తల్లిపాలు అనేవి బిడ్డకు సహజమైన ఆహారం. పెరిగే బిడ్డకు సరిపడినంత పోషక మరియు సూక్ష్మ పోషకాలు తగినంతగా తల్లిపాలలో ఉంటాయి, మరియు బిడ్డ ఎదుగుదలకు ఈ తల్లిపాలు తోడ్పడతాయి. తొలిదశలో బిడ్డకు వచ్చే అంటు వ్యాధులు, జ్వరం నుంచి రక్షించే శక్తి తల్లిపాలకే ఉంది. ఇది తల్లి బిడ్డ ఇద్దరకీ శ్రేయస్కరము.
తల్లి పాలు (Mother milk or Breast milk) ఇవ్వడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు (Mother milk uses in Telugu):
ఎప్పుడు అవసరమైతే అప్పుడు తల్లిపాలు ఇవ్వవచ్చు, మరియు తల్లి పాలు వృథా అయ్యే అవకాశం ఉండదు.
కుచించుకుపోయిన గర్భసంచి ఉత్తేజితమై, తల్లికి సుఖ సంతోషాలను అందిస్తాయి.
వెచ్చని తల్లి ఒడిలో నిద్రించే బిడ్డ వలన, తల్లీబిడ్డల ఆత్మీయత, ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది.
ప్రసవానంతరం ఆ క్లిష్ట దశ నుంచి బయటపడిన తర్వాత, బిడ్డను చనుపాల కోసం తల్లి కి దగ్గర చేస్తారు. ఇది 10 లేదా 12 గంటల నుండి 24 గంటలు పట్టవచ్చు, దీని తరువాత తల్లి రొమ్మును బిడ్డ ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక్కొ రొమ్ము ను 4 నుంచి 7 నిమిషాలు పాటు చీకవచ్చు, ఇలా క్రమేణా బిడ్డ పాలు తాగడం నేర్చుకుంటుంది. పాలకు ముందు వెలువడే ద్రవము కూడా బిడ్డను తల్లి దగ్గర పాలు తాగేల ఉత్తేజపరుస్తుంది.
తల్లిలో పాలధార మొదలుకాగానే బిడ్డకు మూడు నుంచి నాలుగు గంటల వ్యవధిలో పాలు ఇవ్వవచ్చు.
మొదట్లో బిడ్డ ఆకలిని గమనించి పాలు ఇవ్వాలి. బిడ్డ పెరిగే కొద్దీ ఒక క్రమ పద్ధతిలో బిడ్డకు పాలు ఇవ్వాలి.
తల్లి ఆరోగ్యం బాగా ఉన్నంతకాలం చనుబాలు ఇవ్వవచ్చును. బిడ్డకు 5 లేదా 6 నెలలు వయస్సు వచ్చేసరికి తల్లి పాలు సరిపొక పోవచ్చు , అలాంటప్పుడు పూర్తిగా తల్లి పాల పైనే ఆధారపడకుండా తరచు ఆహారం ఇవ్వాలి.
తల్లిపాలు ఇవ్వకూడని సందర్భాలు:
తల్లికి క్షయవ్యాధి, రొమ్ముక్యాన్సర్, కుష్టు వ్యాధి ఉన్నప్పుడు తల్లి నుంచి బిడ్డకి చనుపాల ద్వార వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ, మరియు తల్లికి మానసికమైన ఒత్తిడి ఉన్నప్పుడు, తల్లి గుండె జబ్బులు మూత్రపిండాల వ్యాధి తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు తల్లి పాలు ఇవ్వకూడదు. తీవ్రంగా టైఫాయిడ్, నిమోనియా వ్యాధి తల్లి కి వచ్చినప్పుడు, రొమ్ము నొప్పి, రొమ్ము మొనలు పగలటం, రోమ్ములపై లోతైన పగుళ్ళు ఏర్పడటం జరిగినప్పుడు బిడ్డకు అంగిలి పగలటం నోరు పుండు కావడం జరుగుతుంది. బిడ్డ సరిగా పాలు చప్పరించ లేని పరిస్థితి ఏర్పడినప్పుడు చనుపాలు ఇవ్వడం నిలిపివేయాలి.
గమనిక: గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి. ఆరోగ్య విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి.