఇతర రసాయన సమ్మేళనాలును కలిగి ఉండడం.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దొండకాయ మొక్క మొత్తం, అంటే మొక్క యొక్క ప్రతిభాగం ఔషధ గుణాలను కలిగి ఉండడం. ఇది యాంటీబయటిక్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, హైపో గ్లైసిమిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ అల్సర్, హెపటో ప్రొటెక్టివ్, యాంటీ మలేరియల్, మరియు యాంటీ క్యాన్సర్ గుణాలను అధికంగా కలిగి ఉండడం.

దీని ఆకుల నుంచి తీసిన పసురుని ప్రాచీన కాలంలో పచ్చకామెర్ల నివారణకు వాడేవారు. ఇప్పటికీ పల్లెలలో చాలామంది దీని పసరను సేకరించి అనేక రకాల రుగ్మతలను నివారించడానికి వినియోగిస్తున్నారు.

పూర్వకాలంలో పల్లె ప్రజలు తమ తమ పొలాలలో వ్యవసాయ సాగు కోసం పనులకు వెళ్లినప్పుడు, అక్కడ ఏమైనా గాయాలు తగిలిన, బెణుకు నొప్పులు కలిగిన, కాలికి ముల్లు గుచ్చుకున్న, దీని ఆకు నుంచి తీసిన పసురుని, నొప్పి ఉన్నచోట లేదా గాయం తగిలిన చోట, రాసేవారు. దీనికి యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండడం వలన ఇది గాయాన్ని త్వరగా మాన్పగలుగుతుందని వారి ఉద్దేశం. మరి కొంతమంది నిపుణుల ప్రకారం, మనకు ఎక్కడైనా కాలిన వెంటనే దీని పసరు పూచినట్లయితే కాలినచోట బొబ్బర్లు రాకుండా నిరోధిస్తుంది.

Benefits of dondakaya aaku in Telugu

Dondakaya leaf benefits and uses

యాంటీబయాటిక్ కూడా పనిచేయని కొన్ని వ్యాధులకు చెట్ల భాగాల నుంచి ముఖ్యంగా చెట్ల ఆకులు నుంచి కొత్త రకం యాంటీబయోటిక్స్ తయారు కాబడుతున్నాయి అంటే నమ్మడం కష్టమే. కానీ ఇప్పుడు ఉన్న యాంటీబయాటిక్స్ చాలా వరకు సాధారణ మందులుగా మారడమే కాకుండా కొన్ని సూక్ష్మజీవులకు ఆహారంగా కూడా మారిపోయాయి. అంటే దీనికి అర్థం యాంటీబయాటిక్ సూక్ష్మజీవులను నిర్మూలించకపోవడమే కాక వాటికి ఆహారంగా మారిపోయింది. దీనిని పరిగణలోకి తీసుకొని చాలామంది శాస్త్రవేత్తలు కొత్త రకాల యాంటీబయాటిక్స్ కోసం చాలా రకాల చెట్లను సేకరించి వాటిలోని విలువైన మూలకాలను సేకరించి వివిధ రకాల వ్యాధులపై మరియు వాటి ప్రభావాలను నిర్మూలించడానికి విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు.

ఈ తరుణంలో కొందరు శాస్త్రవేత్తలు దొండ చెట్టు ఆకులను సేకరించి వాటి నుంచి విలువైన మూలకాలను సేకరించి వాటి యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ ని విసదీకరిస్తున్నారు.

దీనికి సపోర్టుగా యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ దొండకాయ ఆకులను ఒక మంచి మెడిసిన్ గా దగ్గు మరియు జలుబు నివారణకు వినియోగించవచ్చు అని అధికారిక అనుమతిని ఇచ్చింది.

