తేనే అనేది దేవుడు సృష్టించిన కొన్ని అద్భుతమైన పదార్థాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు. నేను ఎందుకు ఇలా అంటున్నానో ఈ బ్లాగు (Honey benefits in Telugu) చదివితే మీకే అర్థమవుతుంది.
స్వచ్ఛమైన తేనె ఈ కాలంలో దొరకడం చాలా కష్టమైపోయింది కారణం ప్రకృతిలో సహజంగా తేనెను పెట్టే తేనెటీగలు తగ్గిపోవడం వల్ల. ఎందుకు అంటే….? ఈ రేడియేషన్ వల్ల మరియు కొన్ని పర్యావరణంలో మార్పుల వల్ల తేనెటీగల సంఖ్య తగ్గిపోయింది.
ఉదాహరణకు చెట్లు నరికి వేయడం, వర్షాలు పడక పోవడం పుష్పించే మొక్కలు లేకపోవడం, అడవులు కాలిపోవడం వంటివి జరగడం వల్ల స్వచ్ఛమైన తేనె దొరికే పరిస్థితి చాలా వరకూ కష్టంగా మారింది.
ఇప్పుడు తేనె వల్ల మనం ఎలాంటి ఉపయోగాలు పొందుతాము చూద్దాం.
Honey benefits in telugu
చరక సంహితని బట్టి తేనెలో నాలుగు రకాలున్నాయి, అవి భ్రమర, క్హౌథ్ర, మక్షిక, మరియు పైత్తక. ఇందులో మక్షిక అనే తేనెకు చాలా మంచిదిగా, చాల మెడిసినల్ ప్రోపర్టీస్ ఉన్నాయని పరిశోధనలు చేసి దీని యొక్క మంచి గుణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
వీటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం.
మొత్తంగా…..స్వచ్ఛమైన తేనెను కంటి చూపు మెరుగు పరచడానికి, గొంతులో సూక్ష్మ జీవులు వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి, ఆస్తమాను తగ్గించడానికి, ఊపిరితిత్తుల వ్యాధి అయినా ట్యూబర్క్యులోసిస్ (టీబి) నుంచి త్వరగా కోలుకోవడానికి, కొంతమందికి దాహం ఎక్కువ వేస్తుంది అలాంటివారికి ఎక్కువ దాహం వేయకుండా కంట్రోల్ చేయడానికి. కొంతమందికి ఎక్కుళ్ళు విపరీతంగా వస్తుంటాయి వాటి నుంచి ఉపశమనం పొందడానికి, కొందరు ఎక్కువగా నీరసించిపోతారు వారు రోజు తేనే తీసుకోవడం వల్ల వారిలో నీరసాన్ని పోగొట్టవచ్చు.
కొందరికి మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఉదయం కొంచెం తేనే సేవించడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Buy Pure & Natural Honey Online
అల్సర్ తో బాధపడుతున్నవారు తేనే సేవించడం వల్ల దీని నుంచి కొంచెం ఉపశమనం పొందవచ్చు.
మరికొందరు ఎప్పుడు వాంతివచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వారు తేనే వాడడం వల్ల కొంత మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.
సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం తేనెకు కీళ్లనొప్పులను విరోచనాలను రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో పెట్టే సామర్థ్యం ఉందని నిర్ధారించబడింది. మనకు తేనెను గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మనమే గ్రహించవచ్చు.
మీరే చూడండి…. ఎప్పుడైనా స్వచ్ఛమైన తేనెను డబ్బాలో పోసి కొన్ని సంవత్సరాల వరకు నిల్వ ఉంచినా కూడా దాని యొక్క స్వభావం మారదు అదే బెల్లం లేదా చక్కెరతో చేయబడ్డ ద్రవాన్ని గాని కొన్ని రోజులు నిల్వ ఉంచినా చాలు అవి పాడైపోతాయి. ఇవి చెడిపోవడానికి కారణం వాతావరణం లో ఉన్న సూక్ష్మజీవులు ఈ ద్రవంలో ని చక్కెరను పులియ బెట్టడమే. మరి తేనె ఎందుకు సూక్ష్మజీవుల చేత పులియ బడదు అంటే తేనె లో చక్కెరతో పాటు ఉన్న ఆంటీ మైక్రోబియల్ కాంపౌండ్స్ సూక్ష్మజీవుల పెరుగుదల ను అదుపులో ఉంచుతాయి అందుచేత, తేనే అనేది ఎక్కువ రోజులు నిల్వ చేయబడుతుంది.
దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, తేనెకు సూక్ష్మజీవులను నిరోధించేశక్తి ఉందని అది సేవించడం వల్ల మన శరీరంలోని చెడు బ్యాక్టీరియా, ఫంగై, మరియు వైరస్లను అదుపులో పెట్టుకోవచ్చని.
తేనెను సేకరించు విధానం (How to extract honey):
తేనెను రెండు రకాలుగా సేకరిస్తారు అందులో ఒకటి ప్రాచీనకాలం నుంచి అమలు చేస్తున్న పద్ధతి, మరోకటి యాంత్రికంగా సేకరించడం.
1. ఈ ప్రాచీన పద్ధతిలో తేనె కోసం తేనె తుట్టు చుట్టూ పొగ పెట్టడం తేనెటీగలను తరిమికొట్టడం ఈగలు లేని తుట్టునుంచి తేనెను పిండి తీయడం.
ఈ ప్రాచీన పద్ధతిలో తేనె తుట్టు నుంచి ఎక్కువ తేనె పొందడానికి సేకరించిన తుట్టును కొందరు ఒక జల్లెడ లాంటి గిన్నెలో పెట్టి దాని కింద ఒక పెద్ద పాత్రను పెట్టి దాని చుట్టూ మంట పెడతారు. ఇలా చేయడం ద్వారా పైన ఉన్న తుట్టుకు వేడి బాగా తగిలి దాని నుంచి అధిక మోతాదులో తేనె సేకరించబడుతుంది.
2. యాంత్రిక పద్ధతి లో తేనెపట్టును ఒక పెద్ద కంటెయినర్లలో వేసి దానిని సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ అంటే, తేనె తుట్టు ఉన్న పాత్రను ఒక నిర్దిష్ట కోణం లో ఉంచి, దానిని అతివేగంగా తిప్పడం. ఈ వెగ్గనికి తేనె తుట్టు నుంచి తేనె వేరు చేయబడుతుంది. ఈ పద్ధతి ద్వారా తేనె తుట్టును చెదపకుండా కాపాడవచ్చు. ఇలా కాపాడిన తుట్టును మరల తేనెటీగలకు ఇవ్వడం వల్ల దీని నుంచి మరల తేనెను పొందడానికి అవకాశాలు ఎక్కువ.

ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తేనె యొక్క పాత్ర (honey health benefits in telugu):
ఇది మన అందరకి ఇళ్లలో దొరికే ఒక పదార్థం కాబట్టి దీనిని ఉపయోగించి చాలా ఆరోగ్య సమస్యలను నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇందులో కొన్ని ఇప్పుడు చూద్దాం..
1. శారీరక ఒత్తిడి: ఒక టేబుల్ స్పూన్ తేనెను ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శారీరక ఒత్తిడిని అలసటను తగ్గించుకోవచ్చు.
2. నిద్రలేమి: తేనె తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు అని ఆయుర్వేదం చెబుతుంది.
3. కంటి చూపు: క్యారెట్ జ్యూస్ తో తేనెను కలుపుకొని తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.
4. శ్వాస కోసం: తేనెను cinnamon కాడ నుంచి తయారు చేసినా పోడిలో కలిపి దానిని కొంత నీటిలో కలిపి రోజు నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల గొంతు, ముక్కు శుభ్రపడి శ్వాసను బాగా తీసుకోవచ్చు.
5. పంటి నొప్పి: పంటి నొప్పి ఉన్నవారు తేనెతో వారం పాటు తమ పనులను మర్దనా చేయడం వల్ల నొప్పినుంచి ఉపమనం పొందవచ్చు. ఇలా చిన్న పిల్లలకు చేయకుడదు అని ఆయుర్వేదం చెబుతోంది.
6. గొంతు నొప్పి: నిమ్మరసం, మిరియాల పొడితో తేనెను కలిపి నీరు లేకుండా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఒక స్పూన్ తీసుకోవడం వల్ల, ఒక రోజులోనే గొంతు నొప్పి నుంచి లేదా గొంతు మంట నుంచి ఉపశమనం పొందవచ్చు.