దొండకాయ ఆకులలో ముఖ్యంగా దాని నుంచి తీసిన రసంలో అధిక మోతాదులో శాపోనిన్స్ ఉంటాయని నిరూపించబడింది. శాపోనిన్సు ఎక్స్పెక్ట్ టొరెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే… మనకు దగ్గు చేసినప్పుడు మన ఊపిరితిత్తుల నుంచి నోటి వరకు విస్తరించి ఉన్న వాయునాళంలో పేరుకు ఉన్న గల్లను కరిగించి బయటకు నెట్టేయడమే. అదేవిధంగా దొండకాయ కు ఆంటీ స్పాస్మోడీక్ ప్రాపర్టీ కలదు. దీని ఉపయోగం మనకు కండరాలు ఎప్పుడైనా బిగుసుకుపోయినప్పుడు ఈ రసంలో ఉన్న మూలకాలు ఆ కండరాల బిగువును తొలగించి వాటి కదలికను సులభతరం చేయడమే. వీటితో పాటుగా దొండకాయ ఆకుకు బ్రాంకోడేయలేటింగ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. దీని అర్థం ఊపిరితిత్తుల యొక్క వాయునాళంలోని కండరాలను రిలాక్సేషన్ చేసి వాయునాళాల లోపలి పరిమాణం వెడల్పుగా చేయడమే. ఇలా చేయడం ద్వారా మన ఊపిరితిత్తులకు ఊపిరి సులభంగా చేరుతుంది.

Nutritional value and chemical composition of Ivy leaves

ఇవే పరిమితం కాకుండా దొండ ఆకుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ మరియు యాంటీ టసివ్ లక్షణాలు కలవు. దీనికి యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణం ఉన్నందువలన ఇది చాలా రకాల రుగ్మతలను మరియు చర్మపు వ్యాధులను నయం చేయగలదు. మరియు యాంటీ టసివ్ లక్షణం ఉన్నందువలన ఇది దగ్గు మరియు జలుబులను త్వరగా పోగొట్టగలదు.

మొత్తానికి దొండ చెట్టు యొక్క ఆకులు మరియు కాయలు మన ఆరోగ్యానికి మరియు అనేక రుగ్మతలను మన దరికి చేరనీయకుండా మనల్ని కాపాడుటలో చాలా సహాయపడతాయని ఈ పోస్టులో మనం పూర్తిగా తెలుసుకున్నాం.

గమనిక: మనం ఇప్పటివరకు చర్చించిన విషయాలన్నీ కేవలం ససమాచారం కొరకే. ఎవరైనా దొండకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను వినియోగించుకోవాలని ప్రయత్నించేవారు ముందుగా తప్పకుండా మీ యొక్క వైద్యాధికారిని సంప్రదించడం మంచిది. ఇప్పటివరకు నా యొక్క వివరణ మీకు నచ్చినట్లు అయితే దయచేసి కింద ఇవ్వబడిన మరికొన్ని ఆర్టికల్స్ ను చదవగలరు.

You may like reading these articles

Bangaru Teega Fish in English (బంగారు తీగ): Benefits, Facts, Price/Cost, FarmingRohu Fish in Telugu (తెలుగులో) and Its Benefits (Good or Bad for Health)
Senagapappu in English, Benefits, and Its Other NamesRoop chand Fish in Telugu- Benefits, Good or Bad for Health
Pesara Pappu in English, Benefits, Its Other namesMunagaku Uses or Benefits (మునగాకు ప్రయోజనాలు) in Telugu
Telugu Paryaya Padalu List (200 -పర్యాయ పదాలు తెలుగు లో)Moduga Chettu in Telugu, English: Leaf and Flower Uses (మోదుగ చెట్టు)
Korameenu Fish in English, Telugu, Its BenefitsThalli Palu Prayojanalu (Mother milk uses in Telugu)
Photo of author

Dr. Mastan GA

Dr. Mastan GA, Ph.D., is a scientific researcher. He holds a doctorate in biological sciences. Some areas in which he performs research include phytometabolites, medicinal compounds, and natural products. He specializes in microbiology, biotechnology, biochemistry, molecular biology, genetics, and medicinal and aromatic plants. He is the author of about ten research articles in international journals. With an ample interest in life sciences and nutrition, he writes articles on natural products, traditional foods, current research, and scientific facts. His goal is to assist others in learning the state-of-the-art of scientific discoveries in plant-based products, nutrition, and health.

Home

Stories

Follow

Telegram

Instagram