7. జలుబు దగ్గు: కొంచెం తేనెను అల్లం పేస్టు తో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గును నయం చేయవచ్చు.
8. ఆస్తమా: ఆస్తమా ఉన్నవారు నల్ల మిరియాల పొడి, అల్లం జ్యూస్త్ తో తేనెను కలిపి తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
9. ఎక్కిళ్ళు: కొందరికి అస్తమానం ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, అలాంటి వారు కొంచెం తేనెను పాలలో కలుపుకొని సేవించడం వల్ల ఎక్కిళ్ళను ఆపవచ్చు.
10: వాంతి: మనలో కొందరికి నచ్చని పదార్థాన్ని తిన్నా లేదా దూరప్రయాణాలు చేసిన, వాంతి వచ్చినట్లుగా ఫీల్ అవుతారు. అలాంటి సమయంలో కొంచెం తేనెను లవంగాల పొడిని, బొరుగుల (మరమరాలు) మిశ్రమాన్ని తినడం వల్ల వాంతి నుంచి ఉపశమనం పొందవచ్చు.
11. కడుపులో మంట: కడుపులో మంటతో బాధపడుతున్నవారు నీటితో కలిపిన కొంత తేనెను సేవించడం వల్ల కడుపులోని మంటను తగ్గించుకోవచ్చు.
12: విరోచనాలు: విరోచనాలకు విరుగుడుగా తేనెను Cyperus rotundus చెట్టు వేరుతో డికాక్షన్ చేసుకుని తాగ వచ్చు.
13: రక్త విరోచనాలు: రక్త విరోచనాలతో బాధపడేవారు, తేనెను పైన చెప్పిన విధముగా చెట్టు వేరుతో డికాక్షన్ తీసుకోవడం వల్ల రక్త విరోచనాలకు కారణమైనా బ్యాక్టీరియాని నిర్మూలించి విరోచనాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
14. అతి మూత్ర విసర్జన: అతిగా మూత్రం విసర్జించే వారికి తేనెను Phyllanthus emblica ఫ్రూట్ జ్యూస్ తో కలిపి తీసుకోవడం వల్ల అతి మూత్ర విసర్జనను అదుపులో పెట్టుకోవచ్చు.
15. హైపర్ టెన్షన్: తేనెను గార్లిక్ జ్యూస్ తో కలిపి తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును అదుపులో పెట్టవచ్చు.
16. డయాబెటిస్ మెల్లిటస్: తేనెను Gossypium herbaceum విత్తనాలతో చేసినా పొడితో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.
17. ఒబెసిటీ: శరీరంలోని క్రొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి, రక్తాన్ని శుభ్రపరచడానికి ప్రతిరోజూ తేనెను గార్లిక్ జ్యూస్ కలిపిన వేడి నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.
18. కీళ్ల నొప్పులు: కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కొబ్బరితో చేయబడిన వినిగర్ తో కొంచెం తేనెను కలిపి సేవించడం వల్ల కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు.
19 కాలిన గాయాలు: తేనెతో కాలిన చోట మర్దనా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుకోవచ్చు.
20. పుండ్లు మరియు గాయాలకు: పుండ్లకు మరియు గాయాలకు తేనెను పూయడం వల్ల త్వరగా మానుతాయని పరిశోధనలలో తేలింది.
21: శుక్రకణాల వృద్ధి: శుక్రకణాల కొరతతో బాధపడుతున్నవారు కొంచెం తేనెను మేక పాలతో కలిపి తాగడం వల్ల శుక్రకణాల సంఖ్యను పెంచుకోవచ్చు.
22: కామెర్లు: కామెర్లు వచ్చినప్పుడు తేనెను Andhathoda vasics జ్యూస్ తో కలిపి సేవించడం వల్ల కామెర్లు నుంచి ఉపశమనం పొందవచ్చు.
23.డీహైడ్రేషన్: తేనెను కలిపిన నీటిని త్రాగడం వల్ల డీహైడ్రేట్ అయిన శరీరాన్ని తిరిగి రీహైడ్రేటె చేయవచ్చు.
24. శిరోభారం(hangover): తేనెను ఆరెంజ్ జ్యూస్ తో సగం కప్పు కలిపి సేవించడం ద్వారా శిరోభారం నుంచి ఉపశమనం పొందవచ్చు.
Related topic: Avise ginjalu benefits in Telugu.